| జుట్టు తెల్లబారినా తెలియదు ఒళ్ళు నల్లబారినా తెలియదు కష్ట మొక్కటే తెలుసు కార్మికులకు ఎన్ని భవనాలు కట్టినా మన కలలను వారు నిజాము చేసినా పేదవారే కాని ధనవంతులు కారు మన నాలుకకు రుచులు వారిచ్చినవే మన మానానికి బట్టలు వారిచ్చినవే అయినా రుచుల సౌకర్యాలు తెలియని వారు మన రాచమార్గము వారి అడుగుల పుణ్యమే పాదరక్షలు వారి చేతుల చలవే అయినా ముళ్ళభాటపైనే వారి అడుగులు వేకువతో మొదలౌతారు చీకటితో నిదురిస్తారు అలసట తెలియని మహా యోధులు వారినే నమ్ముకుంటూ హాయిగా జీవిస్తారు |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
అలసట తెలియని మహా యోధులు..
Subscribe to:
Post Comments (Atom)
most difficult terrain
உன் அழகை ஆராய்வது தான் இந்த உலகிலேயே கடினமான பயணம். எதையும் விட்டு விட முடியாது, எதையும் ஏற்றத் தாழ்த்திப் பார்க்க முடியாது, ஒவ்வொன்றும் சமம...

6 comments:
ఎంత బాగా చెప్పారు కల్యాణ్ కార్మికుని గురించి.. నిజమే అలసట ఎరుగని మాహా యోధులు.. శ్రీ శ్రీ గారి పాట ఒకటి గుర్తొచ్చింది ఈ సందర్భంలో.. " కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి దానా " అని. చాలా బాగుందండి మీరు చెప్పినది..
the song is Atreya's
Sorry అండీ.. సూర్య గారు చెప్పింది కరెక్ట్.. నేను అది ఆయన రాసిందే అనుకున్నాను.
బాగుందండి మీరు చెప్పినది.
చాలా చక్కగా వ్రాశారు! అలసట తెలియని శ్రమ జీవుల కష్ట ఫలం మన అలసటని, నీరసాన్ని తీరుస్తోంది! ఏమీ ఆశించని నిస్వార్ధపరులు! ప్రకృతి వలన ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా దానిని నమ్మక మానరు!
@సుభ గారు పర్లేదు దాందేముంది సూర్య గారు సరి చేసేసారు గా మీకు దీపావళి శుభాకాంక్షలు :)
@సూర్య గారు తప్పును దిద్దినందుకు ధన్యవాదాలు మీకు దీపావళి శుభాకాంక్షలు :)
@పద్మార్పిత గారు ధన్యవాదాలు మరియు దీపావళి శుభాకాంక్షలు :)
@రసజ్ఞ గారు అవునండి వాళ్ళే నిజమైన ఆదర్శవంతులు ధన్యవాదాలు మరియు దీపావళి శుభాకాంక్షలు :)
Post a Comment