ఆత్మ విశ్వాసం










నీడ వంక చూసావా నీడలేకున్నది

తోడు వంక చూసావా తరలిపోతున్నది

నిప్పుకాలం రగిలే హృదయం

కన్నీటితోను ఆరనంది

చెలిమి కూడా తీర్చలేనిది లోన ఏదో ఉంది



ఐనా ఆగవే మది ఆగిపోకే అందమైన లోకమిది

చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది

ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది

దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి...

.



9 comments:

శశి కళ said...

యెంత చక్కగా ఆశ కు ఊపిరి ఊదావు కళ్యాన్...నీ కవితలలోనే ఏదో ఆర్తి ఉంటుంది...చక్కగా వ్రాస్తావు

Padmarpita said...

చిన్న కవితలో చక్కగా చెప్పారు!

anrd said...

కవిత దానికి తగిన దృశ్యం , చక్కగా ఉన్నాయండి.

జలతారు వెన్నెల said...

కల్యాణ్ గారు...ఈ లైన్స్ చాలా బాగున్నాయి.

"చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది
ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది
దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి"

ఆత్మ విశ్వాసం గురించి చాలా బాగా చెప్పారు. మీరు తరచూ రాయండి.

Kalyan said...

@శశి కళ గారు చాలా సంతోషం :) అవునండి నిరాశ లోకి జారుకునప్పుడు కాస్తింత ఆశ చేరిస్తే సరిపోతుంది
@పద్మర్పిత గారు మీ రాకకు సంతోషం మీ విమర్శకు ఆనందం :)
@ఏ యెన్ ఆర్ డి గారు ధన్యవాదాలు :)
@వెన్నల గారు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం :) కచ్చితంగా రాస్తాను మీ ప్రోత్సాహానికి ఆనందంగా ఉంది

⁂ܓVållῐ ⁂ܓ☺ said...

Wow...chala bavundi me kavitha kalyan garu...

Kalyan said...

@వల్లి గారు ధన్యవాదాలు :) సంతోషం మీ రాకకు

Hari Podili said...

కళ్యాణ్ గారు!
ఏలే ఉన్నారు?

చూడవే కనులతోటి మొత్తమంతా నీదౌతుంది
ఆశ చేర్చు ఊపిరి తిరిగొస్తుంది
దేనిని వదులుకోకు మళ్ళీ కోరుకున్నా రాదు మరి


beautiful lines.keep it up

Kalyan said...

హరి గారు బాగున్ననండి మీరెలా వున్నారు ? థాంక్స్ థాంక్స్ :)

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...