ద్వేషానికి కూడా నోచుకోని

ద్వేషానికి కూడా నోచుకోని నా మనసుకు నీ ప్రేమ తగిలితే,
ఇప్పుడే ఊపిరి వదిలిన దేహానికి ప్రాణం వచ్చినట్టేగా,
ఎదలోతుల్లో కలిగిన గాయాలకు మందు వెతుకుతుంటే,
గాయాన్ని మాయం చేసే సంజీవని దొరికెనుగా,
కాలంతో పోరాడి అలసిన నాకు, రెక్కలు ఇచ్చినా ఏం లాభం,
ఆకాశం అందాలంటే డొంకలు ఆడించాలిగా అదెలా సాధ్యం,
ఇంత కష్టంలో కూడా నన్ను ఎగురవేసెనుగా నీ ప్రేమ విమానం....
చెలి...............
నీ ప్రేమకు నా హృదయాంజలి...
చెలి...............
నీ తపనకు నా మమతాంజలి....

🩷🩷

No comments:

తేడా తెలియకుంటే ఓడినట్టే

సరదా మరియు మొండితనం మధ్య తేడా తెలియకపోతే, ప్రేమ అనే ఆటలో నువ్వు ఓడిపోయినట్టే… விளையாட்டுத்தனத்துக்கும் பிடிவாதத்துக்கும் உள்ள வித்தியாசத்தை ...