తిరిగిరాదా నీ స్నేహపు రవళి











తిరిగిరాదా నీ స్నేహపు రవళి

పూర్వపు కాంతిని వెదజల్లుతూ

చీకటిని తొలచుకుంటూ

వెన్నల కన్నా మిన్నగా

మనసు కన్నా లేలేతగా

నా చేతికి పసిపాపలా తోచే నీ స్నేహం తిరిగిరాదా .....

కన్నుల కాంతులు మిరిమిట్లు గొలుపుతున్నా

నవ్వుల హరివిల్లులు గొడుగులా విరబూస్తున్నా

నీవు లేని ఈ కన్నుల పండుగ కాంతిలేని దీపం లా మూగపోతోంది

ఆ మౌనపు ఆరాధనే నిన్ను తిరిగి నా చెంతకు రప్పిస్తుందని ఆశిస్తున్నాను

నీకై ఎప్పటికి అదే కనులతో చిన్నారి భావనతో వేచి చూస్తుంటాను....


3 comments:

సుభ/subha said...

Soooo Nice..

Kalyan said...

@తెలుగు వారి బ్లాగులు - తెలుగు తల్లి ఒడిలో స్థానం కల్పిస్తానంటే దానికి అనుమతులు అవసరంలేదండి.. నా బ్లాగ్ ను జతపరచండి ... చాలా సంతోషం ... మీ ఈ ప్రయత్నం చాలా అభినందనీయము.. ధన్యవాదాలు

David said...

నీ తోడు కోసం నా మనసు తపించిన వేళ...
నీ రూపు కొసం నా కన్నులు వేతికిన వేళ...
నా మనసు తెరలలో దాచివున్న భావాలు విచ్చుకున్న వేళ.
నా కన్నుల కాంతిలో అవి నీకు కనబడాలని అనుకుంటున్నాయి...
నువ్వు ఎక్కడా అని పదే పదే అడిగే నా గుండే చప్పుడు విను...
నువ్వు నావద్ద లేవని కన్నీరయ్యే నా కనులను చూడు...
నువ్వు ఎప్పటికైన వస్తావని...
నీ రాకకోసం ఎన్నాలైనా వేచిచూస్తామంటూ...
నా హృదయ సవ్వడి వింటూ నిదుర పోతున్నాయి పాపం......
...........కళ్యాణ్ గారు మీ కవితలోని భావం చాలా బాగుంది...ఎంతగానో ఫీల్ అయ్యాను అందుకే ఇలా... .

కోమలం

గాలిలో ముద్దు కూడా నిన్ను గాయపరిచేంత కోమలంగా ఉన్నావు, అందం అన్న పదం నీ తరువాత జన్మించిందేమో... You are so delicate that even a kiss could hu...