శివుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ..









నా మనసులో ప్రతి రోజు జన్మిస్తు...

పుట్టిన రోజు జేరుపుకున్టునావు...

ఈరోజులో ఏముంది ప్రత్యేకం ?

న కనులలో మేదిలినపుడల్లా తీపి అందిస్తునావు...

ఈ రోజులో ఏముంది తియదనం ?

నాకు అమ్మగా జన్మనివ్వకపోయిన ...

నాలో సుగుణాలను జేన్మించేల చేసావు ...

నీ స్నేహానికి కారణమైన ఈరోజు ...

మరువలేను మరచినా నిన్ను మరువను...
 

చెలిమి నిండిన స్నేహ సమాజం..









మాట వరుసకు భేధముండదు...

మచుక్కైన కులము ఉండదు...

పేరులోను జాతి ఉండదు...

రాజకీయం అసలే ఉండదు...

ఇదే మన నవ్యసమాజం...

చెలిమి నిండిన స్నేహ సమాజం...

 

చెల్లాయికి జోల పాట..



నా చెల్లాయి పెళ్లి కాకముందు తనను నా ఒడిలో నిడురపుచ్చుకోన్నటు ఊహించుకొని రాసినది



పసి పాపలా లాలింపుతో..

చిరునవ్వు లోని చిగురాసతో...

నిదురించవమ్మ ఈ అన్న ఒడిలో జోజో జోజో....



నీ ప్రేమ కోసమే జీవితము...

అత్తినితివరకే ఆనందము...

ఉన్నంత వరకు ఈ అన్న ఒడిలో జోజో జోజో...



చిగురాకు చేసిన అలజడికి...

బయమెందుకమ్మ నా చిట్టి...

కనురెప్ప బరువును మోసే ఈ అన్న ఉండగా...జోజో జోజో...



కన్నీరు తీరని...

కస్టాలు చేరని..

నా చూపులన్నీ నీ నిదురపైనే...

నా మాటలన్నీ ఈ గడియవరకే...

ఆ పొద్దు నిన్ను తీసుకేల్లునే అత్తవారి ఇంటికి...

నా మాటలన్నీ వదలకు నీ నిదురలోని కలలకు జోజో జోజో....



తీసుకో మరిచిపోకు జ్ఞ్యాపకాలను...

నను వదులుకో నీ వేలినడుగు నీ సరిజోడును..

అంత ఈ చీకటి తరువాతే,,,

అంతవరకు ఈ అన్న ఉండగా జోజో జోజో... 

అందమైన పడతులు...







ఆరని పారానికి అందాల పాదాలు...

తీరని విరజాజులకు నల్లని కురులు...

అధిన రంగులకు చక్కని చెకిల్లు...

మత్తుగొలిపే ఎరుపునకు తియ్యటి అధరాలు...

ప్రేమను మోసే ఎద జతలు...

నాజూకు నయగారాల ఒంపు సొంపులు...

గల గల గాజులకు చిక్కని చేతులు...

వెలుగు మరిపించే కాటుకకు లేడి కనులు...

కునుకు తీయని కలలకు అందమైన రూపు రేఖలు..

ఆత్మీయమైన ఈ ప్రపంచానికి అందమైన పడతులు...

అబద్ధం నిజమైతే అది మంచిదే...



ఇక్కడ గీతలు వంకర అన్నది ఓ అబద్ధం...

కొలబద్దతో పరిశీలించండి...





నిజము తెలిసి మనసు దూరమైతే ప్రేమ అన్నది ఎక్కడ .....

రూపమేరిగి కనులు దూరం చేస్తే చెలిమి అన్నది ఎక్కడ.....

బాధలున్న పెదవే నవ్వకుంటే ఆనందం ఎక్కడ...

కులము మతము జాతి బేధము అన్ని నిజమైతే మనుజుని మనుగడ ఎక్కడ....

అబద్ధమే ఓ ఆశ పదే పదే చెబితే అదే నిజమవ్వదా...



చెబుదాం ఓ అబద్ధం మనమందరం ఒక్కటని...

చెబుదాం ఓ అబద్ధం మనలో జాతి మతం లేదని...

చెబుదాం ఓ అబద్ధం దేశానికే నా ప్రాణమని...

చెబుదాం ఓ అబద్ధం అది నిజమవ్వని...



నిజమైన జీవితానికి అబద్ధాలే తుది మెట్టు..

మనసుకు మమతలకు అబద్ధాలే ఓదార్పు...

గడిచినదంతా అబద్ధాలే  అని మరచిపోతే నిజమైన లోకం మన ఎదుట..

లేనిదంత అబద్ధము  అని చెప్పినపుడే ఉన్నది నిజమౌతుంది..



నేనే ఓ అమ్మనైతే...





పూతోటనై పూలకు ఓ అమ్మనై...

చిగురాకులనే చేతులతో కాపాడుకుంట...

ఈ ప్రకృతై  పచ్చని అందమై....

ఈ నేలను నా ఒడిలో నిదురింపజేస్త..

ఆ బ్రమ్హే పూజించే దేవతా రూపమై...

నా బిడ్డలా తలరాతను సరిచేయమంటా...

కలలకు అమ్మైన అ చీకటి నిధురై...

వేకువ ఒచ్చేవరకు తోడుంట...

నీటి చుక్కను మోసి ముత్యము చేసే అల్చిప్పనై...

అ ముత్యమును వెలకట్టలేని సంపదగా చేస్తా...

పేద జీవితాన ఆకలి నిండిన హృదయాలకు...

ప్రేమ పంచే పిడికిలి ముధనౌతా వారినవ్వులకు కారణమౌతా...

చినుకును పుట్టించే మేఘమై ...

కరువులేకుండా కాసులను కురిపిస్తా...

రెండు హృదయాల ప్రేమకు కారణమైన మనసునై...

అ ప్రేమను చివరిదాకా పెంచి పోషిస్తా..

దేశమాతనై వీర సైనికుల ఆత్మలకు ఓ స్వతంత్ర చిహ్నమౌత ...

అమ్మ





తీరని రుణమంటూ ఉంటే..

అమ్మరుణము ఒక్కటే..

మనలో ప్రాణం ఉందంటే..

కారణం ఆ దేవతే...



ప్రేమకు మించిన ప్రతిరూపం..

అ దేవుడే కోరెను అమ్మ గుణం..

కోరకుండానే వరములిచ్చే మానవ రూపం..

తెలియని మనకోసం బరువును మోసే నిస్వార్ధం..

తనను మరచి మానకై  పరితపించే అమ్మ ప్రాణం..

స్వాతంత్రదిన శుభాకాంక్షలు.





కధలివస్తోంది భారత దేశం...

వెలుగు ఆరని దివ్య తేజం..

యుగయుగాల ప్రస్తానం..

ఇది ధర్మానికి పెద్ద పీటం..



అన్యులకు సామాన్యులను..

గొప్పవారిని బడుగులను..

బెధమేలేక ఆదరించే..

గొప్ప దేశం భరత దేశం..





వేదాలను చూసిన దేశం...

దేవుడు చేసిన సుందర సౌధం..

శాంతికిదియే నిలయం..

గొప్ప నేతలు పుట్టిన దేశం..





మతాలకు తావులేని మానవత్వం..

అన్ని బాషలు కలిగిన కమ్మని రాగం..

యువతనే సారధులుగా ఉన్న భవిష్యత్ ప్రపంచం..

మన అందరి చేతిలో మెదిలే స్వప్నం..

కదలి రండి కాపాడుకుందాం...

ముందు వెనుక..







కన్నీరు కార్చే కనులేవ్వరివో...

తీర్చే మనసు ఎవ్వరిదో...

ప్రేమను కోరే బందాలనడుమ...

ద్వేషం కోపం ఎందుకనో..



దేవుదిచిన్న నిమిషాలలో..

ప్రతినిమిషం ఈ గొడవేగా..

తాను నేర్చిన పాటాలలో...

జీవితం ఎక్కడ కానరాదుగా..





ఎదురు చూసినా పలకరింపులే...

నవ్వుతు వాలుతూ ఓదార్పులే...

వెన్నకి పోయి ఈసడింపులే..

తనకే అంతా అంటూ చెప్పే మాటలే..





చివరికి ఏమని తెలియదు పాపం...

ప్రస్తుతానికే ఇస్తారు విలువలు...

ఊపిరాగినా తెలియదు నేరం ...

కనీటి వీడ్కోలు అర్పిస్తారు...





అన్ని తెలిసిన గునమేవ్వరిదో...

మోక్షాన్ని పొందిన ఘనతేవ్వరిదో.....

కొంత సేపటికే ఈ ప్రాణం...

తీరిపోయినా మిగిలే వ్యర్ధం...

సుసికళ...



తగిలిన వాటిని చల్లగా చేస్తూ తాను కరిగిపోతు.....

ప్రకృతి చేసిన ఓ రూపమై....

మనసు కలిగి వాటికీ కనులు కలిగి....

భాధనూ చల్లని నీరుగా చేస్తూ....

ప్రేమకు తనను తనే బహుమతి చేస్తున్న మాట ఒచ్చిన మంచు రూపము...

మనుషులలో ఓ ప్రేమ రూపము....

నవీన పోకడ..



నడుము తాకు కురులు కాస్త మెడను తాకెను..  

చక్కనైన కట్టు చీర బాగా చురుకాయెను..

మాటలోని మాధుర్యం కఠినమాయెను....

మేని చాయలు ఎంతో మెరుగాయెను...

పత్తి లాంటి పాదాలు మొద్దుబారెను..

సిగలోని పూలు జడ పట్టిలాయెను..

చేతికుండు గాజులు చెవిపోగులాయెను..

ఆడదాన్ని ఉనికి చెప్పు గజ్జెలు మూగబోయెను.

సిగ్గుపడే చెక్కిళ్ళు కరువాయెను...

కళ్ళు దిద్దు కాటుక జడరంగులాయెను...


ఏమిటది ఏమిటి... కనుకోండి చూద్దాం??





పగలే రాతిరి తారకలు...  

రెయిన మధ్యానపు ఎండలు..

వాడిపోని పూలు...

సంకెళ్ళు లేకనే బంధించబడిన కైదీలు...

ఎవరు అది ఎవరు ఏమిటది ఏమిటి??

.


ట్రాఫ్ఫిక్ లోకం...





నడక నడుమే చాలదు..

గాలికూపిరి ఆడదు...

మన జీవితం లో ఒక్కరోజును తీసివేసే...

కొంత సేపటి యమలోకం...

అది ట్రాఫ్ఫిక్ లోని గంధర గోళం..



సూదిలో తీగను దోపచ్చు..

ఇంకా మనమే దూరేయచ్చు..

కాని దారులు ఉన్నా దూరలేని..

ఏ మార్గము లేని మాయ మార్గం...



మనపాపాలే గొట్టాలలో పొగలై వెంటాడుతుంటే..

కదలలేక ప్రళయ నాదాలే మోగిస్తూ..

ముందున్న వాడె నారాయనడిలా కనిపించే..

ఓ మంచి వేదం ట్రాఫ్ఫిక్ లోకం..



భయము...





మన ఆలోచన మనచెంత లేనపుడు...

మన కర్తవ్యానికి మనమే తోడు లేనపుడు...

కలిగే భావనే ఈ చీకటి...

ఆ నిదురలో ఒచ్చే కలలే ఈ భయము...


స్నేహమనే స్వార్ధం...





స్నేహంపై నమ్మకం ఉంటే ...

స్వార్ధం దరి చేరదు...

కాని ఎంతటి నిస్వార్దులకైనా..

స్నేహం అనే ఓ స్వార్ధం ఉంటుంది...


ఓ వనిత నీకొక్క మాట.....





ఓ వనిత నీకొక్క మాట భయపడకు....

చేజారుతున్న జీవితాన్ని తుది ముట్టించు...

అలుపన్నది లేదు నీకు గెలుపన్నది నీ పేరు...

నిజమంటూ ఒకటుంటే నిర్భయంగా పోరాడు...



అందరికి కలలు వారి నిదుర చేతులో...

నీకంటూ కలలుంటే నీ చేతలలో...

నీవే ఒక పువ్వై నలిగిపోతావో...

లేక ఆ పువ్వునే మాలగా ధరిస్తావో....



అందరికి కారణం నీవైనపుడు నీకెందుకు తోడు...

నీ నీడ కదలితే చాలు కష్టాలే కడతేరు...

కదలిపో ఓ మహిళా మహా సంద్రమై...

కబళించు అన్యాయాన్ని ఓ ఉప్పెనై...

ఎంత భావము ఉండునో?





కవికెన్నడు  కాకూడదు ఏది భారము...

తగిలిన రాయి కూడా ఓ ఆలోచనగా మారాలి....

చిరిగినా కాగితము లో కూడా అక్షరము చోటు ఉన్నప్పుడు...

మనకున్న ఆలోచనలో ఎంత భావము ఉండునో??..

సరిచేసుకోవాలి అనుక్షణం.





శిధిలమైన మనసులో శికరమంటే ఆశలు,

కొంచమైన కోరికలతో మితిమీరె ఆలోచనలు,

బ్రతుక నేర్చుటకు వేసే అడుగులలో ఎన్నో తప్పటడుగులు,

ప్రేమను చేరే ఆలోచనతో కుంగిపొయే పెంచిన మమకారాలు,

ఎంత జేరిగిన ఆగకూడదు ఈ జీవితం,

తప్పు చేసిన సరిచేసుకోవాలి అనుక్షణం......



మంచి మాటల గొంతుంటే చాలు

బోసి మెడలో హారాలు లేకున్నా మంచి మాటల గొంతుంటే చాలు,

మువ్వలు తెలియని పాదాలైనా తోడొచ్చే గుణముంటే చాలు,

రతనాల గాజులు లేని చేతులైనా ప్రేమను చూపే స్పర్శ చాలు,

కాటుక లేని కనులైన వాటికీ సైగ చేసే తెలివుంటే చాలు....


చీకటి ధర్మం..





అంతా చీకటైతే దూరమే తెలియదు...

చెరువైనా కాకున్నా దుక్కమే ఉండదు...

వేలుగునుండి కూడా మిగిలినదేమిటి..

ఆ చీకటేగా అది నిజమేగా..



ఆశల పెన్నిధి నను పెంచెను..

స్వర్గాన్నే చూపించెను...

ఇదే నా ప్రపంచమంటూ..

నిదురలో కూడా చీకటిని చూపించక...

కలలంటేనే తెలుపక కధలు చెప్పెను..



తీర వొకనాడు తెలియని మైకం...

తెలిసినా కనుగొనలేని వింత లోకం..

చూసినవేవి లేని ఓ మాయ పర్వం..

తను ఉన్నానంటూ గుర్తు చేస్తూ..

నన్ను పలకరిస్తూ నాతో ఓ నిదురగా ముచ్చటించే....



తెలిసినది అది చీకటని ..

అందులోనూ హాయి ఉందని...

స్వర్గానికి అర్థం తెలిపేల అది ఓ కళ అని..

వెలుగు దూరమైతే తన వాడికి చేర్చుకునే అమ్మ అని...





నేను ఒంటరిని కాలేను





తూరుపు దిక్కున వెళుతున్నా నాతో వేలుగంటి స్నేహము తోడొచ్చెను ......

పడమర వైపు పరగేడుతున్న చీకటి నక్షత్రాలే పలుకరించెను......

ఉత్తరము చూసి అనువైనదని పోతున్నా దక్షిణము నా వెన్నంటే ఒచ్చెను....

ఎక్కడికి పోయిన ఒక తోడు ఉండగా నేను ఎక్కడికి పోను....

నేను ఒంటరిని ఎలా అవుతాను..

వంకర మూతి.





చిన్ని మూతి వంకర మూతి...

నవ్వుతు పలికే ముత్యాల మూతి....

ముచట్ల రాగాలు తెలిసిన మూతి...

గారాబాలకు ముద్దుల మూతి....

మంచి మూతి ఇది వంకర టింకర మూతి...

నీరు చూడని తామర

ఆ మాట కరువైనా మది కలవరపడదా,

ఆ మత్తు లేకుంటే నిదుర నొచ్చుకోదా,

స్నేహము లేని బంధము,

నీరు చూడని తామరలాంటిది,

ఒకటికి మరొకటి తోడు లేకుంటే,

ఏది సాధ్యము ఏమి సాధ్యము....


నా పలి





గాలి తెరపై అక్షరాలే చాలక నీటిపై....

అది నిండినా చాలదని నిప్పు సెగల నిటూర్పులపై....

కాలినా అది తీరనిదై నేల పలకపై.....

కుదరదని తెలిసి మేఘాల పై....

కాని అరిగిపోని పలి నా పలి చాలని మాట అది నాలో మాట.... 

వేకువ





రేయంతా మబ్బులు కూడగట్టిన వెలుగు...

ఒక్కసారిగా ఈ వేకువై ఒస్తుంటే...

కలలోన నే కూడగట్టిన స్నేహ భావం..

ఓ వెల్లువై ఈ ఉదయమై నను పలకరించే... 

దీప







వెలుగును ఒక రూమపుగా చేసి...

కాంతిని నీ పేరుగా మార్చి...

విద్యను నీ మేధస్సులో దాచి..

నిధానమునే నీ నడకగా చేసి...

చిరనువ్వును నీ దినచర్యగా...

స్నేహమే నీ బలముగా...

మెత్తని మనసును స్త్రీగా నా స్నేహముగా మలచెను ఆ దేవుడు...



తిరిగి రాదా ఆ స్నేహము ?







తన స్పర్శ వదిలిపోయిన చేతులు తనకై ప్రార్దిస్తూ...

మనసు లో మిగిలిన జ్ఞాపకాలే నాకు ప్రాణము పోస్తూ..

మిగిలిన ఈ జీవితము తను లేకనే నడపాలనే ఉద్దేశమే నాలో స్ప్రుహకోల్పోయెను....



మనసులో ప్రేమ ఉన్నా కన్నీటితో వదిలేయగలను...

ఆ ప్రేమ ఎంత దూరంగా వున్నా విరహముతో దిగులును మెప్పించగలను...

వదిలిన ఈ స్నేహాన్ని కొన్ని రోజుల జన్మల బంధాన్ని ఎలా మరువగలను ఏమి చెప్పి నను నేను ఆదరించగలను....





ఎనెన్నో పరిచయాలు నన్ను అలుకున్నా..

బంధాల నడుమ పువ్వై పరిమళించిన స్నేహము..

నా తీగ వదిలి పోతుంటే ఆపతరమా దానిని నిలుపుట సాధ్యమా...





ఇంత ఓదార్పుకు  అర్థమే ఉంటే తన స్నేహమే దిగిరాని...

లేకున్నా నా ప్రాణము నిస్సారమై మిగిలిపోని ఓ మంచి స్నేహము లేని ఓ కుంటి జీవితముగా మిగిలిపోని. ..

వదిలిన అందము...





అందమనే తుమ్మెద వదిలిన పువ్వా నీవు....

కలలే ఆగిపోయిన నిదురలో ఉన్న  చీకటివా నీవు....

మేఘము తెర తొలిగే లోపే రేయి బారిన పడ్డ వెలుగు కిరనమా నీవు...

ఎవరు నీవు వీడిన అందమా లేక విధి వంచితమా....





తూరుపు నీడలు వదిలి పడమర వాలిన సూర్యాకాంతివా...

నేలను తాకి తాకి అలసి ఆగిపోయిన జలపాతానివా ...

రెమ్మల చాటున వాడిన చిగురు తొడుగువా...

ఎవరు నీవు వీడిన అందమా లేక సువాసన లేని సుగంధమా...





నవ్వులు రాలిన మనసు కార్చే కాన్నీటివా....

కురులే వద్ధనిన కమిలిపోయిన పూల రేకువా...

తిన్నెలో నూనె అందక వెలిగే దీపానివా...

ఎవరు నీవు వీడిన అందమా లేక ముత్యము కాని నీటి బొట్టువా...





ఎవరైనా సరే అందము కొంతవరకే ప్రాణము ఉనంతవరకే...

దిగులు చెందక నవ్వులు పండించి లేని అందముకు నీవే ఆదర్శమవ్వు...

నిను పొగడని  ప్రతి మాటకు అందనంత అందమై మిగిలిపో...

మార్పు





ఎన్ని వదిలినా ప్రాణము వదలకు...

ఎదురుచూస్తున్నా కూడా జీవితాన్ని ఎదురీదు...

కాల గమనము ఎన్నటికి ఆగదు..

మన ఆలోచనలు ఎప్పటికి నిలిచిపోవు...

మారే ఈ నవ యుగంలో మచుక్క మాత్రం ఉన్న ఆత్మీయతతో ఎన్నో సాదించవచ్చు ...

తెలియని ప్రశ్నలను ప్రేమిస్తూ ఓ జవాబుగా ఉంటే అంత నీ సొంతమౌతుంది ....

మార్పే నీ వసమౌతుంది........

నిరాశ





పొంగిన ఆశల అలజడి నా తీరము తాకి...

మరలిపోయెను నిరాశ వదిలి( నిరాశను నాకు వదిలి అని అర్థం)...

ప్రేమ మననుసు చేరి బాధను తరిమి...

నను మార్చి వెళ్ళిపోయెను నిరాశ వదలి...

బదులే లేని ప్రశ్నకు అన్వేషించి...

ఆలోచనే ప్రశ్నగా మారింది నిరాశ వదిలి...

కనులు చూసిన కవ్వింతల కలలు...

వెలుగు చూసే సరికి దాగిపోయే నిరాశ వదిలి...

నను వదలక నా స్నేహమై... పిలువని ఓ బంధమై... నిరాశే తోడుంటే ఆశకు తావులేదు బాధకు చోటులేదు..........

అబదంగానే మిగిలిపోదాం...





చినుకు తొడుగు కాలాన ఎండలు మండిన....

అది ప్రకృతి చెప్పే అబధమా ??

ముద్ద తినకుంటే బూచి అంటూ

బెదిరించే అమ్మ మాట అబధమా??

దిగులు చూపక పైకి నవ్వుతూ

అందరిని నవ్వించే మనసు అబధమా ??

నిదురలోని కలలు చెప్పే

కల్లలైన కధలు అబధమా??

మతము ఉన్న కులము ఉన్న

ఏమిలేదు మానవత్వమే గొప్ప అని చెప్పే హితవు అబద్ధమా ??

చావును చూసే కనులలోను

జీవముందని చెప్పే వైద్యుని మాట అబధమా ??

తను మోసే బిడ్డ తనతో మాటలాడుతూ

పలుకరిస్తోందనే అమ్మ మాటలు అబధమా ??

కనిపించని దేవిను రూపం కోసం

చేసే పూజలు అబద్ధమా ??

ఇవన్ని అబదాలు అయిన మంచికోసము ఒక అబదంగానే మిగిలిపోదాం...

కాని చెడును తరమడానికి మాత్రం నిజము చెబుదాం....

మహిమ గల కూరగాయలు

నిన్న నేను కూరగాయల బజారుకు వెళ్ళాను . అక్కడ ఓ అవ్వ ఆకు కూరలు అమ్ముతుంటుంది అది కాకా ఎపుడు నారాయణ నారాయణ .. మిమల్ని చల్లగా చూస్తాడు అని చెప్తూ అముతుంటుంది .. ఆ అవ్వ అంటే నాకు చాల ఇష్టం.. ఎపుడు వెళ్ళిన అవ్వ దేగరే కొంటాను.. నిన్న కొని తిరిగి వొస్తుంటే అటువైపు ఇంకో అవ్వ ఏదో గొణుగుతూ కనిపించింది... ఏంటి అవ్వ ? అని అడిగితే నేను రూపై కి ఎంత ఇస్టనో చూడు ఆమె కోదిగానే ఇస్తుంది నా దెగ్గర ఎవరైనా కొంటారా అని చెప్పింది సరే ఇవ్వు నేను కొంటాను అని చెప్పాను కాని పో పో నేను ఇవ్వను అని చెప్పింది.. నాకు తెలిసినదేంటంటే మొదటి అవ్వ దెగ్గర రూపాయి విలువ కాదు తెలిసేది ఆమె చెప్పే మంత్రము మంచి మాటలకే కొంటున్నారని... ఆ క్రమంలో రాసినదే ఇది...





రూపాయి  అమ్మెడి కూరగాయతో నామము చేర్చిన వంద పలకదా...

గాయాలు కలిగే ఈ మనసుకు మందుగా మారి హాయి నివ్వదా...

వంకాయ మదిలో వగరుగాను...

బీరకాయలో పీచు గాను...

ఉల్లిపాయలో చలువ తల్లి గాను...

గుమ్మడి పొట్టలో పిండిగాను...

మీ రుచులు తీర్చునే ఆ హరి నారాయణ... రండి బాబు కొనండి కొనండి.....

పొట్లకాయ పాము చుట్తమట శివుడి మెడలో నిద్రపోవునట...

పచ్చి మిరప పరసురాముడట కన్నీరు తెప్పించినా మంచిదట...

మొద్దుగా ఉన్నా బంగాళదుంప భూదేవికి ముద్దు భిడ్డడట....

ఎన్నో ఎన్నో మహిమ గల కూరగాయలు మన మంచి కోరే మంచి మనసులు...

కాకర చాలా చేదండి కాని కడుపుకు కాపలా కయునండి...

బెండకాయ బ్రమ్హండి మేధాసక్తిని పెంచునండి...

కీరకాయ చలవండి అమ్మ చేతిలో పండెనండి..

దొరద కంద దొరధైనా రామునిలా దుంపల రాజ్యం ఏలేనండి...

మహా మహులు మెచ్చిన ఆకూరలండి రుచులకేమి కోరతలేదండి...

రండి బాబులు కొనండి ఈ కూరగాయలు కొనండి.....

మంచిని కోరే ప్రకృతి రూపాలు మంచిగా చేస్తే అందరి ప్రసంసలు....

ఎక్కడ





మనమున్నది ఎక్కడ !!...

ఆలోచన ఎక్కడ !!...

వెలుగు పుట్టుక ఎక్కడ!!...

దాని లాభం ఎక్కడ!!...

గాలి జీవం ఎక్కడ!!...

దాని పయనం ఎక్కడ!!...

మనసన్నది ఎక్కడ!!...

దాని ప్రేమ ఎక్కడ!!..



అర్థం:



ఒకటి ఒక చోట ఉంటే దాని ఫలితం ఇంకో చోట ఉన్నప్పుడు. మనమెక్కడున్నా మన ఆలోచనలను ప్రభావితం చేస్తే అవి చిరంజీవులై అంతట ప్రబలి అందరిని చేరగలవు.

కూతరన్న పేరు నిలబెట్టవే.





ఏ పేరు పెట్టనమ్మ మురిపాల బొమ్మకు..

నీకు ఎన్ని పేర్లు ఉన్నవో చెబుత వినరమ్మ..

ప్రనమన్నది మొదటి పేరు..

ప్రేమన్నది రెండవ పేరు...

వేలుగాన్నది మూడవ పేరు..

వరమన్నది నాల్గవ పేరు..

ఆశన్నది ఐదవ పేరు..

కులదీపం అన్నది ఆరవ పేరు..

మురిపెం అన్నది ఏడవ పేరు..

అమ్మ పెట్టునే ఎనిమిదవ పేరు...

నాన్న పెట్టునే తోమిధవ పేరు..

అందరు పెట్టునే పదవ పేరు..

పది మాసాలకు పది పేర్లు వుండగా కొత్త పెరెందుకే..

ఎన్ని పేర్లు ఉన్నా కూతరన్న పేరు నిలబెట్టవే... 





గొప్ప స్నేహం





స్నేహము చూపే మనసుకన్నా ...

ఆ స్నేహము తెలిపే మాటే గొప్పది ...

మైత్రిని గెలిచే మాటకన్న...

దానిని నిలపగలిగే ఆలోచన గొప్పది ...

తమవారంటు పలకరించే సమాజంలోన...

నేను తనవాడంటూ చెప్పగలిగే స్నేహ బలమే గొప్పది...

ఎంత కన్నీరు కార్చినా..

దానిని మోసే స్నేహ రూపమే గొప్పది..



 

దాగని ప్రేమ





పొద్దు చూడక గడపదు ఏ సూర్యకాంతి ..

నిన్ను చూడక వెలగదు ఈ ప్రేమ జ్యోతి ...

నీట మునిగిన గాలి దాగునా ఎప్పటికి?.

నిన్ను చూసిన ప్రేమ పొంగదా పైపైకి.. 

విలువెంత ?





దాచిన భావాలకు విలువెంత ?

దరిచేరినా దాగిన చెలి అందలంత...

అర్థం కాని ఆవేశానికి విలువెంత ?

తోటి వాడు చూసి నవ్వుకునేంత ...

పాడలేని రాగాలకు విలువెంత ?

వాటిని వినడానికే పరిమిత మయ్యే చెవులంత ...

ప్రేమను పదాలతో భందిస్తే దాని విలువెంత ?

అర్థాన్ని వెతికే లోపే ప్రేమను వదులుకునేంత ...

దాచినదేదైనా వ్యర్ధమే ...భావము తెరచిన దానికి విలువ అనంతమే ..

జైహింద్





భరతమాత ఉనికి తెలిపే సబ్ధమే జైహింద్...

ప్రతివాని గుండెలో నిత్య చప్పుడై పాడాలి జైహింద్..

పరవాడు కూడా మన భక్తి చూసి పలకాలి జైహింద్..

ఏ శక్తికి అందని ఆపలేని వేగమే జైహింద్...

ఘనత తెచ్చిన చరిత్ర ఉన్న భవిష్యత్తు జైహింద్...

కస్టాలు నేర్చి రక్తాన్ని ఒడ్చిన స్వాతంత్రమే జైహింద్...

శాంతము సౌక్యము స్నేహమే ఈ జైహింద్...

మన నడతలోను మాటలోనూ కలవాలి జైహింద్..

అందరం కలిసి పాడుదాం జైహింద్ జైహింద్ జైహింద్....

కవితా భావము







చేయి మలచిన చక్కని చిత్రాలు...

గొంతు తెరచిన తియ్యటి రాగాలు..

పదములు పరవశించిన అది నాట్యము...

మనసు కధలివొచ్చేది కవితా భావము...

అది హద్దులు లేని పద జాలము..

స్నేహం మరియు ప్రేమ







స్నేహం తో కుదరదు చిలిపి తలపులు..

మనసు కోరే వయస్సు రంగులు..

ప్రేమతో కుదరదు నిస్వార్ధపు రాగాలు..

ఎపుడూ మనకంటూ ఉండే గుండె చప్పుడు..

ప్రేమలో లేనిది స్నేహం లో చూసుకో..

స్నేహం లో లేనిది ప్రేమతో సాదించుకో..

ఆడదాని మనసు





అన్నింటినీ దాచేలా ఒకటుండాలి..

దానిని దాచేలా ఓ చోటుండాలి..

దానికి చేరలేని దారుండాలి..

ఆ దారికి తెలియని గుర్తుండాలి..

ఆ గుర్తును ఆడదాని మనసునుంచాలి..











.

కల్లు





కల్లుకున్న కధను చెబుతా..

మత్తులోని గమత్తు చెబుత..

మానవత్వం మంటగలసిన..

మత్తునిచ్చే కల్లు మేలుర..



మన బాధ ఓర్వలేక..

ఓ చెట్టు కార్చే కన్నీరే ఈ కల్లుర..

తోటివారే చూడని ఈ లోకం లో..

ఆ చెట్టుకెందుకో అంత దిగులుర..



నీటి కొరత వుండచ్చేమోగాని గాని..

ఈ కల్లుకి కోరతేముంది..

చెట్టుకొక కుండ కడితే..

కుండ నిండా ఆనంధమేగా..



కూలి నాలి చేసేటోళకి..

రాజు మోసగించిన రైతన్నలకి..

దొరికే అమృతమే ఈ కల్లుర..

కన్నీటినంత తుడిచే ఇంకో నీటి బొట్టుర...



మందు బాబులు మోసపోండి..

ఈ కల్లు తాగి ఇంకా మోసపోండి..

హాయిగా లేవకుండానే నిద్రపోండి..

కళ్ళు తెరవకుండా కల్లుతోనే బ్రతకండి...









.

ధైర్యం ఇచ్చే స్నేహం





ఆశల వెంట పోతే..    

దు:ఖాన్ని  ఇచ్చింది..

ప్రేమ వెంట పోతే..

విరహాన్ని ఇచ్చింది ..

వయసు వెంట పోతే..

మోసం చేసింది..

స్నేహం వెంట పోతే..

అన్నింటిని తట్టుకునే..

ధైర్యాన్ని ఇచ్చింది ...

గెలవడానికి ఓ అవకాశాన్ని ఇచ్చింది ...


.

మరచిపోయి..





అది లేదని ఇది లేదని ఉన్నది మరిచిపోయి...

కులముందని మతముందని మానవత్వం మరచిపోయి..

ఎటూకాని ఆలోచనతో మన కర్తవ్యం మరచిపోయి..

ఆశలన్నీ పోగు చేసి ఆనందాన్ని మరచిపోయి..

మన ఉనికినే మనము మరచిపోతునాము.


.

మాత్రుత్వం





తల్లిగలేని మనస్సులెన్నో..

అమ్మను మించిన మాత్రుత్వంతో...

సమాజాన్నే తన ఆసరాగా...

నిసహాయులను తన బిడ్డలుగా..

సహాయమే తమ జీవన సూత్రముగా..

ప్రేమనే తమ వైద్య విదానముగా..

వుద్యమించు వారికీ నా మొదటి ప్రణామాలు..



చెలి పాదాలు





నీ పాదాలకు రక్ష లేకున్నా..

నా చేతులనే రక్షగా చేస్తనే..

అడుగు మీద అడుగు వేసి..

నా మనసును చేరవే..

నా చేతులు ముల్లై గుచుకుంటే..

నీ పాదాలకు పూలదారి వేస్తానే..

పూలు వాడుతాయి అనుకుంటే..

మబ్బు దారిపై విహరింప జేస్తనే..

ఎన్ని చేసిన గాలికే కందిపోయే..

నేల తాకితే వాడిపోయే..

నీ పాదాలను...

దేనితో మోయను ఎలా మోయను.. 



జోలాలి పాపాయి





జోలాలి పాపాయి..

జోకొట్టు ఈ గాలి..

జగమంతా మూగబోయి..

నువ్ నిడురోవాలి..

నిదురలోన ఈ లాలి..

నీ చెవును చేరాలి..

అల్లరి చేయు నీ చూపులు..

చక్కటి కలలను చూడాలి..

కందిపోవు నీ బుగ్గలు..

కాస్త సేద తీరాలి..

నీ ముసి నవ్వులు నన్ను చేరాలి..

జోలాలి జోలాలి జోలాలి జోజో...

వెన్నంటిన అందాలు








కనీ కనిపించక..

చూపు నాపై వాలక..

దోబూచులాడువెందుకే ..

ఓ చిన్నదానా..

నీ వెన్నంటిన అందాలు..

నన్ను తాకుచున్నవి..

నా చూపును మళ్ళిస్తున్నవి..

ఒక్కసారి ఇటు చూడు..

పరవసిస్తా ఒక మారు..

ఏడుకొండలవాడి వైభోగం





వైభోగమే నీది వైభోగమే..

నిత్య కళ్యాణ వైభోగమే..

ఎనలేని భోగాల వైభోగమే..

ఏడుకొండలవాడి వైభోగమే..

రథమెక్కి మా స్వామీ తరలి వస్తుంటేను

చూచే కనులకు వైభోగమే..

పసిదికంతి వెదజల్లు ఆ చిట్టి బుగ్గలకు

దిష్టి చుక్కైనా వైభోగమే..

కోరిన వరములిచ్చేటి ఆ కొండల రాయునికి

తిరుమాడ వీధులలో వైభోగమే ....

రాముడెట్లుండునో





నీ నామమునకు వున్నపాటి మహిమ కూడా నీకు

లేకపోయెర రామ..

రామ రామ అనుదురు కాని నిన్నెవరు చూసినారయ నీ

రూపమును ఎవరు వేడినారయ..

విల్లంభులు ధరించి నీ సపరివారముతో వుండిన నిన్ను

గుర్తిన్చురు కాని నేవెట్లుండునో ఎవరికి తెలియును...

నీవు నా మొర ఆలకించి దర్శనమిచ్చిన నే చాటి చెబుతాను..

రాముడు ఇట్లుండునని చూడచక్కని వాడని,ఆజాను బాహుడని,కరునామయుడని,నీలమేఘస్యాముడని,

అవతారపురుషుడని......

నారాయణ





వినిపించిన చాలు నీ నామము..

ఎన్ని జన్మల పాపమైనా తొలగిపోవునే..

కలియుగాన కరువాయే నీ నామము...

తెలిసికూడా పలుకరే నీ నామము..

ముక్తి కలుగు మంత్రమే నీ నామము...

మరల మరల రుచి చూడ తగు నామము...

భోగాలకు తెలియదే నీ నామము...

కస్టాలు కల్గినపుడే తారక మంత్రము నీ నామము..

ఇంతకి ఆ నామమే నారాయణ రూపము..

కవితలు పలు రకాలు





ప్రియుడి కవిత ప్రేయాసికై..

ప్రజల కవిత ప్రభుత్వానికై..

రాజకీయుల కవిత పదవికై..

సన్యాసి కవిత మోక్షానికై..

నటుల కవిత తమ పాత్రలకై..

పేదల కవిత పొట్టకూటికై..

మనుజుని కవిత స్వార్ధానికి..

భక్తుల కవిత పుణ్యానికి..

నా కవిత సమాజ స్పృహకై..

తెలుసుకోండి బాగా మసులుకోండి..

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...