నా స్నేహితురాలు సాధ్వి పుట్టిన రోజు
నా పరిచయానికి స్నేహానివి అ స్నేహానికి చక్కని అర్థానివి అ అర్థము పుట్టిన రోజు ఈరోజు విచ్చిన పూ పరిమళాలకు మొదటి రోజు ఎప్పటికి వాడిపోని చిరునవ్వుతో పదిలమైన ప్రేమానురాగాలతో తల్లి తండ్రులకు కూతురిగా సమాజానికి తలమానికంగా నీ ఆశయాలకు సారధిగా విజయ తీరాలకు చేరుకోవాలని కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు |
ఆలోచనా వైఖరి
சுட்டால் உயிர் போகும் மனிதனக்கு சுட்டால் உயிர் வரும் செங்கல்லுக்கு பட்டால் புரியும் பரம்பொருள் விட்டால் கிடைக்கும் அந்த பொருள் நின்றால் வரும் உன்கிட்டே சிலது சென்றால் போகும் இடம் எல்லாம் உன்னுடையது -------------------------------------------------------------- తమిళములో తోచినది అందు చేత అందులోనే రాసాను కిందది దాని భావము మాత్రమే -------------------------------------------------------------- వేడి తగిలితే ప్రాణం పోతుంది మనుజుడికి అదే వేడి ఇటుకను తాకితే దానికి ప్రానమోస్తుంది దెబ్బ తగిలితే కాని తెలియదు ఆ దైవము యొక్క ఉనికి అన్నీ వదిలితే కాని దొరకదు ఆ దర్శనము ఉన్నచోటే వుంటే కొన్నేనీదెగ్గరికి వస్తాయి నీవై కదిలితే అన్నీ నీదౌతాయి |
నవరసభరితం
నిర్మానుష్యం ఆ ఆకాశం నిర్వీర్యం అ వెన్నల సౌధం ఎన్ని చుక్కలు వుంటేనేమి ఎంత చీకటి కమ్మితేనేమి జ్యోతి లేని ఆ నింగి నీరు లేని కడలిలా వెల వెల పోతుంటే నేనున్నానంటూ చిగురించింది ఓ పరిమళం అది చల్లని గాలో లేక వెచ్చని వెలుగో తెలియదు ఎప్పటికి నిరంతరాయంగా సాగిపోయే స్వేచ్చా జీవిలా అందరికి ప్రాణమందించే స్నేహ భావంలా నవరసాల సమ్మేళనంతో నవరసభరితంగా సాగిపోతోంది |
Subscribe to:
Posts (Atom)
Paint
When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...