Showing posts with label రాత్రి. Show all posts
Showing posts with label రాత్రి. Show all posts

తీరని ఆకలి


నేతి రుచి చూసిన కొలిమికి ఇంకా ఆకలి ఎక్కువ అయినట్టు, ఎన్ని వెన్నల రాత్రులు వచ్చిన్నా చీకటికి కోరిక తీరనట్టు, నీ ప్రేమ రుచి చూసిన నా మనసుకు కోట్ల జన్మల ఆకలి కలుగుతోంది...

As a hearth, once tasting fuel, yearns endlessly for more,
And darkness, despite countless moonlit nights, still craves for more,
So too, my heart, having known the taste of your love,
Burns with a hunger that will last for infinite lifetimes...

🩵

నీ ప్రేమ వేగం


కొన్నేళ్ల పాటు ప్రయాణించిన కాంతి కంటే నీ ప్రేమ వేగం ఎక్కువ, నక్షత్రాల కూటమి కంటే నీ ప్రేమ బరువు ఎక్కువ, ఈ చీకటి రాత్రి అంత హృదయం ఉంటే తప్ప నీ ప్రేమను నిలుపుకోవడం సాధ్యం కాదుగా...

Your love is faster than the light that has traveled for years, your love is heavier than the constellation of stars, it's not possible to hold your love unless one has the heart the size of this dark night....

आपके प्यार की रफ्तार, बरसों का सफर तय कर चुकी रोशनी से भी तेज है। आपका प्यार, तारों के समूह से भी ज्यादा भारी है। इस घने अंधेरे रात जितना विशाल दिल ना हो, तो आपके प्यार को समेट पाना नामुमकिन है।...

💞

లెక్కలు నేర్చిన రాతిరి


ఈ రాత్రికి లెక్కలు బాగా వచ్చినట్టు ఉంది, భావాలను గుణించి మన మధ్య దూరాన్ని మరింత హెచ్చిస్తోంది...
I believe the night understands mathematics, as it multiplies the feelings and is dividing us by distance...

💞

నా చూపు నీ వైపు


చీకటిలో ఉన్నాను, ఎన్నో వెలుగు జిలుగులు నా చుట్టూ, కానీ చీకటి మట్టుకే నాకు కనిపిస్తోంది, ఎందుకంటే నా చూపుదూరంగా ఉన్న రాతిరి నింగి వైపు, వేచి ఉన్నా నీ వెలుగు కొరకు...

I find myself amidst numerous lights, but despite their glow, I am in the dark. My attention is fixed on the far night dark sky, eagerly anticipating the radiance of your light..

💞

కలలకు మరుజన్మ ఉంటే చాలు


నీతో మరుజన్మ అక్కర్లేదు,
 నీతో ఉన్నట్టు కన్న కలకు ప్రతి రేయిన మరుజన్మ ఉంటే చాలు...

I don't want to be reborn with you, but it's sufficient that the dream of you with me experiences a rebirth every night...

💞

నీ దాగుడుమూతలు సాగుతూనే ఉంటాయి


ఓ నెలవంక నిన్ను పున్నమిలో చూశాను, అమావాస్యలో మాయం అవ్వడం చూశాను, ఇప్పుడు నువ్వు ఎంత కనిపిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎందుకంటే నీ దాగుడుమూతలు సాగుతూనే ఉంటాయి...

Oh crescent moon, I've seen you full and watched you fade away. It doesn't matter how much you show now, your cycle just keeps going...

💞

పిచ్చి ప్రేమ


మసి పూసి ఆకాశాన్ని నల్లగా చేశా,దానిపై పాల చుక్కలు చల్లి తారకలను రప్పించేసా, ఎంత త్వరగా చీకటి పడితే అంత త్వరగా వస్తావని! అయినా ఓ వెన్నెల నన్ను పిచ్చోడిని అనుకోకు, నీ ప్రేమలో పడ్డ నాకు ఏది పిచ్చిగా అనిపించట్లేదు...

I took some ash and blackened the sky, sprinkled drops of milk on it, and created the stars. The sooner it gets dark, I wished, the sooner you will come. But don't think I'm mad, oh moon; being crazy is normal after falling in love with you...

💞

ఆకాశానికి గండి పెట్టి


చీకటిని మోసగించి వేకువను తెప్పించి నిన్ను మేలుకొలిపి మాట్లాడాలనే తపనతో నీపై ఉన్న రాతిరి ఆకాశానికి గండి పెట్టి కాస్త వెలుగు తెప్పించాను...

I tried to create a hole in the part of the night sky which is covering you, allowing some light to pass through, in an attempt to trick the nature into waking you up so we could talk...

💜💜💜


మల్లె సరాలు



వెండి వెలుగులు నీ వెన్ను మెరుపులు,
ఆ మల్లె సరాలు నక్షత్ర మండలాలు,
చీకటి ఆవల ఏముందో అనే ప్రశ్న కంటే,
ఆ చీకటి కురుల వెనక ఎవరా అన్న ఆరాటం ఎక్కువైందే.....

Your back is throwing the silver shine,
The string of jasmine flowers is like constellations,
Rather than finding what is behind the night sky,
The desire to know who is behind the dark hair is increasing...

💜💜💜

నీ చెంత ఉంటే కలిగే తాపం



వేల రకాల పూలు తోటలో ఉంటే ఏ పువ్వు పరిమళాన్ని ఆస్వాదించాలో తెలియక సతమతమౌతూ మనసు పడే కష్టమే నీ చెంత ఉంటే కలిగే తాపం...

If there are thousands of varieties of flowers in the garden, it is difficult to know which flower to enjoy the fragrance of. The same struggle happens when I am with you...

💜💜💜

చేరువ కావడానికి మరొక్క అవకాశం



ఎంత పెద్దదో ఈ రాత్రి నువ్వు లేకుండా, ఓడిపోయేనా నా ఆశ విధి లేకుండా, అయినా ఇది ఓటమి కాదు, నీకు ఇంకా చేరువ కావడానికి మరొక్క అవకాశం...

How lengthy this night is without you! My hope is lost without any choice, but this is not failure; it is just a hurdle to cross to stay closer...

💜💜💜

ఆగిపోయాయి అన్నీ

మేఘాలన్నీ ఆగిపోయి దారి ఇవ్వట్లేదు అంటోంది ఈ రాతిరి, చీకటి నుంచి వేకువకు తన ప్రయాణం ఆగిపోయింది,
వెలుగు పురివిప్పి నువ్వు అందాన్ని చల్లుతుంటే, మత్తులో తూలి ఆగిపోయాయి అన్నీ..

The night complained that all the clouds had stopped and did not give way. Its journey from darkness to dawn came to a halt when you spread the wings of light and sprayed your beauty all over the sky. It intoxicated everything, causing everything to come to a stop..

💜💜

భూలోకపు వెన్నల

ఎన్నో అద్భుతాలకు నెలవు, లెక్కించలేనన్ని తారలు, ఎన్ని లేవు తన దగ్గర అయినా సందేహంతో అడిగాను చీకటి ఆకాశాన్ని, తను రెప్ప వాల్చినపుడు కలగంటుందా అని,
అవునని అంటోంది నిన్ను చూసి కలకంటుందని, నువ్వే తన భూలోకపు వెన్నలని....

Home to wonders and infinite galaxies, I harbored doubts as I questioned the night sky: Could it dream after closing its eyes? In response, it revealed that it dreams by looking at you and you are its earthly moon...

💜💜

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి ఎంతందం ఎంతందం,
కాలిబాట పట్టిందో వెన్నెలమ్మ రేపటికి ఏంచందం ఏంచందం,
నడుమే ఊగకుండా నడక నేర్చింది,
కదిలే జాడ కూడా తెలియకుండ పోతోంది,
తెరిచిన కనులలోనే కలలా పూసిందంటే, కనులు మూస్తే మరి ఆ రెప్ప వెనుక కథలో ఏమౌతుంది...

What did the night feed the moon, that it grew so beautifully? It seems like it has already started its journey to tomorrow. What a lovely sight to watch. It learned how to walk without a waver in its hip. Even if you watch closely the movement is not imperceptible. With this, dreams are blooming in wide-awake eyes. What might occur in the dreams that unfurl behind closed lids?

💜💜

రాత్రికి రంగు వేయడం తెలియదు

రాత్రికి రంగు వేయడం తెలియదు కానీ అంతా నల్లగా మారుతుంది, నీ మౌనానికి మోసగించడం తెలియదు కానీ నా మనసును తోలచివేస్తుంది...

Night doesn't color anything but everything at night appears dark,
Your silence doesn't mean to hurt but it tears down my heart...

💜

నీతో ముగుస్తుంది

రోజును రాతిరితో ముగించాలన్నది సృష్టి,
కానీ నా ప్రతి రోజు నీతో ముగుస్తుంది..

What god created is to end the day with night,
But what happened is to end evryday with you..

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...