మందేరా గొప్ప....








మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  


జాతి బేధము అసలే లేదు


కులమతాలతో పనియే లేదు


ఆడ మగల తేడా లేదు


మత్తు దిగిందా ఇక స్వర్గము చూడు





నడకలు రాని రోజులు తెలుసా ఇప్పుడు చూసుకో


కష్టాలు తెలియని చిన్నతనాన్ని గుర్తుచేసుకో


తప్పు కాదిది తప్పే కాదు


తప్పుటడుగుల తొలిరోజులు


ఒప్పు కాదిది ఒప్పే కాదని


ఒప్పుకుంటే మరి తప్పు


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





చూసావా ఆ జెండా గాలికి ఆడట్లేదు 


మత్తు మంత్రులు ఎగరేసిన మహిమ


దానికి కూడా దిగులు కాబోలు


దానిని పట్టించుకునే ప్రభుత్వానికి కూడా 


మందంటే తారక మంత్రము 


అ మంత్రము చెబుతూ కూటమి వేసి


మనకు కావాలి  స్వరాజ్యమనరా


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





మందు లేని అ సీసా చూడు


మన తలరాతలు చూడు


తన దిగులంత మనకిచ్చి


మన దిగులును పోగొట్టే త్యాగశీలి


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా  





అందరిని ఒకలా చూపుతుంది


కాని మన దారిని వేరు చేస్తుంది


అభిమానం మరీ ఎక్కువైతే


మెలుకవ రాని నిదురనిస్తుంది


మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా

  

2 comments:

సుభ/subha said...

చూసావా ఆ జెండా గాలికి ఆడట్లేదు
మత్తు మంత్రులు ఎగరేసిన మహిమ
అభిమానం మరీ ఎక్కువైతే
మెలుకవ రాని నిదురనిస్తుంది
ఇలాంటి పదజాలంతో మందు చేసే ముప్పు గురుంచి చెప్పకనే చెప్పారు.బాగుంది.తెలిసినా తెలియనట్టు ఉంటారు అంతా.
ఏదేమైనా కల్యాణ్ గారూ మంచి అనుభవజ్ఞానము ఉన్నట్టు చక్కగా చెప్పారు ;)

Kalyan said...

@సుభ గారు అన్నన్నా ఎంత మాట ఎంత మాట నాకు నీలు తాగడంలో పాలు తాగడం లో అనుభవజ్ఞానము ఉందండి ఇందులో కాదు :) అది అనుభవిస్తే ఎలా ఉంటుంది అని ఓ ఆలోచనతో రాసాను పైగా నేటి పరిస్థితులను కాస్త సోడా లాగ కలిపాను అంతే .. మళ్ళి సోడా కూడానా అనకండి :-P

శిఖరం

నా చూపులు శిశిరాన ఎండుటాకులా రాలుతోంది నీ శిఖరాలపై... 🩵