Showing posts with label కనులు. Show all posts
Showing posts with label కనులు. Show all posts

మరో జన్మలోనూ కొనసాగే ప్రయాణం



నీ కళ్ళకి పెదవులకి ఉన్న దూరమే నేలకు అంతరిక్షానికి ఉన్న దూరం, మరి నీ అందమంతా చేరుకోవాలి అంటే, అది మరో జన్మలోనూ కొనసాగే ప్రయాణం...

The distance between your eyes and lips is as vast as that between the earth and the sky. To reach all your beauty, it would be a journey that would continue even in another life...

आपकी आँखों और होठों के बीच की दूरी पृथ्वी और आकाश के बीच की दूरी जितनी ही विशाल है। आपकी सारी सुंदरता तक पहुँचने के लिए, यह एक ऐसा सफर होगा जो दूसरे जीवन में भी जारी रहेगा...

🩵

ప్రేమ దూతగా వాలాయి నీ చూపులు


రెక్కలు ఉన్నా ఎగరలేని పక్షులు కదా నీ కనులు, అందుకేనేమో ప్రేమ దూతగా వాలాయి నీ చూపులు...

Your eyes, though winged, cannot fly,
Perhaps that's why your gaze descended as a love messenger...

पंख होते हुए भी न उड़ सकने वाले पक्षी हैं तेरी आंखें, शायद इसीलिए प्यार के दूत बनकर तेरी निगाहें उतरी हैं....

🩵

కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి


నీ కలలే నా కనుల మేఘాలు, 
నీ జ్ఞాపకాల ఆవిరిని తీసుకున్నా,
నీ తాకిడికి దూరంగా వాడిపోయి ఎండిపోయినా,
తృప్తి చెంది కన్నీటిని కురిపించకుండా ఉన్నాయి...

My eyes should be the clouds of your dreams,
Having absorbed the vapor of your memory,
Far from moisture, dry and withered,
Yet satiated without raining in your absence...


मेरी आँखें तेरे सपनों के बादल हों,
तेरी याद की भाप पीकर भी,
नमी से कोसों दूर, सूखे हों,
तेरे बिना बरसे बिना भी तृप्त हों।

🩵

కన్నీరు


కాటుక కనులు వదిలే ప్రతి కన్నీటి చుక్క నల్ల బారినట్టు, నిన్ను దాచుకున్న నా కనులలో ప్రతి ఎదురుచూపు నీతో నిండిపోతుంది...

Like every tear drop left by the eyes with eyeliner becomes black, every anticipation in my eyes that hides you is filled with you..

💞

అందమైన నువ్వు


ఉదయపు వెచ్చదనంతో, 
రాతిరి చల్లిన మత్తుతో, మంచంపై విరిసిన పువ్వు, 
నా కనులముందు అందమైన నువ్వు...

Made from the morning warmth, seasoned with the night's essence, a raising flower on the bed, a beautiful girl in my heart...

कोमल धूप से विकसित, रात के सार से सुगंधित, बिस्तर पर खिलता हुआ फूल, मेरे दिल में एक भूल... 

💞

ఎక్కడ ఉందో తెలుసా


మబ్బు కింద చందమామ ఎక్కడుందో తెలుసా? మాటలాడే వెన్న ముద్ద ఎక్కడుందో తెలుసా? కోటి తారలు చిన్న పువ్వుగా ఒదిగిపోయే చీకటి ఎక్కడుందో తెలుసా? చేప పిల్ల కళ్ళకి స్ఫూర్తి ఇచ్చిన అచ్చు ఎక్కడుందో తెలుసా?

Do you know about the moon that stays below the clouds ? Do you know about talking pat of butter? Do you know the elusive darkness where a million stars transform into a tiny flower? And, do you know the secret place where the mold once inspired the eyes of a baby fish?

💜💜💜

వినిపించే నిశబ్దం


కనులు మూస్తే వినిపించే నిశ్శబ్దం నీది, 
కనులు తెరిస్తే ఎవ్వరినీ వినిపించుకోలేని సొగసు నీది...

When my eyes are closed, your silence speaks volumes, but when they're open, your beauty overshadows the words...

💜💜💜


గాయం కాదు ఎదురుచూపులు

కనులు మూస్తే కనిపించే గాయంలో నొప్పి ఉండదు ఎదురుచూపులు ఉంటాయి...

The wound that you can see with your eyes closed doesn't have pain, but it does have anticipation..

💜💜

కనుల తలరాత

నా కనుల తలరాత బాగుందేమో నిన్ను చూసే అదృష్టం కలిగింది...

It seems that the fate of my eyes is good; I have been given a chance to see you at least...

💜💜

కనులెన్ని ఉన్నాయో లెక్కించుకున్నా

నిన్ను చూసే ముందు,
కనులెన్ని ఉన్నాయో లెక్కించుకున్నా,
అణువణువు నాలో కనులైనా సరిపోదంటూ దుఃఖిస్తున్నా,
ఓ సొగసరి నెమలి పించాన్ని వేడుకొని కనులను అప్పు తీసుకుంటా, 
నీ సిరుల ఝరిలో నా చూపులను కాస్త తడుపుకుంటా....

Before seeing you, I counted the number of eyes I have. Even though every cell in my body is like an eye, I grieve that it is not enough to feel you. May be I will beg the peacock feathers to lend me few more eyes and immerse my gaze in your beauty..

💜💜

గాలికి కోరిక కలిగే అందం

నా కాగితంపై వీచే గాలికి కోరిక పుట్టింది కనులు కావాలని, నీపై రాసే ప్రతి అక్షరాన్ని చదవాలని ఎందుకంటే కాగితం నుంచి వచ్చే పరిమళం గాలిని సైతం ఆపేసింది....

The wind that is flowing over my paper seems to wish for eyes so it can see what I am writing, because the paper is so fragrant that the wind cannot even move away from it...

💜💜

కనులు తెలివి

వేకువకు కనులే ఉంటే నేలను తాకక ముందు నిన్ను తాకుతుంది, 
చీకటికి తెలివే ఉంటే నింగిలోని నలుపును నీకు బదులిచ్చి నీ కురుల నలుపును అద్దుకుంటుంది...

If the first light got eyes, it will touch you before it touches the ground, if the night is intelligent, it will exchange it's darkness with colour of your hair...

💜

రెప్ప పాటు సమయమంతా వృధా

కనులార్పుతూ నిను చూస్తుంటే కలత చెందింది మనసు ఆ రెప్ప పాటు సమయమంతా వృధా అయ్యిందని...

my heart felt bad for blinking the eyes while looking at you as it missed you so much between the blinks..

💜

నీ కనులు వాలితే అందమొస్తోంది

సందేహిస్తోంది నా ఆలోచన అంత అందాన్ని ఎలా పోల్చాలని దేనితో పోల్చాలని..
కనులు వాలితే కలలొస్తాయేమో కానీ నీ కనులు వాలితే అందమొస్తోంది..
ఒడిపోతున్నా ఒప్పుకుంటున్నా నీ అందాన్ని పోల్చడం నా తరం కాదని కాదు కాదు ఎంత పోల్చినా తక్కువేనని...

కనులు మూసి అనుభవించాలి

ఆకాశం నల్ల చీర కట్టే అందాన్ని కళ్ళు తెరిచి చూడలేము కనులు మూసి అనుభవించాలి...

తెరచిన కనులలో తెలియని అర్థాలెన్నో





తెరచిన కనులలో తెలియని అర్థాలెన్నో..

చూసే చూపులలో చిగురుతోడుగు ప్రేమలెన్నో..

కనులకు తెలియని బాష లేదు...

దానికి ఎన్నడు మాట రాదూ..

మౌనమైనా అది మహా కావ్యమే...

కొంచముండి అది ఎంతో చేయునే... 


అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...