జాజికొమ్మ దిగులుపడినా .. విరజాజులే రాలును... పువ్వునెంత చిదిమినా.. సువాసనే ఇచ్చును ... పిండిన తేనె పట్టు ... తీపి తేనెనిచ్చునే ... మనసుపిండిన మరి దిగులే ఎందుకు ? |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
దిగులు
ఇడ్లి
మెత్తనైన పిండి వంటకం , ఆరోగ్యకరమైన రుచి వంటకం , అందరు తినగలిగే , అందరు చేయగలిగే, కరువులోనూ దొరికే, చౌకైన గొప్ప వంటకం , వంటిట్లో ఆడవారికి తోడైన నేస్తం ... |
మట్టి అడుగులు
బ్రతుకు తెరువుకై వేసిన ... అడుగులివే మట్టి అడుగులు.. కష్టానికి గుర్తులివే మట్టి అడుగులు... స్వయం కృషికి ఇవే తార్కాణాలు... వాడిపోని ధైర్యానికి ఇవే పరమపదులు మట్టి అడుగులు.. పేదవానికి సంపదనిచ్చే అడుగులు... బడుగులకు ఆదర్శమైన అడుగులు.. ఎన్నో కట్టడాలకు పునాదులైన ఈ అడుగులు... కాని మట్టిగానే మిగిలిపోతున్న మట్టి అడుగులు ... |
గొప్ప మనుషులు
తెలియదు వారికి కళలున్నవారని ....
తెలియదు వారికి నిజమైన వారని ....
తెలియదు వారికి మనసున్న వారని ....
తెలియదు వారికి వారు మంచి స్నేహితులని ....
తెలియదు వారికి అన్ని తెలిసినవారని ...
తెలియదు వారికి వారు గొప్ప మనుషులని..
ఊహా
| నీ రాకకై నే వేచివున్నా , నీ ప్రేమకై పరితపిస్తున్నా , నీవు నా ఊహావని తెలిసినా , నిన్ను బొమ్మగా చేసి, ప్రేమతో ప్రాణం పోయాలని యోచిస్తునా , నిను నా దానిగా చేసుకోవాలని మళ్ళి కళలు కంటున్నా .......... |
చీకటిలో గోదారి ..
| గోదారమ్మ చీకటాఎనమ్మ ... ఏ దారిన వెళ్తావు ఇంటికి... చీకటి చుక్కలు దారి చూపవమ్మ.. నా మనసును అడుగు దారిని... నీ వంకంత సాకులు నా చెంతన... వాటితో గూటినే కట్టేయన... పావురమై వొచ్చి వాలిపో... నీ గలగలలు సలసలలు నాకిచ్చిపో... నల్లని మబ్బులు కమ్మితేనే ... ఆ జాబిలమ్మకు సమయమందేది.. నీ రాగాలు వింటేనే... నా మనసు తెరచుకునేది .. ఎపటికి తెలుసుకుంటావో.. నన్నెపుడు చేరుతవో.. నా చెంతకు రాకపోతే పోయావు కాని.. నా పాటనే పడవలా మోసుకెళ్ళు .. ఈ రేయంతా తోడుగా వుంటుంది.. నీతో కబుర్లు చెబుతుంది... |
అమాయకుడిని
కొంత నేర్చినా మరికాస్త ఎక్కువ నేర్చినా.. తెలియని ప్రశ్నకు నేను అమాయకుడినే.. ప్రేమ వున్నా ప్రేమంటే తెలిసినా... నన్ను ప్రేమించే మనుస్సుకు నేను అమాయకుడినే... మాట నేర్చినా ఎంత మాట్లాడినా... నా మాట కోసం ఎదురు చూసే స్నేహానికి నేను అమాయకుడినే... |
బలహీనులు
బలము లేదని బలహీనులమని.... భారము వుందని భయముకొని... మన కర్తవ్యాన్నే మరచిన ... ప్రాణము వదిలినట్టే... శ్వాసవున్న ఆ మనసు లేనట్టే.. | |
ఆరంభం..
Subscribe to:
Posts (Atom)
surrender
One can put off the lamp but not the sun, either you have to hide or surrender.. விளக்கை அணைக்கலாம்; ஆனால் சூரியனை அல்ல. அதனால், நீ மறைந்துக...







