అవుతున్నా నేనే ఓ చకోరం.
అ చిత్రాన్ని బహుకరించిన సుభ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ... :)
దాహం తీర్చే మేఘం... తనువును పులకరింప జేసె మేఘం.... మట్టిలోని ప్రాణాన్ని చిగురింపజేసే మేఘం.... జల్లులుగా మారి చిగురాకులపై ఊయలలూగే మేఘం. అలలలో కలగా కలిసిపొయే మేఘం.. రతనాల తోటలో ముత్యమై మెరిసే మేఘం... అర విరిసిన కుసుమాలపై ముద్దులు కురిపించే మేఘం... అలాంటి ఆ మేఘం కోసం అవుతున్నా నేనే ఓ చకోరం... |
అలసట తెలియని మహా యోధులు..
జుట్టు తెల్లబారినా తెలియదు ఒళ్ళు నల్లబారినా తెలియదు కష్ట మొక్కటే తెలుసు కార్మికులకు ఎన్ని భవనాలు కట్టినా మన కలలను వారు నిజాము చేసినా పేదవారే కాని ధనవంతులు కారు మన నాలుకకు రుచులు వారిచ్చినవే మన మానానికి బట్టలు వారిచ్చినవే అయినా రుచుల సౌకర్యాలు తెలియని వారు మన రాచమార్గము వారి అడుగుల పుణ్యమే పాదరక్షలు వారి చేతుల చలవే అయినా ముళ్ళభాటపైనే వారి అడుగులు వేకువతో మొదలౌతారు చీకటితో నిదురిస్తారు అలసట తెలియని మహా యోధులు వారినే నమ్ముకుంటూ హాయిగా జీవిస్తారు |
Excuse Me
while checking the options in my blogger settings by mistake the comments to some of the postings were deleted. Excuse me for this. I miss your great comments :(
గాజులోయమ్మ చిలిపి నేస్తాలు
గాజుల వాకిలి తెరవంగానే రమణుల రాకలు మొదలాయే రాసులు కాసులు ఉండంగ కూడా చేతికి గాజులే మురిపెములాయే బావను సక్కంగా ఉంచడానికి గేట్టినైన ఈ మట్టి గాజులు అమ్మానాన్నల ప్రేమను చూపే గల గల గల పట్టీల గాజులు ఇంటిల్లి పాది అందాలు చూపే మెరిసిపోయే ముత్యాల గాజులు గాజులోయమ్మ నవ్వేటి గాజులు అందాల చేతికి అనువైన గాజులు గాజులోయమ్మ చిలిపి నేస్తాలు మెత్తాని చేతికి చేమంతి గాజులు.... |
నాకోసమే అ కవ్వింతలని....
చక్కనోడు చందురోడు పున్నమై వచ్చాడు చల్లని మేఘాలనల్లి నా చెలిని దాచాడు తారలలో ఉందేమో చూపులను పంపిస్తే వెన్నలను చూపించి నా కనులను దోచాడు మభునై పయనిస్తూ విను వీధులు వెతుకుంటే చల్లని గాలినే పంపి నన్ను చినుకులా మార్చాడు నా ప్రయత్నమంతా మానుకొని అలా చూస్తున్దిపోతుంటే తెలిసింది ఆ జాబిలే నా చెలి అని నాకోసమే అ కవ్వింతలని.... |
తానే దైవమై దెయ్యమును పెట్టె .
మానవత్వము పెట్టి బేధములు పెట్టి ప్రాణము పెట్టి దానికి విషము పెట్టి బలము పెట్టి బలహీనతను పెట్టి తానే దైవమై దెయ్యమును పెట్టె .. |
హాజరు పట్టీలు
మనుషులుండరు కాని వారి వరుసలు వుంటాయి తప్పు చేయకున్నా గడులలో బందీలౌతారు ఎప్పటికి పారిపోలేరు కాని అప్పుడప్పుడు మాయమౌతుంటారు పట్టీలలో కాలక్షేపం చేస్తుంటారు అ పట్టీలే హాజరు పట్టీలు |
Subscribe to:
Posts (Atom)
సంద్రాన్ని తాకే మొదటి చుక్క
సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...