చినుకు చినుకు నవ్వు నవ్వు

చినుకు చినుకు రాలి కడలి పొంగినా,
నీ నవ్వు నవ్వు నింపిన వాగుకంటే చిన్నదే...

ఎవరు నిన్ను చూసిన ఇలాగే అంటారు

నీ చూపుల లోయ
లోతెంతుందో,
పడిపోయిన నా మనసును అడుగు,
నీ అందపు గంధము రాసుకున్న
నా చూపులకి,
ఇంకేదైనా కనిపిస్తుందేమో అడుగు,
ఇంత  సొగసా అని ఆగిపోయిన నా మాటను అడుగు,
అవి చెబుతాయి,
ఎవరు నిన్ను చూసిన ఇలాగే అంటారని..

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...