చిల్లి గవ్వ

చిల్లి గవ్వ లేకుంటే చలామని కాలేవు...
చినిగిన బట్ట వేసుకున్నా డబ్బు ఉంటే ఆదర్శం ఔతావు...
ఎదిగే కొద్ది ఒదగాలి...
ఎదగకుండా ఒదిగినా దేనికి కొరగావు...

మెరుపులా కాదు మెరిసే నక్షత్రం లా

అప్పుడప్పుడు కనువిందు చేసే హరివిల్లు కూడా చినుకు ఆగేవరకు ఆగుతుంది, అప్పుడప్పుడు వచ్చే చినుకు కూడా మేఘం కరిగేవరకు కురుస్తూవుంటుంది, కానీ ఇప్పుడు తోడుండే నీ స్నేహం కనిపించదేమి వినిపించదేమి? ఎంత మాత్రం మనసులో ఉన్నా నిసబ్దంగా ఉంటే ఎలా? నీ పలకరింపు నాకు తొలకరి, నీ కనుసైగే నాకు హరివిల్లు, ఉండలేకున్నా వచ్చి పోతుండు, మెరుపులా కాదు మెరిసే నక్షత్రం లా కొంత సేపు ఉండి పోతుండు....

ధైర్యం చెయ్యి ఓ మనసా నీ మనసును వెళ్లబుచ్చుకో

ముసురుకున్న చీకటిలో కంటి పాపను ఎవరు చూస్తారులే,
మసుగు వేసిన మనసు ఎవరికి అంతుచిక్కదులే, ధైర్యం చెయ్యి ఓ మనసా నీ మనసును వెళ్లబుచ్చుకో..... 

నా తీగను తెంచుకుని ఎగరాలని చూస్తున్నా

నువ్వు తారకవు దూరంగా ఉంటూ తళుకుమంటుంటావు...
అందలేనే నిన్ను నేనొక గాలిపట్టాన్ని...
వెలుగులో మట్టుకే ఎగురుతుంటాను...
చీకటి వరకు ఉండలేను...
చిన్న గాలిని తాలలేను...
చినిగిపోయే మనసు నాది...
నేల వాలే రాత నాది...
నువు కనిపిస్తావని చూస్తున్నా...
నా తీగను తెంచుకుని ఎగరాలని చూస్తున్నా...

ఏకాంతం ఒంటరితనం

ఏకాంతానికి ఒంటరితనానికి ఒక్కటే తేడా అది తోడు....,
మనకు మనం తోడుంటే ఏకాంతం....,
లేని వారి ఆలోచన తొడుంటే ఒంటరితనం...

ఇప్పుడు కలిసావని కాదు

ఇప్పుడు కలిసావని కాదు
ఎప్పుడో ఎందుకు కలవలేదని అనిపిస్తూ ఉంటుంది.,
కలిసిన ఆ క్షణం ఏమైందో తెలియదు గాని
కలవకపోతే ఏమైపోయేదో అని అనిపిస్తూ ఉంటుంది.,
కలిసిన తర్వాత కలవో కల్లవో తెలియలేదు గాని
నిన్ను కలవరించని క్షణం ఏదైనా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది.,
కలుసుకున్న ప్రతీసారీ కలవరపాటో,ఖంగారో తెలియలేదుగానీ
తరలిపోకు కాలమా అని అర్ధించిన
వేడుకోలులెన్నో అని అనిపిస్తూ ఉంటుంది.,
కలుసుకోవాలని వేచిఉన్న సమయంలో 
గడిచిన యుగాలెన్నో తెలియలేదుగానీ
కనుమరుగైపోతున్న నీ రూపం 
నా కళ్ళలో నీరై పారుతుంటే
ఆ వేదన నా వల్ల కాదనిపిస్తుంటుంది.,
ఈ కలయిక 'కల 'కాలమో ఏమో తెలియదుగానీ
ఈ మనసిక నీవై నీ వైపే సాగుతోంది మరి..!!

గొప్పతనం

మురళిని పలికించే వాడికన్నా దానిని చేసినవాడి నేర్పే గొప్పది,
వెదురులో మౌనం కాదు రాగముందని తెలుసుకున్న వాడి మనసే మధురమైనది..

అదే పువ్వు అదే నవ్వు

వసంతానికి ఒక కొత్త పువ్వు పరిచయం అయితే, 
ఏమిటా పువ్వు అనుకున్నాను, 
చిరు మొగ్గగా ఉన్నప్పటిది,
మరో వసంతానికి పువ్వులా విచ్చుకుంది, 
కానీ అదే పువ్వు అదే నవ్వు అని తెలిసింది...

పంచెను తన ప్రేమను

రవి కిరణమై భువిలో ప్రాణం పోసుకొని చిగురించిన ఒక తీగ..
మదినంతా అల్లుకొని పంచెను తన ప్రేమను..

మమకారానికి మాధుర్యానికి ఎంత తేడా

మమకారానికి మాధుర్యానికి తేడా కన్న పేగుకు ఎంచుకునే తాళికి ఉన్నంత దూరం...
ఏది దూరమైనా మనసు ఒప్పుకోదు ఎంత కష్టమైనా పోరాటం ఆగిపోదు...
ఏది ముఖ్యమో తెలుసుకోవడం కష్టం కానీ రెండు సాధించడం సాధ్యమే...
ఇరువైపులా ప్రేమకు లొంగిపోతే విజయం తధ్యమే...
ఇప్పుడు ముద్దాయివే కానీ తీర్పు తల్లిది కదా నీకు శిక్ష పడదు...
చేరే తీరం నీ చెలినే కదా నిన్ను కాదనదు...
ధైర్యం గా కాదు ప్రేమతో పోరాడు... 
కోపంగా కాదు క్షమాపణతో మొదలుపెట్టు...

తీరపు మనసును గాయపరిచిన కెరటం

ఎందుకో లేవనంది కెరటం,
తీరానికి మాట ఇచ్చి నింగి అంచులోనే ఆగిపోయిన కెరటం,
మనసులో తడి చేర్చుకుంటూ ఎదురుచూసే మట్టిని తాకలేక,
దాని కనులను తడిచేసిన కెరటం,
ఎండ వేడికి ఆవిరై తీరాన్ని తాకుతానంది,
కానీ మబ్బు నీడకు అక్కడే ఉండిపోయిన కెరటం,
సుదూరాలకు చేరుకొని దారి మరచిన కెరటం,
తీరపు మనసును గాయపరిచిన కెరటం...

అందమైన ఆయుధం

నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...