కదా నీపై మనసయ్యంది కదా

దివి దించిన కర్పూరమా,
దివ్వెలకు రారాణి నీ రూపమా,
మది పెంచిన మందారమా,
కంపించే భావాలకు ఆరాద్యమా,
లేత గాలి లేడీ పరుగు తీస్తుంటే ,
నాలో వేటగాడు బానమేస్తున్నాడే,
ఏడు జన్మలు నీతోటే అని తెలిసుంటే నాకు,
ప్రతి సారి ఇది మొదటి జన్మే అని విధిరాతను మోసం చేస్తుంటానే,
ముద్దాయిగా నన్ను నిలబడమంటే, 
నీ అడుగుల సాక్ష్యం మట్టుకే తీసుకుంటాను,
వాటికి ఏ అభ్యంతరం లేకుంటే,
మరిన్ని చిలిపి నేరాలు నీతో చేస్తూ పోతాను,
కదా నీపై మనసయ్యంది కదా,
కదా నాలో మెరుపొచ్చింది కదా,
అలా నిను చూస్తుంటే అలా,
కలా ఇది నిజమా కలా...

💜💜

No comments:

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔