Showing posts with label వర్షం. Show all posts
Showing posts with label వర్షం. Show all posts

మేఘమే తడవాలంటే


మేఘాన్ని తడిపే వర్షం కురవాలంటే అది స్వర్గం నుంచి కురవాల్సిందే, ప్రేమ కురిపించే నీ మనసును తడపాలంటే, ఆ హృదయం ప్రేమ స్వరూపం కావాల్సిందే, కావున నా హృదయం చిన్నది అవుతుంది...

For the clouds to get wet in rain, rain has to shower from heaven, to touch your heart that pours love, that heart has to be the embodiment of love and my heart falls short...

🩵

నీ పాదాలు తాడుస్తాయా అని సందేహం


నీ అందం చూస్తుంటే నాకో సందేహం కలుగుతోంది, వర్షంలో నీ పాదాలు ఎప్పుడైనా తడిసాయా అని?

Looking at your beauty I wonder if your feet ever get wet in the rain?

💞

ఒకప్పుడు నేను నీడను ఇచ్చే మేఘం


ఒకప్పుడు నేను నీడను ఇచ్చే మేఘం మట్టుకే, నీ చూపు ఎప్పుడైతే తగిలిందో వర్షాన్ని కురిపించసాగాను, నువ్వు సముద్రానివా? అయ్యిండవు! ఎందుకంటే సముద్రానికి రూపముండదు,అది నవ్వలేదు, మరి నువ్వు ఎవరివి? నేను ఎదురు చూసే ఆ ప్రేమ మాంత్రికురాలివి నువ్వేనేమో..

Earlier I was a cloud, useful only for providing shade. But when your gaze fell on me, I started raining. Are you the sea? I don't think so, because the sea cannot smile and has no shape. Then what are you? Maybe you are the love witch I was looking for...

पहले मैं बादल था, सिर्फ छाया देने के लिए उपयोगी था। लेकिन जब आपकी निगाह मुझ पर पड़ी, तो मैं बारिश करने लगा। क्या तुम समुद्र हो? मुझे नहीं लगता, क्योंकि समुद्र मुस्कुरा नहीं सकता और उसका कोई आकार नहीं होता। फिर तुम क्या हो? शायद तुम वो जादूगर हो, जिसकी मुझे तलाश थी।

💞


ఆ కొంతని ఎంత అశ్వాదిస్తావో అది నీ ఇష్టం


మంచు తుంపర్లను వర్షం అనుకొని నిలిచిపోతే ప్రయాణం ఆగిపోతుంది, అరే వర్షం అని సంబరపడితే ఆ ఆనందం కొన్ని క్షణాలే ఉంటుంది, అది కొంతసేపటి అనుభవం, ఆ కొంతని ఎంత అశ్వాదిస్తావో అది నీ ఇష్టం...

If, by mistake, you perceive snowflakes as rain and tread cautiously, the journey may come to a stop. Opting to celebrate it, the ensuing happiness remains brief—a momentary encounter where the depth of your enjoyment is at your discretion..

💞

నీడ చాలు


మేఘాలు తమ ఉనికిని పంచుకోవడానికి భూమిపై వర్షం కురిపించాల్సిన అవసరం లేదు. మేఘం ఎక్కడ ఉందో దాని నీడ ద్వారా భూమికి తెలుసు..

Clouds don't need to shed rain on Earth to share their presence. Earth knows where the cloud is by its shadow..

💞

ఎడారి వలె ఎదురుచూపులు



నాలా విరహ వేదనతో ఆరాటపడుతున్న వాడి గుండెను ఎక్కడ దాచినా కష్టమని నీలో పాతి పెట్టారేమో, ఆ గుండె చప్పుడు నీలో ఇంకా సెగలు కక్కిస్తోంది, ఎండమావికై ఇంకా ఎదురు చూస్తోంది, ఓ ఎడారి నీతోడుగా నేను ఉన్నాను, గతించలేదు కానీ గతి తప్పుతున్నాను కనిపించినా కురవని తన మేఘాలు చూస్తూ....

Perhaps the heart of a person, once deadened by the agony of separation, is buried within you, as other earthly places cannot tolerate its vibrations. His heart's beat still makes you emit heat from within, and keeps you waiting for an oasis. Dear desert, you are not alone—I am also with you. Yet, I am alive, going out of my mind and experiencing an irregular heartbeat that none can understand, waiting for the clouds I see to shower...

❤️‍🔥💜❤️‍🔥

కన్నీటి కొలనౌతుందో లేక కలువల కొలనౌతుందో

ప్రియతమా నీ పరిచయంతో ప్రతి నిదురలో నా కలలు మేఘాలై వర్షం కురిపిస్తూనే ఉన్నాయి, ఇదివరకు ఉన్న కలలన్నీ ఆ తీవ్రత తాళలేక కనులు దాటి వెళ్లిపోయాయి, నిండిన నా కనుల కొలను కన్నీటి కొలనౌతుందో లేక కలువల కొలనౌతుందో నీకే వదిలేస్తున్నా, కలలు మట్టుకే నా సొంతం అని భావిస్తూ...

Beloved, with your touch, my dreams rain like clouds in every sleep. All the dreams I have gathered thus far have slipped beyond my grasp, unable to withstand the rainfall. I leave it to you to decide whether the pool forming in my eyes will be filled with tears or lotuses, bearing in mind that I possess the dreams, but not you...

💜💜

కరగని అందం

నీ అందాన్ని మోసి తీసుకురావాలని వాలే ప్రతి చినుకుకు పని ఇచ్చాను, మబ్బులు కరిగిపోయాయి,
సంద్రం నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని కురిపించింది,
సంద్రం మాయమైంది,
ఎంత మోసినా తరగనిది నీ అందం అని తెలిసి ప్రయత్నాన్ని విరమించుకున్నా, అక్షరాలతో నా వరకు వచ్చిన అందాన్ని నింపుతున్నా..

I entrusted every rain drop to carry your beauty; the clouds melted away.
The sky borrowed drops from the oceans and poured it,
The oceans vanished,
Knowing that your beauty is inexhaustible.
No matter how much I carry it, I gave up the effort,
Instead, I am reforming the beauty that came to me with letters...

💜💜

తడి హృదయం

ఈ సాయంత్రపు వర్షంలో తడవకపోయినా నీ ఆలోచనలతో తడి చేరిన హృదయం మట్టి వాసన కంటే, కమ్మే పొగ మంచు కంటే, మెరిసే చినుకుల కంటే అద్భుతమేగా...

The wonder of this rainy evening is not in the smell of the soil, nor the fog, nor the shiny raindrops. It lies in my heart, which remains moist despite never having been soaked by nature's art, but has been touched by your little thought.

💜💜

మేఘాలు ఎంత మెత్తనైనా

మేఘాలు ఎంత మెత్తనైనా చినుకును చేతితో తీయగలమా,
నీ మనసు ఎంత మెత్తనైనా అందులో నుంచి ప్రేమను తీయడం సాధ్యమా,
కురిసినప్పుడు తడవాలి మెరిసినప్పుడు ఆనందించాలి అందినప్పుడు దాచుకోవాలి...

No matter how soft the clouds are, 
can a drop be plucked by hand?, 
No matter how soft your heart is, 
is it possible to extract love from it?, 
Just get wet when it rains,
Enjoy when it shines,
Preserve it when it is yours...

💜

మేఘాలకు తెలియదు

మేఘాలకు తెలియదు వర్షంలో తడిస్తే ఎలా ఉంటుందని కానీ కురుపిస్తాయి, ఒక్కసారి వాటివైపు చూడు నాలాగ అవి కూడా ఆ తడిసిన హాయిని అనుభవిస్తాయి..

Clouds don't know what it's like to get wet in the rain but they shower it, just look at them and let them enjoy the wet feeling that I have when you look at me...

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...