చూడకలా


చూడకలా ఎన్ని చిక్కుకుంటాయో నీ కనుసన్నల్లో నీకు తెలియదుగా, మేఘం ఆగిపోతే పోనీ కానీ నీ కబురు అందదు నాకు అందుకే నింగివైపు చూడకు, రాతిరి ఆగిపోతే పోనీ కానీ నాకు నీ కలలు అందవు అందుకే చీకటివైపు చూడకు, గాలి ఆగిపోతే పోనీ కానీ నీ పరిమళాల నన్ను చేరవు అందుకే గాలివైపు చూడకు, నన్ను చూడు ఆగిపోతాను నీతో ఉండిపోతాను...

💞

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️