శ్రీ రామ నవమి శుభాకాంక్షలు





సిరి నీవేకద సిరి నీవేకద శ్రీరామా ..

సిరి సంపదలన్నీ నీ నామమే కదా..

అది ఒక కాలము అయోధ్యా రాజ్యము...

ఇది కలి కాలము అన్యాయమే రాజ్యము...

విల్లులు అంబులు పనిచేయని రోజులయ్య...

ఏ మంత్రములు పనికిరావయ్య..



హిందువు నీవని ముస్లామాను కావని...

నరహరి నీవని క్రైస్తవుడివి కావని...

ఎన్నో కొత్త మంత్రాలు మనుగడలోనికి...

ఏమని పూజించను ఓ మనిషిగా నే ఏమని పూజించను...



భరత మాత కోసం బంధాలు విడనాడి...

పోరాడే యోధులు ఉన్నారు నీలాగ...

అదే నేలను కండాలుగా విడదీసే రావనులున్నారు..

ఏ రాముడు వస్తాడో ఎలా సంహరిస్తాడో..



నీ పుట్టిన రోజుకు నవ్వులు కావు..

మా కష్టాలే నీకు విన్నపాలు..

మళ్ళి రావయ్య ఈ రాజ్యమేలవయ్య...

అన్యాయాలు అక్రమాలకూ పరసురాముడిగా...

ప్రేమకు అభిమానాలకు కౌసల్య రాముడిగా..

భక్తికి ముక్తికి సీతా సమేతుడిగా...

దిగిరావయ్య రాజకీయ రాజ్యమును యేలవయ్య....

సిరి నీవేకద శ్రీరామా సిరి నీవేకద శ్రీరామా ..

సిరి సంపదలన్నీ నీ నామమే కదా.. 

No comments:

happy new year

என் அன்பு கண்ணம்மா, உனக்கு இனிய புத்தாண்டு நல்வாழ்த்துகள். உன் துணையுடன் இந்த ஆண்டுக்குள் நுழைகிறேன் என்ற எண்ணமே இதை இன்னும் சிறப்பாக்குகிறத...