ఎడ తెరిపి లేని వర్షం కదా నీ సొగసు, చలువ కుండలో సద్ది బువ్వ కదా నీ పలుకు, భాషలో ఉన్న పదాలు చాలునా నిన్ను వర్ణిస్తుంటే, అచ్చుల హల్లుల అమరిక మారదా నిన్ను చూస్తుంటే,వెలుగు బంతులు విసరనా నీ తెలుగు అందాలపై, కవిత కోనేటిలో తడిసిన పడుచు అందాలపై....
🩵
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️