పసుపు పాదాలు


పసుపు పాదాలు, 
పారిజాతాలు,
పాల మేఘాలు నేలపై, 
ముద్దబంతి పరవళ్ళు, 
నిమ్మకూ అందని రంగులు,
తెలుగు గడప అలిగేంత 
సొగసు తాపడాలు,
బంగారమే వెలవెలబోయే 
మెత్తని పసిడి పాదాలు...

💕

ప్రేమను పొందే అర్హత


నేను నిప్పుని ఘనీభవించాలని ప్రయత్నిస్తున్నాను, ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ద్వారా నీ ప్రేమను పొందే అర్హత లభిస్తుందని నా నమ్మకం...

मैं आग को जमाने की कोशिश कर रहा हूँ। मुझे विश्वास है कि कुछ असंभव करने से मुझे आपके प्रेम को संभव बनाने का तरीका सिखने को मिलेगा।

I am trying to freeze fire. I believe that doing something impossible will teach me how to make your love possible..

💕

రాతి అక్షరం కాగితం విచ్ఛిన్నం


రాయితో కాగితంపై వ్రాయడానికి ప్రయత్నించాను. అది కాగితాన్ని ముక్కలు చెక్కలు చేసింది. అవును, నా హృదయం కూడా అలానే ఉంది, నేను అది చెప్పాలనే తపనపదుతున్నది...

I am trying to write on the paper with a stone chalk. It tore the paper into pieces. Yes, that's how my heart feels, and that's what I wanted to write...

पत्थर की खड़िया से कागज पर लिखने की कोशिश कर रहा हूं. इससे कागज के टुकड़े-टुकड़े हो गए। हाँ, ऐसा ही मेरा दिल महसूस करता है, और यही मैं लिखना चाहता था...

💞



మధురంగా ఉండాలని


ఆదేశాలు ఇచ్చాను తేనెటీగకు మబ్బులన్నీ తేనె పట్టుతో కప్పమంటూ, తనపై వాలే ప్రతి చినుకు మధురంగా ఉండాలని మధురంగా ఉండాలని..

I gave instructions to the bees to cover all the clouds with honeycomb, so that every drop that falls on her would be sweet enough...

💞

Too bad canvas


When the canvas is too bad to draw on, then open your eyes; it's the art itself, not just a canvas anymore. Who would draw on art again?

💕

నత్త నడక


నత్త తన శ్లేష్మం సహాయంతో పదునైన కత్తిపై గాయపడకుండా కదలినట్లు, నేను నా ప్రేమ సాయంతో నీ పదునైన మనస్సుపై నడవగలను గాయపడకుండ..

Like the snail can move on a sharp razor with help of it's mucus, I can walk on your heart without getting hurt as I am protected with the layer of love...

💞

కోతి మనసును


ఏ కొమ్మలో ఎంత బలముందో కోతికి తెలుసు, నా కోతి మనసును మోసే బలము నీ ప్రేమలో ఉన్నప్పుడు నాకెందుకు దిగులు...

A monkey knows how much strength is in a branch; why should I worry when the strength that carries my monkey mind is in your love?

💞

కోతి మనసును


ఏ కొమ్మలో ఎంత బలముందో కోతికి తెలుసు, నా కోతి మనసును మోసే బలము నీ ప్రేమలో ఉన్నప్పుడు నాకెందుకు దిగులు...

A monkey knows how much strength is in a branch; why should I worry when the strength that carries my monkey mind is in your love?

💞

ఆనందానికి అవధులు లేకుండా పోయింది


పిడుగుపాటుతో రుతుపవనాలు నీ రూపాన్ని సంతరించుకున్నాయి. మెరుపు నీ చిరునవ్వు అయింది, గాలి నీ మాటలా మారింది, చినుకులు నీ సన్నిధిగా మారాయి, పచ్చికపై తడి మంచు నీ అందం అయ్యింది. నువ్వు నా చుట్టూ ఉంటుంటే నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది..

With the stroke of a thunderbolt, the monsoon took the shape of you. The lightning became your smile, the breeze became your talk, the drizzle became your presence, and the dew dampening the green became your beauty. There are no limits to my joy as I feel you around me...

💞

నిదురని వదిలి కదలిపోతున్నాయి


ప్రతి ఒక్కరు వారి కలలో నువ్వే రావాలని కోరుకుంటుంటే, ఆ కోరిక తీర్చలేక నిరుత్సాహంతో కలలన్నీ వారి నిదురని వదిలి కదలిపోతున్నాయి..

The dreams are moving away from every man's sleep, they are disappointed for not being able to fulfill the desires as all are requesting only you to appear in their dreams...

हर आदमी की नींद से ख़्वाब दूर हो रहे हैं, वो इस बात से मायूस हैं कि वो ख्वाहिशें पूरी नहीं कर पा रहे हैं क्योंकि हर कोई सपने में सिर्फ आपको ही देखना चाहता है।

💞

దూరం అవ్వాలని నా ప్రయత్నం


నిజం కలలకు విరుద్ధంగా ఉంటుందని ఓ నమ్మకం,
అందుకే నీ నుంచి దూరం అవ్వాలని కలలో ఎంతగానో ప్రయత్నిస్తున్నాను...

There is a belief that dreams are the opposite of reality, so I am trying hard to distance myself from you in my dreams...

💞

మరో ప్రేమ


పెరిగిన ప్రేమ దూరం అవ్వడం కంటే మరే బాధ ఎక్కువ కాదు, అదే విరిగిన మనసు మీద రాసిన మరో ప్రేమ కథ మళ్ళీ గాయపరచదు...

No pain is greater than the loss of love; a love story written on the same broken heart will never cause the pain again...

प्यार खोने से बड़ा कोई दर्द नहीं है; टूटे हुए दिल पर लिखी गई प्रेम कहानी फिर कभी दर्द नहीं देगी...


💞

ఆ రంగులతో నిన్ను గీసింది


హరివిల్లు తన రంగులను దానమిచ్చి బొమ్మ గీయమని కవితను కోరుకుంటే, కవితకు భావం కలిగి ఆ రంగులతో నిన్ను గీసింది...

When the rainbow generously donated its colors and requested the poem to draw a doll, the poem felt inspired and drew you using those hues...

❤️

దూరంగా ఉన్నా పుడుతుంది


మనం ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు కష్టాలు పుట్టాయి, అందుకే చేరువగా ఉంటేనే కాదు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా ఏదో ఒకటి పుట్టవచ్చని నేను గ్రహించాను...

the difficulties were born when we are apart from each other, So, I realized not only when two are close, something can be born even when two are far away....

💞

రక్తమా లేక ప్రేమనా


రక్తం నిండిన నా హృదయంలో నిన్ను ఉంచి నీ ప్రేమకు మరక అంటించలేను, అందుకే మరో హృదయం కావాలని దేవుడిని కోరాను, కుదరదంటూ, రక్తమా లేక నీ ప్రేమనా అని షరత్తు పెడితే, నీ ప్రేమనే కావాలని కోరుకున్నాను...

मेरा दिल खून से भरा है, और मैं नहीं चाहता कि ये आपके प्यार को दागदार करे। इसलिए, मैंने भगवान से एक खाली दिल मांगा, लेकिन उन्होंने मेरा दिल खाली कर दिया और कहा, 'या तो खून या तुम, एक को चुनो।' मैंने आपको चुना..

My heart is full of blood, and I don't want it to stain your love. So, I asked God for an empty heart, but He emptied mine and said, 'either blood or you, choose one.' I chose you..

💞

గర్వం లేని అందం


తన కొప్పులో ఎన్ని అందమైన పూలు ఉన్నా కొమ్మకు గర్వం ఉండదు, ఎంతో అందం నిన్ను కప్పినా నువ్వు చాలా సరళంగా ఉంటావు...

कितने भी खूबसूरत फूल हों उसके दामन में, शाख को घमंड नहीं, इतनी खूबसूरती समेटे हुए भी तुम, बहुत सरल हो तुम..

No matter how many beautiful flowers are there in its hem, the branch has no pride, despite having so much beauty, you are very simple...

💞

మూర్ఖత్వం


అగ్నిపర్వతాన్ని ఆర్పాలని అనుకోవడం, నీపై నా ప్రేమను అడ్డుకోవడం, రెండూ మూర్ఖపు ఆలోచనలు...

The idea of extinguishing a volcano and stopping my love for you is foolish...

एक ज्वालामुखी को बुझाने और आपके लिए मेरे प्यार को रोकने का विचार मूर्खता है... 

💞

భూమికి సూర్యకాంతి


అందం భూమి అయితే నువ్వు దానికి సూర్యకాంతివి...

अगर सुंदरता धरती है, तो तुम उसकी धूप हो. 

If beauty is the earth, you are its sunshine...

💞


ఆ మాత్రం వర్ణించగలనని అనుకుంటున్నా


కోట్ల పదాలు రాసినా నీ కనురెప్ప వెంట్రుకవాసి వర్ణనకే సరిపోతుంది. ఓ అందమా! నేను నా జీవిత కాలంలో ఆ మాత్రం వర్ణించగలనని అనుకుంటున్నా...

My dear beauty, millions of words fall short to capture the detail of a single hair on your eyelid! I believe I can achieve such eloquence in my lifetime..

💞

దేవుడు చేసాడా మనిషి చేసాడా


నువ్వు దేవుడు చేసిన అందమా లేక మనిషి చేసిన అందమా? ఏదీ కాదు అని 
నా నమ్మకం. నిన్ను నువ్వు మలుచుకున్న అందానివి, నీకు ఎవ్వరూ సరితూగలేని చందానివి...

क्या तू भगवान के बनाए हुए है या इंसान के? मुझे शक है कि तू दोनों में से नहीं है. तू एक खुद-ब-खुद बना हुआ खूबसूरती है, इसीलिए तेरा कोई सानी नहीं है..

Are you God-made or man-made? I doubt that you are neither. You are a self-made beauty, which is why none can match you..

💞

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...