Showing posts with label చేప. Show all posts
Showing posts with label చేప. Show all posts

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి,
చేపను ప్రేమించి,
అర్థం లేని పోరాటం చేస్తున్నా,
నాకు నేను దూరం అవుతున్నా..

💔

కలను దాటి వచ్చిన నిజం


కలను దాటి వచ్చిన నిజం, ఎదను దాటి పోయిన క్షణం, కొలను పైకి ఎగిరిన చేప, తిరిగి దూకే లోపే కొలను గడ్డకడితే...

A dream turned into reality, but it left the heart without notice. It’s like a fish jumping out of a pond for a change, only to find the pond frozen over before it can swim back in...

एक सपना हकीकत बन गया, पर दिल में खालीपन रह गया। यह ऐसा है जैसे कोई मछली तालाब से बाहर कूद जाए, लेकिन वापस लौटने से पहले तालाब बर्फ से जम जाए।

🩵

జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప


ప్రతి రేయి తన రూపమంతా నీటిపై పరుస్తుంటే తనకోసమే అని తడబడి జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప...

A fish fell in love with the moon, thinking that the reflection of the moon on the water was meant for it...

एक मछली को चंद्रमा से प्यार हो गया, उसने सोचा कि पानी पर चंद्रमा का प्रतिबिंब उसके लिए है।

💞

జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప


ప్రతి రేయి తన రూపమంతా నీటిపై పరుస్తుంటే తనకోసమే అని తడబడి జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప...

A fish fell in love with the moon, thinking that the reflection of the moon on the water was meant for it...

एक मछली को चंद्रमा से प्यार हो गया, उसने सोचा कि पानी पर चंद्रमा का प्रतिबिंब उसके लिए है।

💞

ఎక్కడ ఉందో తెలుసా


మబ్బు కింద చందమామ ఎక్కడుందో తెలుసా? మాటలాడే వెన్న ముద్ద ఎక్కడుందో తెలుసా? కోటి తారలు చిన్న పువ్వుగా ఒదిగిపోయే చీకటి ఎక్కడుందో తెలుసా? చేప పిల్ల కళ్ళకి స్ఫూర్తి ఇచ్చిన అచ్చు ఎక్కడుందో తెలుసా?

Do you know about the moon that stays below the clouds ? Do you know about talking pat of butter? Do you know the elusive darkness where a million stars transform into a tiny flower? And, do you know the secret place where the mold once inspired the eyes of a baby fish?

💜💜💜

నీ అందాల సరస్సులో నేను ఒక చేపనై ఈదాలి





రోజా రేకులతో నిన్ను అద్ది ఆ సారంతో పసుపుకు మెరుగులు దిద్దాలి, నీపై గాలిలో ముంచి మొగలి సువాసనలు పెంచాలి, నీ స్పర్శని చూపించి పత్తికి మెత్తదనపు పాఠాలు నేర్పాలి, నీ అందాల సరస్సులో నేను ఒక చేపనై ఈదాలి...
I shall smear you with rose petals and enhance the beauty of turmeric with that essence. I shall let the scent of screwpine waft through the air around you, intensifying its fragrance. I shall showcase your touch and impart gentle lessons to cotton. Oh, dear lady! I desire to swim in the lake of your beauty like a fish...

💜💜💜

నోరు ఎండిన చేప

నోరు ఎండిందని చేప అంటే లోకం నవ్వదా..

The world laughs at a dry mouthed fish..

💜💜💜

ఒడ్డు నుంచి చెరువులో పడ్డ చేప

ఒడ్డు నుంచి చెరువులో పడ్డ చిన్ని చేపలా నా నోటి నుంచి నీ చెవిలో పడే నా మాటలు, నాతో ఉన్నంత సేపు తల్లడిల్లి నిన్ను చేరుతుంటే ప్రాణం పోసుకుంటూ ఉంటాయి పదే పదే..

The words that fall from my mouth into your ears are like small fish falling from the shore into the pond. They suffer until they reach you, but once they do, they come alive again and again...

💜💜💜

నీటి నుంచి వెలివేయబడిన చేప

నీటి నుంచి వేలివేయబడిన చేపకు మనసులో రుణం ఉంటుంది కానీ కోపముండదు...

The fish that was thrown out of the water will feel gratitude in its heart, but not anger...

💜💜

ఎగిరే చేప

ఇప్పటివరకు నీటిలోని ఆకాశ ప్రతిబింబంలో ఈదుతున్న చేపకు రెక్కలొచ్చి ఆకాశానికే ఎగరగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో, నీ
పేరు వరకే ఉన్న పరిచయం, చనువుగా మారింది ప్రేమగా ఎదిగింది మరి ఇదీ అంతే అద్భుతం కాదా..


How wonderful it would be if a fish that was swimming in the reflection of the sky in the water could take wings and fly to the sky itself.
The relationship that I have only with your name turned into love and this is as wonderful as that flying fish..


यह कितना अद्भुत होगा यदि एक मछली जो पानी में आकाश के प्रतिबिम्ब में तैर रही थी पंख ले सकती है और स्वयं आकाश में उड़ सकती है।
तेरे नाम से जो रिश्ता है वो प्यार में बदल गया और ये भी उस उड़ती मछली की तरह खुबसुरत है..

💜

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...