Showing posts with label నడక. Show all posts
Showing posts with label నడక. Show all posts

నత్త నడక


నత్త తన శ్లేష్మం సహాయంతో పదునైన కత్తిపై గాయపడకుండా కదలినట్లు, నేను నా ప్రేమ సాయంతో నీ పదునైన మనస్సుపై నడవగలను గాయపడకుండ..

Like the snail can move on a sharp razor with help of it's mucus, I can walk on your heart without getting hurt as I am protected with the layer of love...

💞

ఇంకెంత నడిపించాలో నా చూపులను



నా చూపులను కొన్ని వేల మైళ్ళు నడిపిస్తే కానీ నీ జానెడు కళ్ళ అందాన్ని తనివితీరా చూడలేకపోయాయి, మరి నీ అందమంతా తెలుసుకోవాలంటే ఇంకెంత నడిపించాలో తెలియట్లేదు నా చూపులను..

I need to endure an odyssey with my eyes to witness such profound elegance. It took me thousands of kilometers to traverse from the corner of one eye to the other, and I am uncertain about the distance required to define it further and explore the intricacies with elegance...

💞


నడక నేర్చిన సంద్రం దిశను మార్చే నది


నువ్వు నడక నేర్చిన సంద్రానివి, నేను దిశను మార్చగల నదిని, ఏ నేల ఏంచుకుంటావో ఏ లోయ ఎంచుకుంటావో ఎంచుకో, నీ వెంటే ఉంటాను నిన్ను చేరాలనే తపిస్తుంటాను...

You are the ocean that has learned to walk; I am a river that can change my direction. Choose whichever soil you want, whichever valley you want to settle; I will follow you and keep longing to join you...

💜💜💜

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి ఎంతందం ఎంతందం,
కాలిబాట పట్టిందో వెన్నెలమ్మ రేపటికి ఏంచందం ఏంచందం,
నడుమే ఊగకుండా నడక నేర్చింది,
కదిలే జాడ కూడా తెలియకుండ పోతోంది,
తెరిచిన కనులలోనే కలలా పూసిందంటే, కనులు మూస్తే మరి ఆ రెప్ప వెనుక కథలో ఏమౌతుంది...

What did the night feed the moon, that it grew so beautifully? It seems like it has already started its journey to tomorrow. What a lovely sight to watch. It learned how to walk without a waver in its hip. Even if you watch closely the movement is not imperceptible. With this, dreams are blooming in wide-awake eyes. What might occur in the dreams that unfurl behind closed lids?

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...