తెలియని భావన కనులలో కన్నీరా లేక పెదవిపై చిరునవ్వును పలికించాలా అన్నది నాలో తెలియని భావన ... చెరిగిపోయిన దూరం సంతోషపెట్టినా చెదరని ఈ మౌనం నన్ను వేధిస్తోంది... వెన్నల పర్వంలోని హాయి గుర్తొచ్చినా దానికి నిదుర నన్ను దూరం చేస్తుందేమో అన్న కలవరం నన్ను తొలచి వేస్తోంది... మెత్తని ముసుగుల వెనుక ముళ్ళ కానుకగా ఈ సమయం వీడని రహస్యంలా వేధించే ఈ అల్లరి గాయం... ఈ దూరం వీడుతుందని తెలిసిన ప్రస్తుతానికి ఓ సంశయం ఆగని గుండెలో ఎప్పటికి పదిలమే నీ స్నేహం... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
పదిలమే నీ స్నేహం..
Subscribe to:
Post Comments (Atom)
तुम हर जगह हो
तुम हर जगह हो… मुझे तुम्हारे बारे में सोचने से रोकना है, तो पहले चारों दिशाओं को बंद करना होगा, हवाओं से कहना होगा कि वे चलना छोड़ दें, सुबह...

8 comments:
పదిలమే కానీ ఎవరి స్నేహమో చెప్పలేదు? ;)
@రసజ్ఞ గారు చేరాల్సిన వారికి చేరింది :)
తెరల చాటు చందమామ...
మనసు చాటు వెనలమ్మ...
చెలిమి రూపమైన...
నా చిట్టి నేస్తమమ్మ..
త్వరలో ఏదో సుభవార్త వినిపించనున్నట్లుంది...
@జ్యోతిర్మయి గారు అయ్యో నా ఫ్రెండ్ అలిగితేను ఎక్కడ ఇంక మాటలు ఉండవేమో అని భయపడి అలా ఓర్చుకోలేక రాసానండి అంతకు మించి ఏమి లేదు ..... నేస్తాన్ని వదులుకోకూడదని ఒక ఆలోచన ఆవేశంగా మారింది అలా పదాలను అల్లమని చెప్పింది న మది ....
ఒక్కొక్కప్పుడు స్నేహం లో ఇలాంటి చిలిపి అల్లరి లేకుంటే ఏం బాగుంటుంది కళ్యాణ్ గారూ.. ఇలాంటివి వస్తూ ఉంటేనే ఆ స్నేహం మరింత పదిలం అవుతుంది. మరింత విలువ ఇనుమడించుకుంటుంది. ఐతే మరి మీ స్నేహం మౌనం వీడిందన్నమాట మొత్తానికి. సంతోషం. ఆ సంతోషంలో ఇంకో భావం రావాలే... ఏదీ మరీ???
@తెలుగు పాటలు గారు ధన్యవాదాలు :)
@సుభ గారు స్నేహమే వచ్చేసాక దానిముందు ఈ భావం చిన్నిధైపోయి రావడం కష్టమైందండి :)
Chaalaa baagaa nachindi.... naaki...kavi raju gaaru
@reddy gaadu jogideelu jogideelu :)
Post a Comment