బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
నాకేం తెలుసు
ఏమో నాకేం తెలుసు. వెన్నెల రాతిరి రావాలా పగలే రావాలా అని జాబిలి అడిగిందట ఆకాశంతో పరిచయం కాకముందు, తరువాత ఆ ఆకాశంతో స్నేహం చేసి చేసి, పగటి వెలుగులో కనిపించక చిన్నబోయి, ఎప్పుడైతే ఏముంది నీతో ఉంటే చాలని రాతిరి రావడం మొదలు పెట్టిందట, వస్తే వచ్చింది కానీ, వేకువ వెలుగుకంటే గొప్పగా మారిందట, అందరూ మనసారా కోరుకునే కోరికలా మారిపోయిందట, తన చిన్న సర్దుబాటు వల్ల లోకమంతా మెచ్చే వెన్నెల అయిందట...
Subscribe to:
Post Comments (Atom)
నాకేం తెలుసు
ఏమో నాకేం తెలుసు. వెన్నెల రాతిరి రావాలా పగలే రావాలా అని జాబిలి అడిగిందట ఆకాశంతో పరిచయం కాకముందు, తరువాత ఆ ఆకాశంతో స్నేహం చేసి చేసి, పగటి వెల...
No comments:
Post a Comment