ఒకానొక అక్కకి ఇది అంకితం :D
ఉండవే అక్కో నా పెండ్లి దాక ... ను ఉండవే అక్కో నా పెండ్లి దాక .... సరి జోడిని వెతకాలే... తాంబూలమివ్వాలే .. నా దాన్ని సూసి సూసి మురిసిపోవాలే... ఉండవే అక్కో నా పెండ్లి దాక... ను ఉండవే అక్కో నా పెండ్లి దాక.... అక్కో అక్కో అక్కో పెళ్లాయే వేళాయే ... పెండ్లాము దెగ్గరాయే... నువ్వు తాళి అందివ్వాలే... తయ్య తక్క లాడాలే .. చపట్లు కొట్టలే పాటలు పాడాలె ... ఉండవే అక్కో నా పెండ్లి దాక ... నువ్ ఉండవే అక్కో నా పెండ్లి దాక... ఆపైన నా కొడకు నీ చేత పెరగాలే ... వాడి పెండ్లి కూడా నువ్వే జెరిపించాలే ... ఉండవే అక్కో నా పెండ్లి దాక... ఉండుండవే అక్కో వాడి పెండ్లి దాక ... |
10 comments:
టికెట్ ఎప్పుడు బుక్ చెయ్యమంటావ్ కళ్యాణ్..ఒన్ వే నే మళ్ళీ అమెరికా రావడం లేదు.
హహహ జ్యోతి గారు అంతకంటే భాగ్యం ఏముంది త్వరగా రండి మిమల్ని కలవచ్చు ... కాని ఇక్కడొచ్చాక పెళ్లి చేస్కోలేదేమి అంటే నేనేం చేయలేను :( .. దానికి ఇంకా సమయముంది... :) ధన్యవాదాలు
ఉంటానులే బాబూ.. నీ పెళ్ళి, నీ కొడుకు పెళ్ళి ఏం ఖర్మ! నీ ముని మనవళ్ళ పెళ్ళి కూడా నా చేతుల మీదుగానే జరిపిస్తాను తమ్ముడూ.. సరేనా?
@సుభ గారు మీకు కాదు అంకితం చేసింది నా ఒకానొక అక్కకి అంకితం చేసాను :) ఏమనుకోకండి :D అయినా మీవంటి స్నేహితులు రాకుండా నా పెళ్లి జరగదు.... ధన్యవాదాలు
నువ్వు కామెంట్స్ పెటిన వాళ్ళు అందరికి మీరు కాదు
అనకూడదు....అదీ పాయింట్...మీలాంటి వాళ్ళ కోసమే అక్కో....అనాలి మొత్తానికి అక్క ప్రేమ కేక..))
@శశి గారు మరి ఆటపట్టించొద్దా ఆ మాత్రం .. కాని పెద్దల మాట చద్ది మూట అన్నారు సో అలాగే వింటాను ... మీ కేక కి నా కేక ధన్యవాదాలు :)
నేను రాకుండా పెళ్ళా???? ఏంటి సంగతి? నా చదువయ్యేదాకా ఆగరాదూ! ఇప్పుడు సెలవడిగితే మా మాష్టారు తంతారు. కనుక నా చదువయ్యేదాకా ఆగితే అప్పుడు వస్తా మీ పెళ్ళికి లేకపోతే రాను హా!
@రసజ్ఞ గారు ఎంత మాట ... అయినా అప్పుడే పెళ్ళని ఎవరు చెప్పారు ???? ... మీరు తీరుబడిగా చదువు పూర్తి చేసుకొని రండి ...
కళ్యాణ్ సర్ .... పెళ్లి ఆహ్వానం అక్కలకేనా ... మావంటి తమ్ములకు లేదా ...........!
అక్కలను పిలవాలి తముడు అంటే పిలవకనే వచ్చేస్తాడు ... అందుకే అక్కనే పిలుస్తున్నాను :-P
Post a Comment