నీ కురులు


చినుకు వాలింది జారింది, 
ఆ చినుకు పూలకు చెప్పింది, 
పువ్వు కూర్చుంది సువాసనలు అద్దుకుంది, 
ఆ పువ్వు చీకటికి చెప్పింది, 
చీకటి చూసింది వెన్నెల కురిపించింది, 
ఆ వెన్నెల నాకు చెప్పింది, 
నా చూపు అందులో చిక్కుకుంది, 
ఇంక్కెవరికి చెప్పలేక అందులోనే చిక్కుకొనిపోయింది...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️