నీవు నేను ఒక్కటే





దిగులు నిండిన మనసుతో

ప్రేమకు తావులేని బంధాలతో

నాలుగు గోడల నరకంలో ఎలా ఉన్నావు..



అందమునంతవరకు ఆరాధిస్తారు

అది ఆవిరయ్యేవరకు ఆనందిస్తారు

కన్నీటి కనులు తప్ప కప్పిన సోగాసునే చూస్తారు

ఈ నిజమే నీకు తెలిసినా నిస్ప్రుహే వాడికి వదిలేసి

కాలుతున్న కాగితమౌతు  ఎలా ఉన్నావు...



అమ్మ ప్రేమ లేదు

తండ్రి లాలన లేదు

తోబుట్టువల నీడ లేదు

కట్టినమైన రాక్షసత్వము తప్ప!

ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



మాములుగా మల్లెల సొగసుకు మోసపోవు కదా!

చక్కని జీవితం ఇష్టం లేక కాదు కదా!

నిలువ నీడ లేకనా నీవారి కోసమా!

నీకోసమైనా సరే ఎలా వున్నావు నీవెలా ఉన్నావు..



నీకెంత ధైర్యం ఇచ్చినా

సాయం చేసే చేతులు నాకు లేవు

నేను నీలా కాకున్నా సమాజంతో కట్టబడి ఉన్నాను

నీవు అందానర్పిస్తే నేను స్వేచ్ఛను అర్పిస్తున్నాను

అందుకే నీవు నేను ఒక్కటే...

 
  

No comments:

you are a poem

வரிகளில்லை — எழுத இயலாத ஒன்றாக அது. அழகாக ஒன்று, அன்பாக ஒன்று. பக்கங்களுக்குள் கட்டிவைக்க எந்தப் புத்தகத்துக்கும் இயலாதது. தங்கிப் போகப் பிற...