పదిలమే నీ స్నేహం..















తెలియని భావన కనులలో కన్నీరా లేక పెదవిపై చిరునవ్వును పలికించాలా అన్నది నాలో తెలియని భావన ...

చెరిగిపోయిన దూరం సంతోషపెట్టినా చెదరని ఈ మౌనం నన్ను వేధిస్తోంది...

వెన్నల పర్వంలోని హాయి గుర్తొచ్చినా దానికి నిదుర నన్ను దూరం చేస్తుందేమో అన్న కలవరం నన్ను తొలచి వేస్తోంది...

మెత్తని ముసుగుల వెనుక ముళ్ళ కానుకగా ఈ సమయం వీడని రహస్యంలా వేధించే ఈ అల్లరి గాయం...

ఈ దూరం వీడుతుందని తెలిసిన ప్రస్తుతానికి ఓ సంశయం ఆగని గుండెలో ఎప్పటికి పదిలమే నీ స్నేహం...




8 comments:

రసజ్ఞ said...

పదిలమే కానీ ఎవరి స్నేహమో చెప్పలేదు? ;)

Kalyan said...

@రసజ్ఞ గారు చేరాల్సిన వారికి చేరింది :)
తెరల చాటు చందమామ...
మనసు చాటు వెనలమ్మ...
చెలిమి రూపమైన...
నా చిట్టి నేస్తమమ్మ..

జ్యోతిర్మయి said...

త్వరలో ఏదో సుభవార్త వినిపించనున్నట్లుంది...

Kalyan said...

@జ్యోతిర్మయి గారు అయ్యో నా ఫ్రెండ్ అలిగితేను ఎక్కడ ఇంక మాటలు ఉండవేమో అని భయపడి అలా ఓర్చుకోలేక రాసానండి అంతకు మించి ఏమి లేదు ..... నేస్తాన్ని వదులుకోకూడదని ఒక ఆలోచన ఆవేశంగా మారింది అలా పదాలను అల్లమని చెప్పింది న మది ....

సుభ/subha said...

ఒక్కొక్కప్పుడు స్నేహం లో ఇలాంటి చిలిపి అల్లరి లేకుంటే ఏం బాగుంటుంది కళ్యాణ్ గారూ.. ఇలాంటివి వస్తూ ఉంటేనే ఆ స్నేహం మరింత పదిలం అవుతుంది. మరింత విలువ ఇనుమడించుకుంటుంది. ఐతే మరి మీ స్నేహం మౌనం వీడిందన్నమాట మొత్తానికి. సంతోషం. ఆ సంతోషంలో ఇంకో భావం రావాలే... ఏదీ మరీ???

Kalyan said...

@తెలుగు పాటలు గారు ధన్యవాదాలు :)

@సుభ గారు స్నేహమే వచ్చేసాక దానిముందు ఈ భావం చిన్నిధైపోయి రావడం కష్టమైందండి :)

Reddy Kirankumar MB said...

Chaalaa baagaa nachindi.... naaki...kavi raju gaaru

Kalyan said...

@reddy gaadu jogideelu jogideelu :)

ఎవ్వరికీ లేఖలు అందలేదే

వెన్నలకు లేఖ రాశాను, తారకకు లేఖ రాశాను, ఆకాశానికి లేఖ రాశాను, ఎవ్వరికీ లేఖలు అందలేదే, రాయభారిని అడిగితే, నీ నవ్వులో వెన్నలని చూసి, మినుక్కుమ...