మరో ప్రాణంకై తపించేవాడే మనిషి

భయం ఉంది నేను సామాన్యుడినే,
జాగ్రత్తలు ఎక్కువయ్యాయి నేను పిరికివాడినే,
అమ్మమ్మలు తాతలు చెప్పడానికి ఎవ్వరు లేరు,
కానీ నాకోసం నేను చేసుకుంటున్నాను,
నేను సమర్థుడినే,
పోయేదేముంది ఓపిక లేదు అని అనే రోజులు,
పోయేది ప్రాణం అని తెలిస్తే ఎక్కడ లేని ఓపిక ఇప్పుడు,
డబ్బు ఉంది కాని హంగులు లేవు,
ఒక సబ్బు బిళ్ళ నా వెన్నుతడుతోంది,
అంటరానితనము ఉంది కానీ కులాలను చూడటం లేదు,
దాణం చేసేవాడే దేవుడు,
వైద్యం రాని వైద్యులు ఇక లేరు,
నిజమైన వైద్యులు ప్రాణాలు ఇస్తున్నారు,
చేదు పసుపు అమృతం,
పుల్లని నిమ్మకాయ వజ్ర కవచం,
కూరగాయలే రక్షణ వలయం,
గడప దాటకున్నా మెరుగైన జీవితం,
నవీణతకు వీడుకోలు ఉత్తరం,
ఎవరికి పని లేకున్నా నాగలికి పని ఇచ్చారు,
కర్మాగారాలు మూత పడినా,
రైతు కర్మకు సెలవు లేదు,
ఎండలో ఏదో ఉందని అందరూ తెలుసుకున్న తరుణం,
ఏసీలు నడవ కూడదని ఆదేశాలు,
అవసరం మించి మించకూడదు ఏది,
మితం ఏ సమ్మతం,
ప్రాణం కంటే ఏది విలువైనది కాదు,
చిన్నదంటూ పెద్దదంటూ ఏది లేదు,
చిన్న చూపు వద్దు,
పొట్టకూటికై పని చేసేవాడే మన పొట్ట నింపుతున్నాడు,
చదువుకున్నవాడు కాలక్షేపం చేస్తుంటే,
నిజమైన పౌరులు సేవలందిస్తున్నారు,
మన వంటలే మనకు గొప్ప,
అదీ ఒక సాధనే అనట్టు బడాయిలు,
ఎగతాళి చెయ్యడం లేదు,
కానీ అసలైన బాధ్యతను మరువవద్దు,
పౌరుడిగా ఏమి చేసావు గుర్తు తెచ్చుకో,
ఇంట్లో ఉండటం బాధ్యత కాదు నీ ప్రాణానికి భరోసా అంతే,
అంతకు మించి ఏమి చేసావు?
ప్రశ్నించుకో స్వీయ ప్రక్షాళన చేసుకో,
సాటి మనిషికై స్పందించు,
అందరిలో ప్రాణం ఉంటుంది కానీ మరో ప్రాణంకై తపించేవాడే మనిషి,
నువ్వు మనిషివేనా?
ఈ సవాలును గెలవగలవా?
నిరూపించుకో నిన్ను నువ్వు,
సాటివాడికై పలుకుతానని చేయందిస్తానని,
నిరూపించుకో నిన్ను నువ్వు,...

No comments:

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...