మంచి ఆలోచన











ఆయువు తీరని ఆలోచనకు అంతులేదు

నిదురతో వాటిని అంతం చేసినా

వేకువతో సరి ఉదయించు



జీవిత కాలపు వేగంతో పాటు

వాటిలో ఎన్నో మార్పులు

వాటి అదుపులో మనం ఉన్నంత వరకు

మనకు మనమే ఖైదీలు



రెక్కలు కట్టి ఎగురవేసిన

హద్దులనే దాటుతాయి

రెప్పలు దాటనీయకుండా దాచుకుంటే

మనలో బాధలుగా మిగులుతాయి



అవి ఎక్కువైతే ఏకాంతానికి దారి తీస్తాయి

తక్కువైతే మనశ్శాంతికి దోహదపడుతాయి

సమాజంతో కలిస్తే నలుగురికి సాయపడతాయి

సమతుల్యతతో ఉంటే గొప్ప మనిషిని చేస్తాయి




12 comments:

జ్యోతిర్మయి said...

>>అవి ఎక్కువైతే ఏకాంతానికి దారి తీస్తాయి
తక్కువైతే మనశ్శాంతికి దోహదపడుతాయి
సమాజంతో కలిస్తే నలుగురికి సాయపడతాయి
సమతుల్యతతో ఉంటే గొప్ప మనిషిని చేస్తాయ>>

కళ్యాణ్ గారూ ఎంత గొప్పగా చెప్పారు. గట్టిగా చప్పట్లు.

సుభ/subha said...

జ్యోతి గారే అంత గట్టిగా చప్పట్లు కొడితే మేమేమన్నా తక్కువా? మేమూ కొడతాం... చప్పట్లోయ్ చప్పట్లు..

kalyan said...

@జ్యోతిర్మయి గారు చాలా సంతోషం మీ చప్పట్లు గెట్టిగా వినబడ్డాయి భలే భలే బాగుంది ధన్యవాదాలు :) అది అంత ఆ లక్ష్మి నారాయణ స్వామి దయ అండి .. తన సన్నిధిలో కూర్చొని రాసినది ..

@సుభ గారు
మీరు ఇంకా గెట్టిగా కొట్టేసారే చాల చాలా సంతోషం అయ్యో జాగర్త అండి చప్పట్లు అనుకోని నా చంపలు వాయించేస్తున్నారు ;)

Anonymous said...

గొప్పగా ఉంది కదా.

Sagittarian said...

Hi, passing by to greet..:) *blink blink* :) Can't commment much , but i find this post very interesting..:)

రసజ్ఞ said...

ఆహా! ఏం చెప్పారండీ!!!!!!

Sri Valli said...

Chala bavundi Kalyan Garu...Manchi alochanalu manalne kakunda itarulani kuda manchi dovalo teskelthayi

Kalyan said...

@తాత గారు లక్ష్మి నారాయణుడి దయ :) ధన్యవాదాలు :)

@Sagittarian it is about how good thoughts influence our lives ... thank you so much.. eventhough you are a passing cloud you just made that time beautiful with showers :)

@రసజ్ఞ గారు ఏదో అలా చెప్పాను :)

@వల్లి గారు అవును నిజమే పూల సువాసనలాగా అది నలుగురికి వ్యాప్తిస్తుంది ధన్యవాదాలు :)

Bhanu Prasad Kotthakota said...

em cheppav ra.....

Kalyan said...

@bhanu kavitha cheppanu ra :-p

Reddy Kirankumar MB said...

చాలా చాలా చక్కగా చెప్పావ్ కళ్యాన్ ఇక్కడ ఆలోచన గురించి...... సూపర్ కేక నీకు

Kalyan said...

@రెడ్డి గాడు ఆలోచన నాది కాబట్టి చక్కగా చెప్పాను .. అది నీదైతే బ్రహ్మాండంగా ఉండేది రా ...

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...