ప్రేమ దూతగా వాలాయి నీ చూపులు


రెక్కలు ఉన్నా ఎగరలేని పక్షులు కదా నీ కనులు, అందుకేనేమో ప్రేమ దూతగా వాలాయి నీ చూపులు...

Your eyes, though winged, cannot fly,
Perhaps that's why your gaze descended as a love messenger...

पंख होते हुए भी न उड़ सकने वाले पक्षी हैं तेरी आंखें, शायद इसीलिए प्यार के दूत बनकर तेरी निगाहें उतरी हैं....

🩵

చిక్కుపడ్డ నా ప్రేమను మరో ప్రేమతో సరిచేయలెను


కలుషితం అయిన నీటిని నీటితో శుభ్రం చేయలేనపుడు, చిక్కుపడ్డ నా ప్రేమను మరో ప్రేమతో సరిచేయలెను, ఉండిపోనివ్వు చిక్కులతో 
ఉండిపోనివ్వు...

JUST AS POLLUTED WATER CAN'T BE PURIFIED WITH MORE WATER, CAN MY TANGLED LOVE BE UNTANGLED WITH ANOTHER LOVE? PERHAPS IT'S BEST TO LET IT BE AND ALLOW IT TO RUN ITS COURSE...

जैसे प्रदूषित पानी को अधिक पानी से शुद्ध नहीं किया जा सकता, क्या मेरा उलझा हुआ प्यार किसी अन्य प्यार से सुलझाया जा सकता है? शायद इसे वहीं रहने देना और इसे अपना कोर्स पूरा करने देना ही बेहतर है...

🩵

ప్రేమ బుడగ


నీటి బుడగకి ఆశలు ఉండటం వ్యర్థమే కదా, నీ ప్రేమకై నా తపన అంతేకదా...

It's useless for a water bubble to have desires, as is my thirst for your love...

एक पानी के बुलबुले के लिए इच्छा रखना बेकार है, ठीक उसी तरह जैसे मेरी आप के प्यार के लिए प्यास है।

🩵

చిన్ని రాధమ్మ నీ చూపులు దాచుకోవమ్మ


రాధతో పోటీ పడకు,
కిట్టయ్యకు కష్టం పెంచకు,
గతమంతా వారి మహిమలు,
ఇప్పుడు వానిని నీతో చూస్తే,
ఆ లీలలన్నీ తారుమారు,
ఓ చిన్ని రాధమ్మ నీ చూపులు దాచుకోవమ్మ....

❤️



ఈ ప్రపంచంలో మృదువైంది



ఈ ప్రపంచంలో మృదువైంది ఏదని ఎవరైనా నన్ను ప్రశ్నించరా అని ఎదురుచూస్తున్నాను, అడిగిన వెంటనే నా సమాధానం సానుభూతి అని చెప్తాను, ముఖ్యంగా నీ సానుభూతి అని చెప్తాను...

I am eager to hear from everyone. If asked what the softest thing someone can find is, I would say empathy—specifically, your empathy...

🩵

నీ ప్రేమ మట్టుకు అంతం లేని చక్రం లాంటిది


ఒకప్పుడు సముద్రమంత ప్రేమలో మునిగాను, కానీ తిరిగి బయటికి వచ్చాను, ప్రేమ లోయలో పడిపోయాను, కానీ తిరుగు దారి తెలుసుకున్నాను, ఎడారంటి ప్రేమలో అడుగేసాను, కానీ చోటు మార్చే మట్టి తిన్నెల నుంచి తప్పించుకున్నాను, నీ ప్రేమ మట్టుకు అంతం లేని చక్రం లాంటిది ఎక్కడ ముగుస్తుందో అక్కడే ప్రారంభిస్తుంది, చిక్కుకుపోయాను, ఉండిపోయాను..

Once I drowned in the ocean of love, but emerged again. Got lost in the valley of love, but found a way. Walked in the desert of love, but survived the shifting sands. But your love is an endless loop - Where it ends, it begins, there is no way out, so I stayed...

मैं प्यार के सागर में डूबा, पर फिर उभरा।
प्यार की घाटी में भटक गया, पर रास्ता खोज निकाला।
प्यार के रेगिस्तान में चला, पर बदलते रेत से बच गया।
लेकिन तेरा प्यार एक अंतहीन चक्र है -
जहां खत्म होता है, वहीं से शुरू होता है, कोई रास्ता नहीं, इसलिए मैं रुका रहा।

🩵

మంచు కప్పిన అగ్నిపర్వతం


మంచు కప్పిన అగ్నిపర్వతమే నాలో రగులుతున్న నీ ప్రేమ, కమ్మే మంచు వేడిని ఆపడానికో లేక ఆర్చడానికో తెలియక తపిస్తున్నా...

Your love within me is like a burning volcano covered in snow. I'm confused about whether the snow is meant to cool it down or extinguish it entirely...

मेरे भीतर जलता हुआ प्रेम, बर्फ से ढके ज्वालामुखी सा है। यह शीतल आवरण मुझे आकर्षित करता है, पर क्या यह आग को बुझा देगा या सिर्फ शांत करेगा, मैं समझ नहीं पा रहा।

🩵

అలల ప్రయాసే నాలో ఉన్న ఆశ


తీరాన్ని ఎంత ముద్దాడినా, తన సొంతం కాదని తెలిసినా, ఆగని అలల ప్రయాసే నాలో ఉన్న ఆశ...

Even knowing that it can never truly possess the shore, the wave tirelessly kisses it. The same hope resides within me...

यद्यपि वह जानता है कि वह उसे कभी अपना नहीं बना सकता, फिर भी वह लहर लगातार उस तट को चूमता रहता है। वही आशा मेरे भीतर भी है...

🩵

నిచ్చెన కట్టానే


నిచ్చెన కట్టానే నీ అందం ఎక్కడ ఆగుతుందో అని తెలియడానికి చూపుల నిచ్చెన కట్టానే, చూస్తూ చూస్తూ జాబిలి వచ్చేసింది, ఇంకా ఎక్కితే తారలు వచ్చాయి, మరింత ముందుకు వెళితే పాలపుంత దాటేసానే, అయినా అంతమెక్కడో తెలియలేదు...

I've built a ladder of glances to see where your beauty ends,
As I climbed higher and higher, the moon appeared,
Then the stars, and soon I passed the Milky Way,
Yet, I still couldn't find the end...

मैंने अपनी मैंने अपनी नज़र की सीढ़ी बनाई, यह जानने के लिए कि आपकी सुंदरता कहाँ समाप्त होती है। देखते देखते चांद आ गया, फिर तारे, और फिर मैं आकाशगंगा पार कर गया, लेकिन अभी भी, अंत कहाँ है यह मुझे नहीं पता।

🩵

ప్రేమ సంద్రంలో చేపని



నీ ప్రేమ సంద్రంలో నన్ను చేపలా జారవిడిచి చేప రెక్కలు కాకుండా పక్షి రెక్కలు ఇచ్చాడు దేవుడు, ఎలా ఈదగలను, అందులో మునిగిన తరువాత ఎలా ఎగరగలను?

God has cast me like a fish into the ocean of your love, yet granted me the wings of a bird, not a fish. How can I survive in this watery expanse? And after succumbing to its depths, how can I ascend?

भगवान ने मुझे आपके प्रेम के सागर में मछली की तरह फेंक दिया है और मुझे मछली के नहीं, बल्कि पक्षी के पंख दिए हैं। मैं इसमें कैसे तैर सकता हूँ? और इसमें डूबने के बाद, मैं कैसे उड़ सकता हूँ?

🩵

అలలెంత పొంగినా జాబిలి తడిసేనా


అలలెంత పొంగినా జాబిలి తడిసేనా, నా ప్రేమెంత పొంగినా నీ మనసు కరిగేనా, తారంటే కర్రకి అందే పండు కాదని, నీ రూపం నా చూపుకు కూడా అందనిదని, ఎంతగా చెప్పుకున్నా నమ్మలేనిది ఈ నిజం, కొత్తగా పుట్టుకొస్తే ఇస్తావా సర్వస్వం...

No matter how high the waves rise, will the moon get wet?
Just as my love swells, will your heart melt?
A star is not a fruit within reach of a stick,
Your beauty is beyond the reach of my sight.
This truth, no matter how often I say, is hard to believe.
If I were born anew, would you give me everything?

कितनी भी ऊँची लहरें उठें, चाँद भीगता क्या?
मेरा प्यार कितना भी बढ़े, तेरा दिल पिघलता क्या?
तारा तो छड़ी से तोड़ा जाने वाला फल नहीं,
तेरी सुंदरता मेरी निगाहों से ओझल है।
यह सच कितनी बार कहूँ, विश्वास नहीं होता।
अगर फिर से पैदा हुआ, तो क्या सब कुछ देगी?

🩵

నమ్మేంతగా లేదు నీ ప్రేమ


నమ్మేంతగా లేదు నీ ప్రేమ, నీ నవ్వు చూసి పొరబడ్డానా, లేక కల కంటున్నానా, నిజములో నీలా ఒకరుంటారని నమ్మలేకున్నా, అందుకే దొరికినా సరే నమ్మేంతగా లేదు నీ ప్రేమ....

मुझे तुम्हारा प्यार सच नहीं लगता
क्या तेरी मुस्कराहट ने मुझे धोखा दिया, या ये सपना है?
सच में तुम जैसे कोई होते हैं, ये मुझ पर विश्वास नहीं होता
इसलिए, मिल भी गया हूं तो भी, तुम्हारा प्यार मुझे इतना सच नहीं लगता..

I can't believe your love is real.
Have I been deceived by your smile?
Or am I simply dreaming?
I can't believe someone like you actually exists.
That's why, even though I've found you, I can't fully believe your love...

🩵

నీ గాలి


గాలి సోకందే మట్టిలో కదలిక రాదు, అంతమాత్రాన అది నిర్జీవి కాదు, నా హృదయాన్ని కదిలించే గాలి నువ్వు, నువ్వు లేకుంటే భావాలు పొంగవు అంతే తప్ప నీ గాలి సోకే వరకు అది ఎదురుచూస్తూ ఉంటుంది...

Sand doesn't move just like that, it needs a gust of wind, right? Still the sand remains alive. You are the only wind that moves my heart, otherwise my heart would also lie like sand, but would not die...

रेत अपने आप नहीं हिलती ना, थोड़ी सी हवा तो चाहिए होती है! फिर भी रेत तो जिंदा ही रहती है। तुम ही हो वो हल्की सी हवा जो मेरे दिल को झुंझलाती है, वरना मेरा दिल भी रेत की तरह पड़ा-पड़ा सूख जाता, मगर मरता नहीं।

🩵

నీ ప్రేమికుడిగా మారిపోయాను


మళ్ళీ మళ్ళీ మేఘాలను నీ పేరుతో పిలిచాను, కానీ అవి నీలా మారలేదు, తారలను నీ ముద్దు పేరుతో పిలుచుకున్నా, కానీ వాటిలో మార్పు లేదు, నీ ఆలోచనలతో నిండిన కళ్ళతో ఆకాశాన్ని చూశాను, ఏ మార్పు లేదు, చివరికి నన్ను నేను నీ ప్రేమికుడిగా అనుకున్నంతటే మారిపోయాను, నీ ప్రేమికుడిగా మారిపోయాను... 

बार-बार मैंने अपने प्यार का नाम बादलों को दिया,
फिर भी वे कभी बदले नहीं।
मैंने चुपके से उनके प्यारे नाम तारों को सुनाए,
पर वे भी वैसे ही रहे।
मैंने आकाश को देखा, उनके ख्यालों से भरा हुआ,
फिर भी वह वही रहा, अपरिवर्तित।
अंत में, मैंने खुद को उनका प्रेमी कहा,
और उस पल, मैं बदल गया।

Time and again, I called the clouds by the name of my love,
Yet they never transformed.
I whispered her nickname to the stars above,
But they remained untouched.
I gazed at the sky, filled with thoughts of her,
Yet it stayed the same, unchanged.
Finally, I named myself her lover,
And in that moment, I transformed...

🩵

నిన్ను తలచుకొని రాసినంతలో అక్షరంపై నీటిబొట్టు


నిన్ను తలచుకొని రాసినంతలో అక్షరంపై నీటిబొట్టు, ఇంతకు రాసింది నీ పేరు మట్టుకే, మేఘం దానికే కరిగిపోయిందా అనుకున్నా, కానీ నా గదికి పైకప్పు ఉండగా మేఘం ఎలా చదివింది అనుకున్నా, కానీ అవి నా కనుల మేఘాలు, చినుకు కాదది నా కన్నీటి బొట్టు...

As I write thinking of you, a drop of water fell on the letter. I thought the cloud had melted away, having only written your name. But then I wondered how the cloud could read it, since my room has a ceiling. Then I realized these were the clouds of my eyes, and the drops were tears from my eyes...

तुम्हारे बारे में सोचते हुए लिख रहा था कि अक्षर पर पानी की एक बूंद गिर पड़ी। मैंने सोचा कि बादल सिर्फ तुम्हारा नाम लिखकर पिघल गया होगा, लेकिन मेरा कमरा तो छत वाला है, तो बादल ने कैसे पढ़ा? फिर समझ आया कि ये मेरी आंखों के बादल हैं और ये बूंदें मेरी आंखों के ही आंसू हैं।

🩵

హృద్రోగం


It never happened to me like that, 
a breaking sound in my heart. 
I thought I fell sick, but there was no pain. 
So I thought it was a dream, 
but my eyes were open. Slowly, 
I started feeling it again and again. 
Then I understood that whenever I talk to you, 
it becomes like that. 
It's not illness but loveliness...

मेरे साथ ऐसा कभी नहीं हुआ,
मेरे दिल में एक टूटने वाली आवाज़,
मुझे लगा कि मैं बीमार पड़ गया हूँ,
लेकिन कोई दर्द नहीं था,
तो मैंने सोचा कि यह एक सपना है,
लेकिन मेरी आँखें खुली थीं,
धीरे-धीरे मुझे बार-बार महसूस होने लगा,
तब मुझे समझ आया कि जब भी मैं तुमसे बात करता हूँ,
ऐसा ही होता जा रहा है,
यह बीमारी नहीं बल्कि प्यार है...

🩵

మేఘమే తడవాలంటే


మేఘాన్ని తడిపే వర్షం కురవాలంటే అది స్వర్గం నుంచి కురవాల్సిందే, ప్రేమ కురిపించే నీ మనసును తడపాలంటే, ఆ హృదయం ప్రేమ స్వరూపం కావాల్సిందే, కావున నా హృదయం చిన్నది అవుతుంది...

For the clouds to get wet in rain, rain has to shower from heaven, to touch your heart that pours love, that heart has to be the embodiment of love and my heart falls short...

🩵

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...