చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో














చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో

చక చక నడుచుకుంటూ పరిగెడుతూ ఉంటుంది

కొండైనా అది చక్కెరైతే నిమిషంలో కరిగిస్తుంది

పోట్టిధైనా గేట్టిదే తనకు మూడింతలు మోస్తుంది

ఎవ్వరికిందా పని చేయదు స్వాభిమానం కలది

పుట్టలు మేడలు కట్టేస్తుంది ఏ అడ్డమైనా ఎక్కేస్తుంది

దోచుకోదు ఎప్పుడు కావలసినది దాచుకుంటుంది

కష్టమైనా చేసుకుంటూ కాలం గడుపుతుంది

క్రమశిక్షణ కలది అది కొలవలేనిది


4 comments:

జ్యోతిర్మయి said...

నిజమే! చీమను చూసి మనం చాలా నేర్చుకోవాలండీ..
ఒక్క క్షణం వృధా చేసినట్లుండదు. క్రమశిక్షణకు మారుపేరు. భవిష్యత్తుకోసం ఎన్నో ప్రణాళికలు వేస్తుంది. ఐకమత్యానికి పెట్టింది పేరు. చిన్నదైనా గొప్ప టపా వ్రాసారు. బావుంది కళ్యాణ్ గారూ..

రసజ్ఞ said...

సూక్ష్మంలో మోక్షం చూపించడంలో కళ్యాణ్ గారి తరువాతే ఎవరయినా! చిన్న విషయాన్ని తీసుకుని ఎన్నో వ్రాసేసి మరెన్నో జ్ఞాపకాలని తట్టి లేపుతారు! రసాయనికంగా మాట్లాడుకునే ఈ చీమలు తమ శరీర బరువుకన్నా ఇరవయి రెట్లు అధిక బరువుని మోస్తాయి! నిస్వార్ధ జీవులు కూడా! చీమలంటే కుట్టి కుట్టి చంపుతాయని విసుక్కునే నేను మొదటిసారిగా వాటిని ఇష్టపడం మొదలుపెట్టింది మాత్రం THE ANT BULLY అనే చలనచిత్రం చూసాకనే! ఎంత బాగా చూపించాడో వాటి జీవన విధానం అందులో!

Kalyan said...

@జ్యోతిర్మయి గారు నా బల్ల పైన అది తిరుగుతుంటేను చక చక చూసా అభ ఎంత చురుకుగా వుందో ఇది, అని దానికి అంకితం చేసి మనకు చాలా నేర్చుకోవాలి దాని గురించి అనుకోని రాసాను. అవును గొప్ప జీవి చీమ కుట్టడం లోనే కాదు కష్టపడటం లో కూడాను. ధన్యవాదాలు :)

@రసజ్ఞ హహహ సూక్షంలో మోక్షం ఏమో కాని ఇక్కడ నా ఆలోచనే సూక్ష్మం దాని పనితనం ముందు అనే చెప్పాలి. ఓ మీరు కూడా ఇష్టపడతార బాగుంది బాగుంది. అయితే అ సినిమా ఓ సారి చూడాలి . మంచి విషయం చెప్పారు. నాకు బోర్ కొట్టింది అంటే వాటితో కాలక్షేపం చేస్తాను కాసేపు. ధన్యవాదాలు :)

సుభ/subha said...

ఇంకేం వ్రాయను? వాళ్ళ మాటే నా మాట అనుకోండి కల్యాణ్ గారు... చీమల్లో ఎన్ని రకాలున్నాయో తెలియదా రసజ్ఞ గారూ మీకు. అది వదిలేసారే. నేనెప్పుడొ చదివినప్పుడు 3,500 రకాలు మాత్రమే. కానీ ఇప్పుడు 14,000 పై చిలుకే అని తెలిసింది. ఇంకా ఉన్నాయేమో అని కూడా పరిశోధనలు జరుగుతున్నాయటండీ. మీరు చెప్పిన movie కన్నా మొదట వచ్చిన movie ఇంకొకటి ఉంది. అదే 1998 లో విడుదలైన THE ANTS. అది కూడా చాలా బాగుంటుంది. మొత్తానికి చాలా మంచి విషయాన్ని చక్కగా చెప్పారు కల్యాణ్ గారు.

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...