జోలాలి పాపాయి





జోలాలి పాపాయి..

జోకొట్టు ఈ గాలి..

జగమంతా మూగబోయి..

నువ్ నిడురోవాలి..

నిదురలోన ఈ లాలి..

నీ చెవును చేరాలి..

అల్లరి చేయు నీ చూపులు..

చక్కటి కలలను చూడాలి..

కందిపోవు నీ బుగ్గలు..

కాస్త సేద తీరాలి..

నీ ముసి నవ్వులు నన్ను చేరాలి..

జోలాలి జోలాలి జోలాలి జోజో...

వెన్నంటిన అందాలు








కనీ కనిపించక..

చూపు నాపై వాలక..

దోబూచులాడువెందుకే ..

ఓ చిన్నదానా..

నీ వెన్నంటిన అందాలు..

నన్ను తాకుచున్నవి..

నా చూపును మళ్ళిస్తున్నవి..

ఒక్కసారి ఇటు చూడు..

పరవసిస్తా ఒక మారు..

ఏడుకొండలవాడి వైభోగం





వైభోగమే నీది వైభోగమే..

నిత్య కళ్యాణ వైభోగమే..

ఎనలేని భోగాల వైభోగమే..

ఏడుకొండలవాడి వైభోగమే..

రథమెక్కి మా స్వామీ తరలి వస్తుంటేను

చూచే కనులకు వైభోగమే..

పసిదికంతి వెదజల్లు ఆ చిట్టి బుగ్గలకు

దిష్టి చుక్కైనా వైభోగమే..

కోరిన వరములిచ్చేటి ఆ కొండల రాయునికి

తిరుమాడ వీధులలో వైభోగమే ....

రాముడెట్లుండునో





నీ నామమునకు వున్నపాటి మహిమ కూడా నీకు

లేకపోయెర రామ..

రామ రామ అనుదురు కాని నిన్నెవరు చూసినారయ నీ

రూపమును ఎవరు వేడినారయ..

విల్లంభులు ధరించి నీ సపరివారముతో వుండిన నిన్ను

గుర్తిన్చురు కాని నేవెట్లుండునో ఎవరికి తెలియును...

నీవు నా మొర ఆలకించి దర్శనమిచ్చిన నే చాటి చెబుతాను..

రాముడు ఇట్లుండునని చూడచక్కని వాడని,ఆజాను బాహుడని,కరునామయుడని,నీలమేఘస్యాముడని,

అవతారపురుషుడని......

నారాయణ





వినిపించిన చాలు నీ నామము..

ఎన్ని జన్మల పాపమైనా తొలగిపోవునే..

కలియుగాన కరువాయే నీ నామము...

తెలిసికూడా పలుకరే నీ నామము..

ముక్తి కలుగు మంత్రమే నీ నామము...

మరల మరల రుచి చూడ తగు నామము...

భోగాలకు తెలియదే నీ నామము...

కస్టాలు కల్గినపుడే తారక మంత్రము నీ నామము..

ఇంతకి ఆ నామమే నారాయణ రూపము..

కవితలు పలు రకాలు





ప్రియుడి కవిత ప్రేయాసికై..

ప్రజల కవిత ప్రభుత్వానికై..

రాజకీయుల కవిత పదవికై..

సన్యాసి కవిత మోక్షానికై..

నటుల కవిత తమ పాత్రలకై..

పేదల కవిత పొట్టకూటికై..

మనుజుని కవిత స్వార్ధానికి..

భక్తుల కవిత పుణ్యానికి..

నా కవిత సమాజ స్పృహకై..

తెలుసుకోండి బాగా మసులుకోండి..

ప్రేమ పలు విధాలు





మనస్సు తెలిసిన ప్రేమ మంచి ప్రేమ..

వయసు తెలిసిన ప్రేమ వన్నె ప్రేమ..

సొగసు తెలిసిన ప్రేమ శృంగార ప్రేమ..

మూడు ముళ్ళ ప్రేమ ముచటైన ప్రేమ...

కీర్తి పెంచు ప్రేమ అమర ప్రేమ..

కీడు తెచ్చు ప్రేమ కుంటి ప్రేమ..

చివరిదాకా నిలుచు అసలైన ప్రేమ..

భక్తి





దైవ భక్తి తోడుంటే సాధించవచ్చు ఏదైనా..

గురు భక్తి తోడుంటే నెరుంగవచ్చు దేన్నైనా..

మాతృ భక్తి తోడుంటే సకలము నీ ముంగిట్లోన..

దేశ భక్తి తోడుంటే చావులేదు ఎపుడైనా.. 

 



సరదాలు





సరదాలు మా ఇంట..

సంతోషమే ఈ పూట వంట..

సంబరాలు తాంబూలమంట..

సరిగమలే అందరి నోట..

సాయం సంధ్య వేల సెలయేటి వంక వెంట..

శ్రుతులు పరుగులు తీసేనంట..

సంకోచమే లేక అందరినోట నవ్వుల పంట..

సరిలేని నాట్యానికి లయలు జతకతెనంట... 



క్షణం క్షణం ఓ యుగo





క్షణం క్షణం ఓ యుగమౌతుంది   ..

నీ జవాబు వోచ్చేంతవరకు..

నీ జవాబు చేరినా..

మరుక్షణానికై వేచివుంటోంది నా మనసు..

వదలకు





ఒంటరినై ఒకే అడుగై..

విరసిన పువ్వై తుమ్మెద కై.

ఎపుడో వొచ్చే ప్రేయసికోసం..

వేచివున్న ప్రేమికుడనై..

పెట్టుకున్నాను ఆశలన్నీ నీపై..

నను వదలకు ఇంకో ప్రేమకై..







శుభోదయం





వేకువనే వెలుగుతో పరిచయం..

నవ్వుతో మొదలైతే ఆ రోజంతా ఆనందం..

మనకేది అడ్డు కాదని ముందుకు సాగిపోదాం..

విజయమే మన మొదటి లక్ష్యమని తెలుసుకుందాం..

ఒంటరి ప్రేమ





వెలుగే నీడ కోరినపుడు..

అ నీడే ఈ చీకటౌతుంది..

ప్రేమే ప్రేమను కోరినపుడు..

అ ప్రేమ ఒట్టిదౌతుంది  ..

ఏ మనసు చేరినా..

ఒంటరిగానే మిగిలిపోతుంది...





చీకటికి కారణం





చెలి కన్నుల కాటుక తీసి..

ఆకాశాన్ని తడిమితే..

అది చీకటయింది..

తన నవ్వులను..

వాటిపై చల్లితే..

వెన్నలగా విరబూసింది..

తన కురులు వదిలిన పూల రేకులు..

తారలై ఆ రేయికి అందాన్ని తెచ్చింది..

నా మనసును కలవరపరచింది..

స్నేహరచనలు



తెలవారికి సూర్యుడు..

రేయికి జాబిలీ..

పూలకు వాసన..

సముద్రానికి కెరటం..

మనసుకు ప్రేమ..

ఇవన్ని ప్రకృతి లోని స్నేహరచనలే  ..



స్నేహం



చీకటిలో వొచ్చే కల కన్నా కన్నా..

వేకువనే మొదలయ్యే స్నేహపు అలలే ఆనందం..

సూరీడు ఇచ్చే వెలుగుకన్నా..

స్నేహపు నవ్వుల పలకరింపులే ప్రకాశవంతం..



దేవుడు తోడు



దేవుడెంతో తెలివైన వాడు..

అంతకు మించి మనసున్న వాడు..

జీవితమనే పూలను తీసి..

కష్టాలనే దారానికి అల్లాడేమో ..

బాధలే లేకుంటే పూలన్నీ చెదిరి..

అందమైన మాలగా లేకుండా..

ఒంటరిగా మిగిలేవేమో..

మనకన్నా పైవాడికే కష్టాలేకువ్వ..

ఈ మాలను వేసుకునేది అతనేగా.

కనిపించని చెలి



వెన్నెల నీలాగా మనసులా రాదా...

రెండు కనులు మనలాగ..

ఒకటి ఒకటి చూసుకోవా.

ఎందుకింత దూరము..

మాటకు మనసుకు ఉన్నంత  దూరము..

ఎందుకింత తాపము..

వాడిన పువ్వే వికసించేంత చల్లని తాపము..

నిజమైన అందం



అందం అంటే రెండు అక్షరాల పదం కాదు..

ఎన్నో గుణాల సమ్మేళనం..

కష్టాలలో ఆదరించే చేతులుండాలి..

మన అడుగులో నడిపించే నేర్పుండాలి..

ఎంత దుఖానైన వారించే చిరునవుండాలి..

మానవత్వం ఉన్న రూపముండాలి..

నవ్వుల శుభోదయం



ప్రతి నిమిషం గుర్తొచ్చే ..

స్నేహితుల జ్ఞ్యాపకం..

గడచినధైనా గుర్తొస్తే..

తెలియని ఆనందం...

నన్ను మేలుకొలిపే..

నవ్వుల శుభోదయం..

ఆలోచన





తడిమి తడిమి చూసిన నొప్పి తెలియలేదు..

మనసు తాకి చూసినా అది ప్రేమ కాదు..

అందాన్ని కోరే కోరిక కాదు..

తిండి లేక ఆకలి బాధ కాదు..

ఆశయము లేని ఆలోచన కాదు..

మరి తెలియని బాధ ఏదో..

నను పలకరించిన వింత ఆలోచన ఏదో..

స్నేహం





ఎంత వేడి తాకినా..

నీ దూరము నను తాకకుంటే చాలు..

ఎంత చీకటి కమ్మినా..

నీ మౌనం కమ్మకుంటే చాలు...

దూరమయ్యే ప్రేమలు ఎన్నున్నా..

మన స్నేహం వీడకుంటే చాలు..

కరువు





మాసిపోయిన బుగ్గలలోనూ చిరునవ్వు దాగుంటుంది...

రాత రాని చేతులలోను బంగారు భవిష్యత్తు దాగుంటుంది..

కుమిలిపోయిన మనసులోనూ ప్రేమ ఆకలి నిన్డుంటుంది..

ఇవన్ని గుర్తించి నిర్మూలించిన యావత్ ప్రపంచం సశ్యశ్యామలం అవుతుంది..

కరువు అనే ఆకలి మంట చల్లారుతుంది..



నవ్వు



నా కనులకు ఈ పగలే వెలుగైతే..

వెలుగులో వికసించే నీ నవ్వే నా మనసుకు వెలుగు..

చీకటిలో వెలుగు గుర్తొచ్చినా..

వెళ్ళే దారి తెలియదు..

కాని బాధలో నీ నవ్వు గుర్తొస్తే..

ఉన్న కష్టాలన్నీ దిగిపోదా...



మనసుకు వెలుగు కావాలి



క్షణమైనా భరించలేని దాన్ని..

అనుక్షణం అనుభవిస్తూ..

ప్రపంచాన్ని కనులతో గాక..

మనసుతో చూస్తున్నారు..

చూపుని మించింది మనోధైర్యం అని చాటి చెబుతున్నారు..

చీకటిని తొలగించు వెలుగును మదిలో దాచుకొని..

పరులకు సైతం ఆదర్శప్రాయంగా వున్నారు..

మీరు మాకు గురువులు కావాలి..

మనసులోని అంధత్వాన్ని  తొలగించాలి..

పెళైన కొత్త జీవితం





పెళైన కొత్త జీవితం..   

ఏమిలేని తెల్ల కాగితం..

ఏమైనా రాయవచ్చు..

రంగులైన వేయవచ్చు..

చేరిపితే చెరిగిపోదు..

మళ్ళీ మళ్ళీ వెనక్కి పోదు..

రాసేముందు ఆలోచించాలి..

అక్షరాలలో అర్థం ఉంచాలి..

ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ..

ఏమి దాచకుండా అన్ని పంచుకోవాలి..

నడక







నడకేర స్నేహం ....

నడకే సుదూరం!..

నీ ఆకరి సమయం అవుతుంది దూరం...

నడక నేర్చినా వైద్యం ..

ఏ వైద్యులు చేయలేనిది..

నడక లోని మర్మం..

మనకెంతో మేలైనది..

నడక నేర్పిన ఉధ్యమాలు ..

మనకెంతో ఆదర్శం..

నడత మంచిదైతే..

అదియే మనకు ఆరోగ్యం..

వోదార్పు



ప్రేమతో సంతోషించినా..

ప్రేమలేక బాధపడినా..

ప్రేమించిన వారు ప్రేమికులే ..

బాధించు వారు ప్రేమికులే..

ప్రేమతో వొకటౌతారు..

ప్రేమలేక వొంటరౌతారు...

రెంటికి బేధం లేదు..

ఏ పాత్ర వారిదే..

ఏ ప్రేమైన వారి వారి అభిప్రాయాలే..

సొగసు






మడత లోని మర్మం ....

మధురాతి మధురం..

మగువ లోని అందం..

రుచి లేని మకరందం..

మేని లోని మౌనం..

రాయలేని కావ్యం..

నడకలోని లావణ్యం..

నాట్యానికి అతీతం..


నక్షత్రం



రాతిరి వేల కొండల చరియ ఓ చెలియా..

నిగారించాకే నన్ను నివారించాకే..

పొదల చాటున దాగివున్నావు..

వెరసి వెరసి చూస్తున్నావు..

అందరాని దూరంలోనూ మెరసి మెరసి పోతున్నావు..

నీలి నింగిలో జలకాలాడి మబ్బు పాన్పుపై శయనించి..

వన్నె తగ్గని వయ్యారివై..

మా ఎదలో కలగా మిగిలిపోతునావు...



ప్రేమ?





చూపులు కలసి ...

మనసును తెలిసి..

పెదాలు పలికే..

పదాలు ప్రేమ..

వయస్సు చేసే చమ్మకు ప్రేమ...



నా అర్ధాంగి






అర్ధాంగికి ఒక అర్థం..

ఆడంబరాలకు పోనీ గుణం..

వయ్యారాలకు ఆమె చుట్టం..

వగలాడి ఆమె మరో నామం..

లేడి కళ్ళ పడుచు రూపం...

హంస నడకల నిటారు అందం..

మనస్సు లోని కావ్య రూపం...

పెనవేసుకోవాలి ఇద్దరి హృదయం..

ఆపై జరగాలి మా పరిణయం..



అందం




వెలకట్టలేనట్టి సంపన్నమా...

వెయ్యి వెన్నలలు కలిసిన మనిహారమా..

నా మదియ ముంగిట్లో మందారమా..

నా సారాన్ని బంధించు సింగారమా..

వర్ణాలు సరిపోని చిత్రంగామా..

నిను యేమని వర్ణించనే ఓ అందమా..


నేల తల్లిని కాపాడేదెవ్వరు?



ఎండ కూడదని గొడుగు పడతారు.

అ చేతితో ఒక్క మొక్క నాటలేరు..

మనను మనం చూసుకునే తెలివుందికాని ...

నేల తల్లిని కాపాడేదెవ్వరు  ...

ఓదార్పు













దాగుడు మూతలు చాలింక ...

ఈ అన్నయ కంట పడవే కాస్త .....

కనులు మూసి కన్నీరు కార్చినా ....

అ కనులు చెప్పెనే నీ దిగులంతా .....

దాచకింక నా దెగ్గర ....

జారవేయి నీ దిగులంతా ...

నీ మనసు కన్నా నేను ఎక్కువ బరువు మోయగలనే ....

విడిచిపెట్టు నాపైన మోస్తాను ఎంతైనా ......

కొట్లాడుకుందాం





పిల్లి ఎలుకలా ఆటాడుదామా,

వొకరికి వొకరు తిట్టేసుకుందామా,

తమాషాగా తరిమి కొడుతూ హుషారుగా తిరిగేస్తామా,

నేలపై కాలు నిలపకుండా ఆకాశంలో విహరిద్దామా,

దూరమైనా చందమామతో గొడవచేసి కిందకి దింపేద్దామా  ,

నక్షత్రాలను పీకేసి మన స్నేహానికి గుర్తుగా దాచేద్దామా,

కొంటెగా కొట్టుకుంటూ ఎప్పటికీ ,

మనకంటూ ఓ జ్ఞాపకాన్ని  తయారు చేసుకుందామా......... 

   



అమ్మ







ఈ లోకం చూపే మొదటి కళ్ళు అమ్మ ,

ప్రతి అడుగున తోడుగా నిలిచే స్నేహం అమ్మ ,

మాటకైనా మొదటి పదం అమ్మ ,

మనకై ఎపుడు మన మంచిని కోరే అపురూపం అమ్మ ,

ఒకరికోసం కష్టాన్ని మోసే ప్రతి ప్రాణం అమ్మే ,

తలచిన వెంటనే మనకోసం తోడొచ్చే వరం అమ్మ,

భాష ఏదైనా పిలుపు ఏదైనా,

ప్రతి వొక్కరు నేర్చినా చదువు అమ్మ,

దేవుడి వద్ద చేసిన తప్పుకు శిక్షే ఉంటుంది కానీ,

అమ్మ వద్ద ప్రేమేవుంటుంది .........

కన్నీటి కధ







కన్నీరు తాకిన చేతులు తడి ఆరలేదింక!...

ఆ తడి మాటున కధ తీరలేదింక!...

కంటి పాపకి తీరని ఆశలన్నీ నీరుగా...

చెప్పుకోలేని బాధలన్ని మౌనంతో తీర్చేనిల! ..   



కురులు









కురుల సిరులకు మల్లెలు ఇవ్వనా ..

మనసు అల్లిన దానికి ప్రేమ ఇవ్వనా ..

నలుపు చూపి చీకటి చేసి ...

మాయ చేసినందుకు నన్నే ఇవ్వనా ..

ఏమివ్వను ఆపై ఏమివ్వను ..

కమిలిపోయే పుడమి తల్లి









కమిలిపోయే పుడమి తల్లి మనస్సు...

వాడిపోయేనే తన పచ్చని సొగసు ..

కన్నీటికైనా మిగలని నీటి కరువు ..

కటిన్నంగా వున్న తన ఊపిరి సెగలు .. 

జాబిలి తీరు





రోజు నాకోసం ఆకాశమంతా వెలుగు పరచి వెతికేవు ,

అందని నాకోసం అంతగా వేచివుంటావు ,

ఎందుకో నీకు ఈ ఆరాటం,

దిగులుతో కొన్నాళ్ళు తరిగిపోతు,

ఆనందంతో ఇంకొన్నాళ్ళు పెరిగిపోతు

ఎందుకో ఈ వేదన,

చెప్పవా నాకు చెప్పవా నీవన్నీ నా చెంత పంచుకోవా .......



ప్రేమ - స్నేహం





చెలిమితో కుదరదు చిలిపి తలపులు ...

మనసు కోరే వయసు రంగులు ...

ప్రేమతో కుదరదు నిస్వార్ధపు రాగాలు ...

మనకోసమే అంటూ వుండే గుండె చప్పుడు ...

ప్రేమలో లేనిదీ స్నేహంలో చూసుకో ...

స్నేహం లో లేనిదీ ప్రేమతో సాధించు ..

 



కురులు





సెలయేటి హొయలు వుండాలి కురులలో...

నేలకందు పొడవుతో ...

చీకటి కమ్మిన రంగుతో ...

తారలై వున్న పూలతో ..

నెలరాజు లేని వొక్క లోటు తప్ప ...

గాలికి ఊగుతూ స్వేచగా వుండాలి ....

ప్రియుడి మనసులో ప్రేమను పండించాలి ...

రాదు ?



రాదు రాదన్నది రాకూడదు  నీ నోటిన..  

రాదనేది మళ్ళి రానీయకు..

వొచ్చినదానిముందు రాదన్నది ఎంత..

కొంత రానివ్వు మరింత ఆపై వొస్తుంది..

ప్రేమ ?



మాటవదలి మనస్సు చేరితే ....

చేయి వదలి కౌగిలి కోరితే ..

రెప్పలు మూయక కనులు చూస్తే ....

నవ్వుతో కవ్విస్తే ...

దూరం కాస్త దెగ్గరైతే..

మనసు మనసు మాట్లాడితే ....

వీటన్నిటి  అర్థమేమి ? దానికి కారణమేమి ?......

నవ్వు



రెండు పెదాలు  దూరమై నవ్వును తెప్పిస్తాయి ..

మనకోసం అవి దూరమౌతాయి ..

అన్నింటిని సరిచేసి బలమిస్తాయి ...

మనసులోని సంతోషానికి గుర్తును ముద్రిస్తాయి ....

శుభోదయం



నలుపు కమ్మిన రేయిని తోలచివేసి..

పచ్చని సొగసుల పరిచయాలతో..

తియ్యటి స్నేహాన్ని గుర్తుచేస్తూ...

వెచ్చని బంధాలకు స్వాగతం పలికే..

శుభోదయం.. 

నిదుర



కనులకు నిదుర నా మనసుకు ప్రేమ కావాలి ,

గిలిగింతలు  పెట్టే చలిలో చెలి ముచ్చట్లు కావాలి ,

విర బూసిన వెన్నెలలో విరజాజుల స్నేహం కావాలి,

కనిపించని నా చెలికి నా జాడ తెలియాలి ,

ఈ రేయంత తన కోసం నా కలలను   మేలుకొలపాలి .....

చీకటి భయమెందుకని



భయమెందుకని నీకు భయమెందుకని...

నేనుండగా నీకు భయమెందుకని...

ఆ జాబిలమ్మ వొంటరికాదా..

తనకు లేని భయము నీకెందుకని  ...

నీ మనసులో ప్రేమ వొంటరికాదా..

తనకు లేని భయము నీకెందుకని...

చీకటిలో వెలుగు ఒంటరేగా..

తనకు లేని భయము నీకెందుకని...



చుక్కలు చూస్తే భయమా ..

చల్లగా వీచే గాలి భయమా...

వెచ్చని జ్ఞాపకాల భయమా ..

సుతి మెత్తని నీ ఆలోచనంటే భయమా..

లేక నిను ఆదరించే స్నేహమంటే భయమా..

ఇన్ని ఉండగ నీకు భయమెందుకని..



భయమే నీ నిదుర కనులు చూసి పారిపోవాలి..

భయపడకు భయపడకు ఎమి లేదిక భయపడకు...





  













అందీ అందని జాబిలీ



అందదు ఆ  జాబిలీ...

నాకందెను ఈ జాబిలీ...

తరగని ఓ ప్రేమతో..

పెరిగే చిరునవ్వుతో..



ఆకాశానవోకటున్నది...

నా చెంతనే వొకటున్నది..

మనసులో వున్నది ..

నా ప్రేయసై  వున్నది..



ఆ జాబిలి చిరునామా తెలిసినా ..

చిరుకబురే పంపలేకున్నా..

ఈ జాబిలి నా చెంతనే వున్నా..

ఓ ముద్దు ఇవ్వలేకున్న...



ఆ జాబిలిని చేరలేకున్నా .

ఈ జాబిలిని వదలలేకున్నా ...

కౌగిట్లో బంధిస్తూ రేయంతా వుండిపోతాను... 

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...