నిన్ను నువ్వు మోసం చేసుకోకు .














అలలా నిన్ను తాకుతూ వెడలిపోతున్నా

కాని తీరంలా నన్నెపుడూ ఆదరిస్తావు

నీపై అడుగులు ఎన్ని పడుతున్నా

నాకోసమే నీవన్నటుగా నిలిచావు

ఎందరో వదిలిన చేదు గుర్తులను నేను చెరిపాననా

లేక అలల వలలతో నిన్ను బంధించాననా

ఇంత ప్రేమకు నీవు సాక్ష్యం కావచ్చేమో

కాని నేనెపుడు పొంగుతానో ఆగుతానో తెలియదు

నన్ను ప్రేమించకంటూ నీకు చెప్పలేను

రేయి మనసు తెలిసి దాగిపోయే వేకువలా వెడలిపో

నన్ను చేరకు నిన్ను నువ్వు మోసం చేసుకోకు .......


2 comments:

శశి కళ said...

చాలా బాగుంది.ఇపుడు ఎందుకు ఈ కవితా వెల్లువ?

Kalyan said...

Emo sasi gaaru :) kadali endhuku ponguthundhante em cheppagalam :-P

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...