ఇప్పుడు కలిసావని కాదు

ఇప్పుడు కలిసావని కాదు
ఎప్పుడో ఎందుకు కలవలేదని అనిపిస్తూ ఉంటుంది.,
కలిసిన ఆ క్షణం ఏమైందో తెలియదు గాని
కలవకపోతే ఏమైపోయేదో అని అనిపిస్తూ ఉంటుంది.,
కలిసిన తర్వాత కలవో కల్లవో తెలియలేదు గాని
నిన్ను కలవరించని క్షణం ఏదైనా ఉందా అని అనిపిస్తూ ఉంటుంది.,
కలుసుకున్న ప్రతీసారీ కలవరపాటో,ఖంగారో తెలియలేదుగానీ
తరలిపోకు కాలమా అని అర్ధించిన
వేడుకోలులెన్నో అని అనిపిస్తూ ఉంటుంది.,
కలుసుకోవాలని వేచిఉన్న సమయంలో 
గడిచిన యుగాలెన్నో తెలియలేదుగానీ
కనుమరుగైపోతున్న నీ రూపం 
నా కళ్ళలో నీరై పారుతుంటే
ఆ వేదన నా వల్ల కాదనిపిస్తుంటుంది.,
ఈ కలయిక 'కల 'కాలమో ఏమో తెలియదుగానీ
ఈ మనసిక నీవై నీ వైపే సాగుతోంది మరి..!!

No comments:

you are a poem

வரிகளில்லை — எழுத இயலாத ஒன்றாக அது. அழகாக ஒன்று, அன்பாக ஒன்று. பக்கங்களுக்குள் கட்டிவைக்க எந்தப் புத்தகத்துக்கும் இயலாதது. தங்கிப் போகப் பிற...