నన్నే అడుగులు వేయించావు











అందని ఆకాశం నీవు

అందాల ఓ పావురం

నేలపై రాలిన ఎండుటాకులా

చేసాను ఓ సాహసం



రెక్కలు లేవు పక్షిని కాను

గాలికి తోడై వస్తున్నా

ఎంత సేపని గాలిలో ఉండను

చావని ఆశల బరువుతో ఉన్నా



నీతో స్నేహం కల అనుకున్నానే

నాకై చినుకై దిగివోచ్చావే

సీత కొకలా నటిస్తున్నా

నన్ను చిలుకలా మర్చేస్తున్నావే



నాపై అందరి అడుగులు పడకుండా

నన్నే అడుగులు వేయించావు

నీకిది తెలియదేమో

ఈ ఎండుటాకునే పైపైకి చేసి

ఒక నక్షత్రంల మర్చేస్తునావు

నీకెలా రుణపడి ఉండను

అ రుణాలకే అతీతంగా ఓ బందానిచ్చావే...


No comments:

మంచు పొరలు

பனி அடுக்கடுக்காய் படர்வது போல, நீ பேசும் ஒவ்வொரு முறையும் உன் காதல் என் இதயத்தில் ஒரு புதிய தடம் பதிக்கிறது. பனி கரைய காலம் மாறலாம்; இந்தக்...