Showing posts with label దూరం. Show all posts
Showing posts with label దూరం. Show all posts

అంగుళం దూరం

నీకు నాకు మధ్య ఒక అంగుళం దూరం భూమి చుట్టూ అంగుళం వెడల్పు పగులు లాగ అనిపిస్తుంది. చిన్నదే అయినా ప్రపంచాన్నే విడతీసినట్టు ఉంటుంది. మనము ప్రేమకు మించి ప్రేమించాము, ఇప్పుడు అంతానికి మించి విడిపోయాము. మన మధ్య ప్రతిదీ విపరీతమే...

An inch of gap between you and me feels like an inch-wide crack around the Earth. It’s small, yet it feels as if it divides the world. I don’t know what would happen if we stayed this far apart. We loved beyond love, and now we are separated beyond the end. Everything between us seems to exist in extremes.

💔

దూరం అవ్వాలని నా ప్రయత్నం


నిజం కలలకు విరుద్ధంగా ఉంటుందని ఓ నమ్మకం,
అందుకే నీ నుంచి దూరం అవ్వాలని కలలో ఎంతగానో ప్రయత్నిస్తున్నాను...

There is a belief that dreams are the opposite of reality, so I am trying hard to distance myself from you in my dreams...

💞

దూరంగా ఉన్నా పుడుతుంది


మనం ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు కష్టాలు పుట్టాయి, అందుకే చేరువగా ఉంటేనే కాదు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా ఏదో ఒకటి పుట్టవచ్చని నేను గ్రహించాను...

the difficulties were born when we are apart from each other, So, I realized not only when two are close, something can be born even when two are far away....

💞

నీ భావాలకు చేరువగానే


భూమి నుండి దూరంగా పోతున్నట్టు కలలు వచ్చాయి, అప్పటికీ ఈ అద్భుతమైన విశ్వంలోనే ఉన్నా అని, ఎల్లప్పుడూ అందమైన వాటికి దగ్గరగా ఉన్నానని నేను గ్రహించాను. అదే విధంగా, నేను నీ మాటల నుండి వెనక్కి తగ్గినప్పటికీ నీ ప్రేమలోనే తేలియాడుతూ నీ భావాలకు చేరువగానే ఉన్నా అని తెలుసుకున్నాను..

I dreamt like I was flying away from Earth, but then I realized I'm still part of this amazing universe, always close to something beautiful. like, when I stepped back from your words, I am still swimming in your love and closer to the wonderful emotions you brought. So, I'm always close to you...

मैंने सपने में देखा मानो मैं धरती से दूर उड़ रहा हूँ, पर तब मुझे एहसास हुआ कि मैं इस अद्भुत ब्रह्मांड का हिस्सा हूँ, हमेशा किसी खूबसूरत चीज़ के करीब हूँ। जैसे, जब मैं आपके वाक्यों से पीछे हटा, मैं अभी भी आपके प्यार में तैर रहा था और आपके द्वारा लाए गए अद्भुत भावों के करीब था। तो, मैं हमेशा आपके करीब हूं...

💞

నిన్ను తెలుసుకున్న క్షణమే కదా నాకు నువ్వు జన్మించిన క్షణం


నీతో మాట్లాడలేకుంటే, నీతో కలిసి నడవలేకుంటే, నువ్వు ఎప్పుడు పుడితే ఏముంది? నేను నిన్ను తెలుసుకున్న క్షణమే కదా నాకు నువ్వు జన్మించిన క్షణం...

How does it matter when you were born when I can't talk to you or walk with you? Isn't the moment I knew you the moment you were born...

💞

ఎంత దూరమో అంత ప్రేమ


అద్దం ఉన్న దూరాన్ని బట్టి విస్తారమైన సముద్రాన్ని లేదా మొత్తం భూమిని లేదా పాలపుంతని కూడా ఒడిసి పట్టగలదు. సఖీ నీ అపారమైన ప్రేమను ప్రతిబింబించాలంటే, నన్ను నేను మరింత దూరంగా ఉంచుకోవాలి. నీ ప్రేమ ఎంత విస్తృతంగా మారుతుందో, దాన్ని ప్రతిబింబించడానికి నేను అంత దూరం వెళ్ళాలి...

A mirror can even hold a vast ocean or this earth or a galaxy depends on the distance it is placed, to reflect your vast love I have to keep myself far and far, the more wider your love is becoming that far I have to go to reflect it..

💞

మత్తు

గంజాయి పొగతో నిండిన ప్రపంచంలో నన్ను విడిచిపెట్టినప్పటికీ మత్తు కలగదేమో, చెలి ఎందుకంటే, నీ ప్రేమ నీ అందం చూసిన నా మీద, ఏ మత్తు పని చేయదులే, వాటికంటే మత్తుగొలిపేది మరేదీ ఉండదులే...

Even if you were to leave me in a world consumed by the haze of weeds, I will remain untouched as nothing else can intoxicate me more than your love and beauty...

💜💜💜

మెత్తని ముళ్ళ గడ్డి


దూరం నుంచి చూస్తే కొన్ని సార్లు మెత్తని గడ్డి కూడా కోరలు ఉన్న ముళ్ళులా కనిపిస్తుంది, కానీ చేరువయ్యే కొద్దీ అది మరే పానుపు ఇవ్వని హాయిని ఇస్తుంది..

Sometimes the far grass looks like sharp thorns, but if you still approach, it comforts you like nothing else can..

💜💜💜

ఎంతటి బరువైనా నీటిలో పడితే నెమ్మదించాలి


ఎంతటి బరువైనా నీటిలో పడితే నెమ్మదించాలి, అందుకే నువ్వు వేసే విరహ బాణాల వేగాన్ని నా కన్నీటితో ఆపుతున్నాను..

No matter how heavy one falls into the water, it should be slowed down. The distance between us is falling heavy on me, so I am slowing it down with watery eyes..

💜💜💜

దూరం సులువు



నన్ను దూరం పెట్టాలి అంటే చాలా సులువు,
నీలో ప్రేమను ఒప్పుకొని వెళ్ళిపో అను,
సూర్యుడు కళ్ళు తెరిచి చూసినా కనిపించనంత దూరం పోతాను,
అదే ప్రేమ దాచి వెళ్ళిపో అని అంటే,
చీమ కళ్ళ మధ్య ఎంత దూరం ఉంటుందో అంత దూరం కూడా కదలను...

It's so easy to keep me away:
Admit your love and ask me to stay away.
I will go so far away that not even the eyes of the sun can reach.
But if you ask me to stay away, hiding the love,
I won't even move as far as the distance between the eyes of an ant...

💜💜💜

ప్రేమను ఉమ్మేసి వెళ్ళిపో

నీ మది ఆరగించిన నా ప్రేమలో రుచి లేదేమో ఉప్పు తక్కువేమో, కన్నీటిని ఇస్తున్నాను కలిపి చూసుకో, అప్పటికి రుచి లేకుంటే ప్రేమను ఉమ్మేసి వెళ్ళిపో..

If the love you felt before was lacking, then use my tears to give it some seasoning. But if it still doesn't satisfy you, don't force yourself to stay by its side. Spit it out and let it go...

💜💜

ఉంటుంది లేదా పెరుగుతుంది

రెక్కలిచ్చి పొమ్మన్నా పోలేదు,
బరువు పెంచి దిగమన్నా దిగలేదు,
మాటలతో పొడిచినా చావలేదు,
ఎలా తిరిగి ఇవ్వాలి నీ ప్రేమను?
నీ ప్రేమకు మరి ఏ ప్రేమ బదులుకాదు కాబట్టి,
ఏమో ఇచ్చిన దానికంటే నువ్వే ఎక్కువిస్తే అది ఉంచుకొని ఉన్నది తిరిగిస్తాను...

I gave it wings to fly away, but it stayed.
I made it heavy with all the tears, but it didn't fall.
With words sharp as knives, I tried to lay it to rest, but it didn't die.
Nothing can make your love vanish or replace it.
Perhaps you can give a little more. For what I have taken, I shall return.
If you can't give more, it stays forever. And if you can, it grows forever...

💜💜
నావికుడి ధైర్యం సముద్రం యొక్క లోతు, ఓడ యొక్క బలం మరియు గమ్యం యొక్క దూరానికి సరిపోలాలి; లేకుంటే, అతను అలల మీద పొరపాట్లు చేసి చివరికి చేరుకోలేడు. నిజమైన ప్రేమికుడివి కావాలనుకుంటే, అటువంటి ధైర్యసాహసాలు కలిగిన నావికుడిగా ఉండు. 

The bravery of a sailor should match the depth of the ocean, the strength of the ship, and the distance of the destination; otherwise, he may stumble upon waves and fail to reach the end. If you want to be a true lover, be a sailor who possesses such bravery

💜💜

దూరం లేకుంటే వృదా

చీకటికి కాంతికి దూరం లేకుంటే కిరణాల పయనం వృదా,
నింగికి నేలకు దూరం లేకుంటే చినుకు పయనం వృదా,
నీకు నాకు దూరం లేకుంటే ఈ విరహ వేదన వృదా,
ప్రేమకన్నా విరహమే చల్లగా ఉందనిపిస్తోంది ప్రతి నిమిషం నీతో నా ఆలోచన నిండిపోతోంది...

If there is no distance between darkness and light, the journey of rays is wasted.
If there is no distance from the ground to the sky, the journey of the raindrop is wasted.
If you are not far from me, this sweet pain of separation is wasted.
It seems that estrangement is cooler than love because every minute my thoughts are filled with you...

💜💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...