Showing posts with label స్వాతంత్రం. Show all posts
Showing posts with label స్వాతంత్రం. Show all posts

జై జవాన్

మట్టిలో భీజం మొలకెత్తుతుందో ఏమో కాని,
నీ మనసునున్న భక్తి మహాతేజం అవుతుంది,
నీ గుండెకు శ్వాస ఉండదేమో,
నా దేశం అన్న నిస్వార్ధం చాలేమో,
 కిందనున్న జెండా ఎగురవేస్తే కాదు,
మా నోటినున్న భక్తి తలకెక్కిన రోజే నిజమైన స్వేచ్ఛరా,
వీరుడా నింగికేగరా,
🙏
జై జవాన్
జై హింద్

జై జవాన్







నా తరపున సుభ గారి తరపున అందరికి గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు




నాలోని ప్రాణం నీవే

నాలోని ధైర్యం నీవే

నావెనుక సైన్యం నీవే భారత దేశం


నాలోని ఉప్పెన నీవే

నాలోని ఆవేశం నీవే

నాకున్న శకలం నీవే భారత దేశం



నీవిచ్చిన ప్రాణం కాదది వరమనుకుంటున్నా

నీకంటూ ఇస్తూనే చరిత్రనైపోనా

నీవే ఒక యుగమైతే

ప్రతినిమిషం నేనౌతా

కవచంలా కౌగిలిస్తూ

ప్రేమను అందిస్తా



నలుదిక్కుల మానవహారం

నీమెడలో పూలహారం

నీవే మా దేవత వంటూ పూజలు చేస్తున్నాం

త్యాగాన్నే కోరికచేస్తూ నీకర్పిస్తున్నాం

మాలోని రక్తపు బొట్టుకు మావారిని కాపాడు

చిరునవ్వులు పంచుతూ చిరకాలం తోడుండు



ఓ తల్లిగా కన్నీరే

చిందించిన మాకోసం

దిగులే పడకు ఎన్నడూ

మరు జన్మ ఉంటే నీతోనే

ఎంత దూరం మా పయనం నీ గర్బంలోకే కదా
ప్రాణమిస్తే మరు క్షణం నీ బిడ్డలమౌతాం కదా

నీ ఒడిలో చోటిస్తూ లాలించు నను ఓదార్చు

ఈ బాధను మరిచేలా నీ ఎదపై ఆడించు





చేరదీయి నీ స్వాభిమానమును..



















పరులు నివ్వెరపోని ...

పంతాలు మోసుకొని...

మనకేమి భయము మనకేమి...

పాండిత్యము కాదు ఇతరుల శ్రేయస్సులోనే గొప్పతనము...

అనుకువలో కాదు అనుకున్నది చేయుటలోనే విజయము..

తోసిపుచ్చు దుఖాఃన్ని  ...

చేరదీయి నీ స్వాభిమానమును... 

నా అలవాటుకు వీడ్కోలు ..





ఇన్నాళ్ళు నాకోసం నీవునావ్...

సమయమంటూ చూడకుండా నాతోటి ఆడుకున్నావ్..

నిన్ను నే వదలలేకున్న వదలిపో నన్ను...

నా అలవాటుగా ఇన్నాళ్ళ నీ సేవకు వీడ్కోలు ఈరోజు...

మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?





కడుపులో బంగారు..

కనుచూపులో కరుణ...

చిరు నవ్వులో సిరులు...

వారికివే వరాలు అందినవన్నీ ఆస్తులు...

కడుపులో బంగారు ఉన్నంత వరకు అ గర్బాన్నే తొలచి వేస్తారు..

కనుచూపులో కరుణ ఉన్నంత వరకు నిన్నే హేళన చేస్తారు...

చిరునవ్వులో సిరులు ఉన్నంత వరకు ఎవరికీ వారు పంచుకుంటారు...

ఎవరికోసమిక నీ ఎదురు చూపులు ఎవరి మీద నీ ఆశలు..

తెలుగు తల్లి నీవెవరి తల్లి ?

మా తెలుగు తల్లివా లేక రాజకీయ బానిసత్వానికి తల్లివా?..  

మా స్నేహ లోగిలిలో నీవే ముద్దు ..





వదిలిపోయే నల్లని మేఘాలు దాగకే చందమామ...

కొత్త లోకం కాదిది వింత లోకం అసలే కాదిది..

నేల నిన్ను చేరదు నీవు నేల నంటవు...

భయపడకు ఇటు చూడు నీతోడు మేమందరు...

తారలమై నీ చుట్టు మా స్నేహ లోగిలిలో నీవే ముద్దు .. 

స్వాతంత్రదిన శుభాకాంక్షలు.





కధలివస్తోంది భారత దేశం...

వెలుగు ఆరని దివ్య తేజం..

యుగయుగాల ప్రస్తానం..

ఇది ధర్మానికి పెద్ద పీటం..



అన్యులకు సామాన్యులను..

గొప్పవారిని బడుగులను..

బెధమేలేక ఆదరించే..

గొప్ప దేశం భరత దేశం..





వేదాలను చూసిన దేశం...

దేవుడు చేసిన సుందర సౌధం..

శాంతికిదియే నిలయం..

గొప్ప నేతలు పుట్టిన దేశం..





మతాలకు తావులేని మానవత్వం..

అన్ని బాషలు కలిగిన కమ్మని రాగం..

యువతనే సారధులుగా ఉన్న భవిష్యత్ ప్రపంచం..

మన అందరి చేతిలో మెదిలే స్వప్నం..

కదలి రండి కాపాడుకుందాం...

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...