మందేరా గొప్ప....
మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా జాతి బేధము అసలే లేదు కులమతాలతో పనియే లేదు ఆడ మగల తేడా లేదు మత్తు దిగిందా ఇక స్వర్గము చూడు నడకలు రాని రోజులు తెలుసా ఇప్పుడు చూసుకో కష్టాలు తెలియని చిన్నతనాన్ని గుర్తుచేసుకో తప్పు కాదిది తప్పే కాదు తప్పుటడుగుల తొలిరోజులు ఒప్పు కాదిది ఒప్పే కాదని ఒప్పుకుంటే మరి తప్పు మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా చూసావా ఆ జెండా గాలికి ఆడట్లేదు మత్తు మంత్రులు ఎగరేసిన మహిమ దానికి కూడా దిగులు కాబోలు దానిని పట్టించుకునే ప్రభుత్వానికి కూడా మందంటే తారక మంత్రము అ మంత్రము చెబుతూ కూటమి వేసి మనకు కావాలి స్వరాజ్యమనరా మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా మందు లేని అ సీసా చూడు మన తలరాతలు చూడు తన దిగులంత మనకిచ్చి మన దిగులును పోగొట్టే త్యాగశీలి మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా అందరిని ఒకలా చూపుతుంది కాని మన దారిని వేరు చేస్తుంది అభిమానం మరీ ఎక్కువైతే మెలుకవ రాని నిదురనిస్తుంది మందేరా గొప్ప, గమ్మతుగా ఉంటుందిరా |
చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో
చిట్టి పొట్టి చీమలో ఎన్ని ఎన్ని యుక్తులో చక చక నడుచుకుంటూ పరిగెడుతూ ఉంటుంది కొండైనా అది చక్కెరైతే నిమిషంలో కరిగిస్తుంది పోట్టిధైనా గేట్టిదే తనకు మూడింతలు మోస్తుంది ఎవ్వరికిందా పని చేయదు స్వాభిమానం కలది పుట్టలు మేడలు కట్టేస్తుంది ఏ అడ్డమైనా ఎక్కేస్తుంది దోచుకోదు ఎప్పుడు కావలసినది దాచుకుంటుంది కష్టమైనా చేసుకుంటూ కాలం గడుపుతుంది క్రమశిక్షణ కలది అది కొలవలేనిది |
Subscribe to:
Posts (Atom)
నమ్మరా
దీపం లేకనే వెలుగు చూసాను అంటే నమ్మరా, తన రూపం చూడకనే తలపులతో జీవిస్తున్నా, గాలి లేకనే శ్వాస తీసుకుంటున్నా అంటే నమ్మరా, తన మాట లేకున్నా పలుక...