మోయవే నా మాటలన్నీ చేర్చవే నా ఊసులన్నీ మాయమైన స్నేహానికి మరపురాని నేస్తానికి ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా తన కనులు చూసి పలకరించు చినుకు చల్లి చెలిమి కోరు పరవశించి నాట్యమాడే అందమంతా నాకు చేర్చు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా కడలి చేరు తీరమంత వెతికి చూడు తన అడుగు జాడలు ఉన్నవేమో చిరునామా మరి తెలియునేమో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా దూరమంటూ ఆగిపోకు అంతటి స్నేహం ఎక్కడా దొరకదు తన చెలిమిని నీకు పంచుతాను వేగమంది తనను చేరు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా దారివెంబడి పూలు ఉంటాయి వాటి మత్తులోకి జారిపోకు మాయ చేసే మనుషులుంటారు మోసపోయి దారి మరచిపోకు కేరింతలు కవ్వింతలకు ఆదమరచి కురిపించకు దాచినదంత తనకే ఈ భారమంతా అ స్నేహానికే ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ మేఘమా పో మేఘమా |
మేఘ సందేశం
Subscribe to:
Post Comments (Atom)
Paint
When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...
13 comments:
ఓ ప్రియ
నీ సందేశము నాకు చేరినది
ఇప్పటికైనా ప్రేమను అంగీకరించు
జన్మ జన్మలకి నీ ప్రేయసి కా జీవించాలని ఆశ పడుతున్న
- నీ ప్రేమకై తహతహలాడుతున్న నీ ప్రేయసి
బావుందండీ మీ మేఘసందేశం...
@అపరిచిత్ గారు నా సందేశానికి నిజంగా బదులు ఎలా ఉంటుందో మీరు చెప్పిన విధానం బాగుంది...అంత తహతహలాదకండి అసలే ఎండాకాలము ... ధన్యవాదాలు..
@జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు :)
ఓహో మేఘమాలా! చల్లగ రావేలా మెల మెల మెల్లగ రావేలా..
ఆ పాట ఎంత బాగుంటుందో (వినకపోతే ఇంతకు ముందు వినాల్సిందే మీరు
)
అంత బాగుంది మీరు
మేఘం తో ఊసులాడడం. కవిత ఆఖరి లైన్స్ చాలా బాగున్నాయి..
హాయిగా ఉంది ఈ కవిత చదవడానికి!
ఏంటి సంగతి? మొన్న పెళ్లి దాకా ఉండమన్నారు? తరువాత విరహం, ఇప్పుడు సందేశం. ఏంటి కథ?
Kalyan garu ..ఇంతకు నా ప్రశ్నకు సమాధానం రాలేదు
@వెన్నల గారు థాంక్స్ అండి :) అయో ఆ పాట వినని తెలుగు చెవులు ఉంటాయా... నాకు భలే ఇష్టం ఆ పాట.. అసలు అది వింటుంటే మనమే మేఘమై తెలిపోవాల్సిందే .. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
@రసజ్ఞ గారు అయ్యో తప్పు తప్పు అలాంటి సంగతులేం లేవండి ఏదో అలా కుదిరిపోయింది... అకస్మాతుగా ఎప్పుడు ఏమొస్తుందని చెప్పలేము కదండి వచ్చింది రాసేయడం ... అవును మీరు నలుగురి ముందు అలా నిలదీస్తే ఎలా మళ్ళీ నాకు బాధ కలిగి ఇంకదేనిపైనైనా రాసేయబోతాను ;) ధన్యవాదాలు :)
@అజ్ఞాత గారు మీరు సంభాషణని రక్తి కట్టించే విధానం చాలా బాగుంది ... ఇది వరకు నాకెప్పుడు ఇలాంటి విమర్శలు రాలేదు... పైగా ఇలానే నా ప్రతి టపా ను ఆస్వాదిస్తూ విమర్శించాలని మనవి... మీరెవరో ఏమో ఐనా ధన్యవాదాలు మీకు...
కళ్యాణ్ గారు మీరు చాలా తెలివిగా తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు... నా ప్రశ్న అది కాదు ...ఇంతకీ మీరు నా ప్రేమని అంగీకరిస్తున్నారా లేదా ??
- నీ ప్రేమకై తహతహలాడుతున్న నీ ప్రేయసి
@అజ్ఞాత గారు ఒక నేస్తంగా మిమల్ని ప్రేమిస్తున్నానండి ....
ఆహా !! ఇది అ న్యాయం అంది .. మల్లి మీరు తప్ప దోవ పట్టిస్తునారు...నేను అడిగింది మీ ప్రేయసి గా ప్రేమిస్తునారా లేదా ??
-మీ ప్రేమకై వేచియున్న ఒక జీవిని ..
<3 <3 :* :*
baavindi paata...
Chala bagundi !! :)
@మంజు గారు ధన్యవాదాలు :)
@అమూల్య గారు ధన్యవాదాలు :)
Post a Comment