కలల పోటు


కనురెప్ప వాలిన ప్రతిక్షణం ఆ కొంత చీకటిలో, నా కళ్ళు నీ కలలతో నిండిపోతాయి, అలాంటిది నిద్రపోతే ఎన్నికలలు వస్తాయో చెప్పలేను. నా కళ్ళకి విశ్రాంతి లేదు, నా నిద్రకు కరుణ లేదు, ఇదివరకు నిన్ను ఊహించుకుంటూ చుక్కల కంటే మించిపోయేంతగా ఎన్నో బొమ్మలు గీసాయి, కానీ నువ్వు ఎలా ఉంటావో తెలియదు, ఎందుకంటే నువ్వు నిజానివి, నిన్ను చూసేంతవరకు ఆ నిజం నేను ఊహించలేను కనుగొనులేను..

For each blink, in the brief moment of darkness, I am flooded with hundreds of dreams about you. Now, imagine if I were to sleep, how many more would I experience? My eyes are restless, and my sleep is merciless. So far, they have conjured many images of you, surpassing even the count of stars. Yet, I cannot find the one that truly resembles you, for you are real, and my thoughts falter until they behold you...

💞

నీ పేరు



నేను నిన్ను కలిసిన తర్వాత, మేఘాలు సంద్రాల ఆవిరిని కాక అంతకంటే పరిమాణంలో ఎక్కువగా ఉన్న నా భావాల ఆవిరిని సంగ్రహించడం ప్రారంభించాయి. నువ్వు ఎప్పుడైనా వర్షంలో చిక్కుకుని, నీటి బిందువులకు బదులుగా చుక్కలు నీ పేరును కలిగి ఉండటం చూస్తే ఆశ్చర్యపోకు..

After I met you, clouds began to consider capturing the vapors of my feelings, as they exceed the volume of water in the oceans. Don't be surprised if you ever get caught in the rain and see drops spelling out your name instead of water droplets..

💞

ఇసుక చిమ్ముతోంది నా కళ్ళు


ప్రియతమా, గతంలో నేను ఉద్వేగానికి లోనైనప్పుడు, నా కళ్ళలోతు నుండి కన్నీళ్లు చిమ్మేవి, కానీ ఇప్పుడు, ఇసుక చిమ్ముతోంది, నిన్ను చూసే వరకు కళ్ళు ఎడారిగా ఉండిపోతుంది నన్ను బాధిస్తూ ...

My love, earlier, when I was emotional, tears would well up from the depths of my eyes, but now, it feels as if the sand is coming out, turning them into a desert, until I see you. It hurts so much I have to keep them closed until I catch a glimpse of you..

मेरी जान, पहले, जब मैं भावुक होता, तो मेरी आँखों की गहराई से आंसू छलक पड़ते थे, लेकिन अब, ऐसा लगता है जैसे रेत निकल रही है, उन्हें एक रेगिस्तान में बदल रही है, जब तक मैं तुम्हें नहीं देख लेता. ये दर्द इतना है कि मुझे उन्हें बंद रखना पड़ता है जब तक कि मैं तुम्हारी झलक नहीं देख लेता


💞


రెక్కలు కట్టు


పక్షి నేల వాలితే తిరిగి ఎగిరి కొమ్మను అందుకోగలదు, ఆకు నేల వాలితే తిరిగి కొమ్మను చేరుకోలేదు, రెక్కలు కట్టి పక్షిలా మారు, ఒకే కొమ్మకు ఆకులా ఉండి తిరిగి ఎగరలేక వాలిపోకు...

अगर एक पक्षी जमीन पर गिर जाता है, तो वह वापस उड़कर शाखा तक पहुंच सकता है; अगर एक पत्ता जमीन पर गिर जाता है, तो वह फिर से शाखा तक नहीं पहुंच सकता। उसी तरह, पंख प्राप्त करो और एक पक्षी की तरह बनो, पेड़ की शाखा पर ऐसे पत्ते की तरह मत रहो जो वापस उड़ न सके।..

If a bird falls to the ground, it can fly back to a branch; If a leaf falls to the ground, it cannot reach the branch again. In the same way, get wings and become like a bird, do not remain like a leaf on the branch of a tree that cannot fly back..

💞

అందపు విత్తనం


నీ ఒక్కొక్క అంగుళంలోని అందానికి విత్తనం ఉంటే చెప్పు, ఆ విత్తనాలన్నీ నేను తీసుకొని ఒక తోటను పెంచి, ఆ తోటలోనే నివసిస్తాను...

உன் அழகின் ஒவ்வொரு அங்குலத்துக்கும் ஒரு விதை இருக்கிறதா சொல்லு, அந்த விதைகளையெல்லாம் எடுத்துக்கொண்டு தோட்டம் வளர்த்து அந்த தோட்டத்தில் வாழ்வேன்...

मुझे बताओ कि क्या तुम्हारी हर सुंदरता के लिए एक बीज है, मैं उन सभी बीजों को लेकर एक बगीचा उगाऊंगा और उस बगीचे में रहूंगा...

let me know if every inch of beauty you possess has seed, I will buy them all and grow a garden and live in that forever...

💞

కలిసి సముద్రాన్ని చేరాలి


బంధాలు సముద్రంలా పెరగాలంటే, మనం నదులలా ప్రవహించాలి. వేర్వేరు దారుల్లో ప్రవహించడం మంచిదే కానీ, కలిసి సముద్రాన్ని చేరాలి.


For relationships to grow like the sea, we have to flow like rivers. It's okay to flow in different ways, but we have to reach the sea together..

रिश्तों को समुद्र की तरह विशाल बनाने के लिए, हमें नदियों की तरह बहना होगा। अलग-अलग तरीकों से बहना ठीक है, लेकिन हमें साथ मिलकर समुद्र तक पहुँचना होगा। 

💞

జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప


ప్రతి రేయి తన రూపమంతా నీటిపై పరుస్తుంటే తనకోసమే అని తడబడి జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప...

A fish fell in love with the moon, thinking that the reflection of the moon on the water was meant for it...

एक मछली को चंद्रमा से प्यार हो गया, उसने सोचा कि पानी पर चंद्रमा का प्रतिबिंब उसके लिए है।

💞

జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప


ప్రతి రేయి తన రూపమంతా నీటిపై పరుస్తుంటే తనకోసమే అని తడబడి జాబిలిమ్మ ప్రేమలో పడెనే చేప...

A fish fell in love with the moon, thinking that the reflection of the moon on the water was meant for it...

एक मछली को चंद्रमा से प्यार हो गया, उसने सोचा कि पानी पर चंद्रमा का प्रतिबिंब उसके लिए है।

💞

నీ అందానికి సరికొత్త భాష


చాలా భాషలలో అందానికి భిన్నమైన పదాలు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడానికి ఒక కారణం ఉండాలి, నేను ఇప్పుడు ఆ కారణాన్నే చూస్తున్నాను కాని ఎవరికీ తెలియని కొత్త భాషను ఉపయోగించాలని ఆలోచిస్తున్నాను ...

In many languages, beauty is described with different terms, yet there should be a reason for using them. I think I am currently looking at that reason but considering to use a new language that no one is aware of...

कई भाषाओं में, सुंदरता को अलग-अलग शब्दों से वर्णित किया जाता है, फिर भी उनका उपयोग करने का एक कारण होना चाहिए। मुझे लगता है कि मैं अभी उस कारण को देख रहा हूं, लेकिन एक नई भाषा का उपयोग करने पर विचार कर रहा हूं जिसे कोई नहीं जानता ...

💞

భావాలు లోతుగా ఉంటే


మార్గం లోతుగా ఉంటే బండి తానుగా కదలదా, భావాలు లోతుగా ఉంటే ప్రేమ కూడా తానుగా కదిలి చేరుకోదా..

If the path is steep, won't the cart move by itself? When one's feelings are steep, love will also move and reach itself...

अगर रास्ता ढलान है, तो क्या गाड़ी अपने आप नहीं चलेगी? जब किसी की भावनाएं ढलान होती हैं, तो प्यार भी अपने आप चलकर पहुंच जाएगा...

💞

బంగారానికైనా ప్రెమకైనా అనువైన వాతావరణం ఉండాలి



మట్టిలో బంగారం దొరుకుతుందని తెలిసి కూడా మట్టి ముద్ద తెచ్చి బంగారం ఇవ్వమని అడగలేము, హృదయంలో ప్రేమ ఏర్పడుతుందని తెలిసి, హృదయాన్ని తెచ్చి ప్రేమ కోసం అడగలేము, బంగారానికైనా ప్రేమకైనా కలగాలి అంటే అనువైన వాతావరణం ఉండాలి..

Knowing that gold is available in soil, we can't bring a lump of soil and ask it to give gold. Similarly, knowing that love is formed in the heart, we can't bring a heart and ask it for love. Both for gold and love to form, there should be a suitable environment...

मिट्टी में सोना होने का मतलब ये नहीं कि हम मिट्टी का ढेला लेकर उससे सोना मांग लें। उसी तरह, दिल में प्यार पनपने का मतलब ये नहीं कि हम दिल को लाकर उससे प्यार मांग लें। सोने और प्यार दोनों को बनने के लिए एक उपयुक्त वातावरण जरूरी है।...

💞

నీ భావాలకు చేరువగానే


భూమి నుండి దూరంగా పోతున్నట్టు కలలు వచ్చాయి, అప్పటికీ ఈ అద్భుతమైన విశ్వంలోనే ఉన్నా అని, ఎల్లప్పుడూ అందమైన వాటికి దగ్గరగా ఉన్నానని నేను గ్రహించాను. అదే విధంగా, నేను నీ మాటల నుండి వెనక్కి తగ్గినప్పటికీ నీ ప్రేమలోనే తేలియాడుతూ నీ భావాలకు చేరువగానే ఉన్నా అని తెలుసుకున్నాను..

I dreamt like I was flying away from Earth, but then I realized I'm still part of this amazing universe, always close to something beautiful. like, when I stepped back from your words, I am still swimming in your love and closer to the wonderful emotions you brought. So, I'm always close to you...

मैंने सपने में देखा मानो मैं धरती से दूर उड़ रहा हूँ, पर तब मुझे एहसास हुआ कि मैं इस अद्भुत ब्रह्मांड का हिस्सा हूँ, हमेशा किसी खूबसूरत चीज़ के करीब हूँ। जैसे, जब मैं आपके वाक्यों से पीछे हटा, मैं अभी भी आपके प्यार में तैर रहा था और आपके द्वारा लाए गए अद्भुत भावों के करीब था। तो, मैं हमेशा आपके करीब हूं...

💞

ఎంత అలజడికైనా నేను సిద్ధమే


కొలనులో అలజడి కలిగించిన వాన చుక్క కొలనులోనే కలిసిపోయినట్టు, చెలి! నాలో నువ్వు కలిసిపోతానంటే, నాతో ఉండిపోతానంటే, ఎంత అలజడికైనా నేను సిద్ధమే....

Like the raindrop that ripples the pool, eventually blending in smoothly, dear! I can withstand any trouble that ripples my heart and patiently await until your love becomes a part of my heart...

जैसे बरसात का एक बूंद, जो तालाब में लहराता है, आखिरकार धीरे-धीरे मिल जाता है, प्रिय! मुझे कोई भी मुसीबत झेलने की ताकत है, जो मेरे दिल को लहराती है, और मैं धैर्य से इंतजार करता हूँ, जब तक आपका प्यार मेरे दिल का हिस्सा नहीं बन जाता।

💞

ప్రేమ ద్వేషం


తెలిపినవన్నీ ప్రేమ కాదు, తెలపకుండ ఉంటే ద్వేషం కాదు, ప్రేమ తెలిపినవారు ఇప్పుడు లేరు, తెలుపని వారు ఇప్పటికీ ఉన్నారు, అందుకే ప్రేమ అంటే ఏంటి ద్వేషం అంటే ఏంటో తెలియట్లేదు, కాబట్టి రెండింటినీ అనుభవిస్తున్నాను ఆస్వాదిస్తున్నాను..

All that is conveyed is not love, all that is not conveyed is not hatred. Those who conveyed never stayed, while those who never conveyed remained. So, I don't know what love is and what hatred is. I am just enjoying both as they come...

जो कुछ बताया जाता है वह प्यार नहीं होता, जो कुछ नहीं बताया जाता वह नफरत नहीं होती। जिन्होंने बताया वो कभी रुके नहीं, जबकि जिन्होंने नहीं बताया वो रह गए। इसलिए, मुझे नहीं पता कि प्यार क्या है और नफरत क्या है। मैं बस दोनों का आनंद ले रहा हूँ।

💞

ఎంత జీవించావో నా ఆలోచనలో


ఒక్క ఆలోచనతో మనం గడిపిన క్షణాలు నా కళ్ళ ముందు మెదులుతుంటే, ఇది చాలదా నువ్వు నాతో కంటే నా ఆలోచనలో ఎంత కాలం జీవించావు అని చెప్పడానికి?

With just a minute of thought, if I can bring back the time we spent, isn't it enough to say how long you lived in my thoughts rather than how long we spent time together?

💞

భూలోకపు దేవత


ఎందుకు మరిచాడో దేవుడు తెలియదు, అందరినీ మామూలుగా చేశాడు కానీ నీకు రెక్కలు ఇచ్చాడు, ఆలోచిస్తుంటే అర్థమైంది, దేవతకి రెక్కలు ఉండటం సహజమే కానీ నిన్ను తప్పుగా భూమిపై పెట్టాడు, స్వర్గం కదా నీ ఊరు ఈ భూమిపై నీకు చోటు తగదు...

What made God forget when making you? He created everyone normally without wings but created you with wings. Maybe he made it right but placed you wrong. Heaven is your place, and earth is not your race...

भगवान न जाने क्यों भूल गए, उन्होंने सबको सामान्य बनाया लेकिन तुम्हें पंख दे दिए, जब तुम सोचते हो तो समझ आता है, देवी के पास पंख होना स्वाभाविक है लेकिन उन्होंने तुम्हें गलती से धरती पर रख दिया, स्वर्ग ही तुम्हारा घर है, इस धरती पर आपके लिए कोई जगह नहीं है...

💞

ప్రేమతో కోపం


ప్రతిరోజూ, సూర్యుడు లేత ఆకులకు వేడి పంచి, వాటిని పెంచుతాడే కానీ దహించడు. అదేవిధంగా, నీ కోపం ప్రేమతో కూడుకున్నది అది ప్రేమను పెంచుతుందే కానీ ద్వేషాన్ని కాదు...

Every day, the sun heats up the tender leaves, not to burn them, but to nurture them. Similarly, your anger arises out of love to foster more love, rather than from hate or disagreement...

हर रोज़, सूरज कोमल पत्तियों को गर्म करता है, उन्हें जलाने के लिए नहीं, बल्कि उन्हें पालने के लिए। उसी तरह, आपका गुस्सा प्यार से उत्पन्न होता है, और और अधिक प्यार को बढ़ावा देने के लिए, न कि नफ़रत या असहमति से।..

💞

మాట్లాడే అద్దం



నేను అద్దంతో మాట్లాడుతున్నానా లేక అద్దం నాతో మాట్లాడటం నేర్చుకుందా?

Am I talking to the mirror, or has the mirror learned how to talk to me?

क्या मैं आईने से बात कर रहा हूँ, या आईने ने मुझसे बात करना सीख लिया है?

💞

నిన్ను తెలుసుకున్న క్షణమే కదా నాకు నువ్వు జన్మించిన క్షణం


నీతో మాట్లాడలేకుంటే, నీతో కలిసి నడవలేకుంటే, నువ్వు ఎప్పుడు పుడితే ఏముంది? నేను నిన్ను తెలుసుకున్న క్షణమే కదా నాకు నువ్వు జన్మించిన క్షణం...

How does it matter when you were born when I can't talk to you or walk with you? Isn't the moment I knew you the moment you were born...

💞

ప్రేమించడం మానకు



ఎక్కడో మొలకెత్తే తమ విత్తనాలను ఎన్ని చెట్లు చూడగలవు?, అయినా పండ్లను పూలను పంచుతూనే ఉంటాయి, ప్రేమ యొక్క ఫలితం కూడా అంతే, అది మరో హృదయంలో ఎక్కడో జీవిస్తూ ప్రేమను పంచుతూ ఉంటుంది, కాబట్టి ప్రేమించడం మానకు..

How many trees can see their seeds sprouting somewhere?, yet keep bearing fruits and flowers. The same is the result of love; it lives somewhere in another heart and spreads love, so we must not stop loving...

कितने पेड़ हैं जो अपने बीजों को कहीं उगते हुए देख सकते हैं, फिर भी फल और फूल देते रहते हैं। मुहब्बत का अंजाम भी यही होता है; यह कहीं न कहीं दूसरे दिल में रहता है और प्यार फैलाता है, इसलिए हमें प्यार करना बंद नहीं करना चाहिए।

💞


పూలను అప్పులిచ్చి తెచ్చుకున్న తారకే నువ్వు


జాబిలమ్మ ఇష్టపడే జాజిపూలు నవ్వులే కదా నీ నవ్వులే కదా, నేల సీమకు చక్కనమ్మ కావాలంటే కోట్ల పూలను అప్పులిచ్చి తెచ్చుకున్న తారకే నువ్వు..

Your smile is the jasmine the moon adores; you are the star borrowed from the sky by this earth gifting millions of flowers...

तुम्हारी मुस्कान चाँद को भाने वाली चमेली है; तुम वह तारा हो जिसे यह पृथ्वी आकाश से उधार लेकर लाई है, लाखों फूलों का उपहार देते हुए।..

💞

జీవితం నీటి ప్రవాహం



జీవితంలో మనం ఎవరిని కలుస్తామో మనకు తెలియదు, ప్రవహించే నీరు వలె, అది నిద్రాణమైన విత్తనాలకు తిరిగి జీవం పోస్తుంది, రాళ్ళను కదిలించడంలో విఫలమవుతుంది, తేలికైన వస్తువులను తనతో పాటు తీసుకువెళుతుంది, కానీ తన మార్గంలో ఉన్న ప్రతిదానిని తాకుతుంది. ఆగకుండా ఎల్లప్పుడూ దాని మార్గాన్ని కనుగొంటుంది...

We don't know whom we meet in the course of life. Like flowing water, it may bring back dormant seeds to life, it may fail to move rocks, it may carry lighter things along with it, but it touches everything in its way and never stops, always finding its way...

हमें नहीं पता कि हम जीवन के दौरान किससे मिलते हैं। जैसे बहता हुआ पानी, वह सोए हुए बीजों को जीवन दे सकता है, वह चट्टानों को हिला नहीं सकता, वह हल्की चीजों को अपने साथ ले जा सकता है, लेकिन वह अपने रास्ते में सब कुछ को छूता है और कभी नहीं रुकता, हमेशा अपना रास्ता ढूंढता है।..

💞



నా మౌనాన్ని తప్పించుకోలేవు


మాటలను తప్పించుకోవచ్చు కానీ మౌనాన్ని కాదు, ఎందుకంటే ఎవరు నీతో మౌనంగా మాట్లాడుతున్నారో, ఎవరు మౌనంగా నీ గురించి ఆలోచిస్తున్నారో నీకు తెలియదు..

You can evade the words, but not the silence, as you don't know who is talking to you in silence and who is thinking about you in silence...

आप शब्दों से बच सकते हैं, लेकिन निःशब्द से नहीं, क्योंकि आप नहीं जानते है कि निःशब्द में कौन आपसे बात कर रहा है और कौन आपके बारे में सोच रहा है...

💞

తీరానికి నాలుక ఉంటే


తీరానికి నాలుక ఉంటే సంద్రాన్ని తాకనిస్తుందా? రుచి తెలిస్తే తడపనిస్తుందా?

Would the shore allow the ocean to touch it if it got a tongue? Would it even permit itself to be moistened by it if it knows the taste?

💞

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...