Showing posts with label హాస్యము. Show all posts
Showing posts with label హాస్యము. Show all posts

నిదురలో పడ్డ శ్రమ

పని వేళల్లో పన్నీరు చల్లినట్టు చల్లగా నిదుర వస్తుంది ఎందుకో,
రాతిరి నిదురలో పడ్డ శ్రమంతా తీరడానికి ఏమో...

ఉండవే అక్కో నా పెండ్లి దాక


ఒకానొక అక్కకి ఇది అంకితం :D








ఉండవే అక్కో నా పెండ్లి దాక ...

ను ఉండవే అక్కో నా పెండ్లి దాక ....

సరి జోడిని వెతకాలే... తాంబూలమివ్వాలే ..

నా దాన్ని సూసి సూసి మురిసిపోవాలే...

ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ను ఉండవే అక్కో నా పెండ్లి దాక....



అక్కో అక్కో అక్కో పెళ్లాయే వేళాయే ...

పెండ్లాము దెగ్గరాయే...

నువ్వు తాళి అందివ్వాలే...

తయ్య తక్క లాడాలే ..

చపట్లు కొట్టలే పాటలు పాడాలె ...

ఉండవే అక్కో నా పెండ్లి దాక ...

నువ్ ఉండవే అక్కో నా పెండ్లి దాక...



ఆపైన నా కొడకు నీ చేత పెరగాలే ...

వాడి పెండ్లి కూడా నువ్వే జెరిపించాలే ...

ఉండవే అక్కో నా పెండ్లి దాక...

ఉండుండవే అక్కో వాడి పెండ్లి దాక ...



బొచ్చు వదిలిన బుర్ర













బొచ్చు వదిలిన బుర్ర

కష్టం లేని జీవితం లాంటిది

భారమంతా వదిలేసిన

గాడిద సుఖము లాంటిది

స్నేహమే దూరని మగువ మనసులో

ప్రేమ దూరినంత హాయి లాంటిది


నీవు ఓ పడతి రూపమే.






















మైనం లాంటి మేని సొగసు

కరిగిపోయే లేత మనసు


హత్తుకుంటే పొంగిపోయే పరిమళాలు


అన్ని నీ సొంతమే

ఓ  సబ్బు బిళ్ళా నీవు ఓ పడతి రూపమే...  











 

హాజరు పట్టీలు
























మనుషులుండరు  కాని


వారి వరుసలు వుంటాయి 



తప్పు చేయకున్నా గడులలో బందీలౌతారు


ఎప్పటికి పారిపోలేరు కాని 


అప్పుడప్పుడు మాయమౌతుంటారు  


పట్టీలలో కాలక్షేపం చేస్తుంటారు

అ పట్టీలే హాజరు పట్టీలు  





హాయిగా నవ్వించే హాస్యము















హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము

కూడదు కూడదు కోపము

కోపానికి విరుగుడే హాస్యము





నవ్వే పెదవులు చెప్పే హాస్యము

అమాయకాన్ని చూపే హాస్యము

తన్నులు తింటే పండే హాస్యము

కోపం లోను కరకర హాస్యము

మతే లేని తికమక హాస్యము

అర్థం కాకుంటే అది ఒక హాస్యము

నవుతూ పోతే అంతా హాస్యము

హాస్యమే లేకుంటే అంతా వ్యర్ధము ..





హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము





చిన్నారుల తడబాటే హాస్యము

బామల తాతల గొడవలు హాస్యము

ప్రేమలోని అలకలు హాస్యము

తనకు తాను మాట్లాడితే హాస్యము

పరుగులు తీసే చినారి హాస్యము

గుబులు పుట్టించే కన్నె సైగ హాస్యము





హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము





నవ్వించే వన్ని హాస్యము కాదు

నవ్వు రాని వన్ని హాస్యము కాకుండా పోదు

మనమే హాస్యమైతే జీవితమే ఆనందము

ఇంకోరిని హాస్యము చేస్తే అది నీలో ఒక లోపము





హాస్యము హాస్యము హాస్యము

హాయిగా నవ్వించే హాస్యము


అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...