నీకై తపించాలని












ఎన్నాలకైనా వస్తుందా జాబిలీ

ఉదయించే కాలమౌతోంది

వదన్నా కూడా పరిచింది చీకటి

తను రాకుండా ఎక్కడో దాగిపోయింది

మాటిచ్చి మల్లెలు కూడా విరబూయనన్నవి

మంచు పాడే మత్తు పాట ఆపనన్నది

ఎటెళ్ళ లేక నేలనున్న

కళ్ళు మూసుకుంటూ నిన్ను చూస్తున్న

నువ్ వస్తావని కాదు

మనసిస్తావని కాదు

నీకై నేను కాస్తైనా తపించాలని

ఆ జ్ఞాపకాలను పదిలపరచాలని ..




2 comments:

భాస్కర్ కె said...

ఓ కల్యాణ్ గారు, చాలా రోజులకి మీ పోస్ట్,...రాస్తుండండి అప్పడప్పుడన్నా...బాగుంది మీ కవిత.

Kalyan said...

చెట్టు గారు :) కచ్చితంగా పెడతాను మీ విమర్శకు ప్రోత్సాహానికి సంతోషం... :)

కోమలం

గాలిలో ముద్దు కూడా నిన్ను గాయపరిచేంత కోమలంగా ఉన్నావు, అందం అన్న పదం నీ తరువాత జన్మించిందేమో... You are so delicate that even a kiss could hu...