ఆవగింజ బరువుకు కొండలు పిండికాని

రతనాలు రాలని ,
ముత్యాలు కురవని,
నేలనే నింగికేగి వీడుకోలు పలకని,
ఆవగింజ బరువుకు కొండలు పిండికాని,
పసుపు సూరీడు పండులా మారని ,
ఇన్ని అసాధ్యాలు సుసాధ్యమైతే ,
మన బంధము తెగిపోని.... 

Let the gems fall,
let the pearls rain,
let the land fly to the sky and bid farewell,
let the mountains crush under the weight of a mustard seed,
let the yellow sun turn into a fruit,
if so many miracles are possible,
let our bond also break..

💜💜

ఇమిడిపోయిందే మరి

ఒక ఇసుక రేణువులో మహా సంద్రం ఇముడుతుందా?, అవును భావాలతో ఎగసిపడే నా మహాంతరంగం నీ రవ్వంత ప్రేమలో ఇమిడిపోయిందే మరి...

Does the vast ocean dwell within a grain of sand?
Indeed, it does, when my profound wavering emotions find solace
Within the confines of your tender heart...

💜💜

తియ్యని గాయం

పసిదాని గోటికి తెలియదు అది కలిగించే గాయం,
నాకూ అరవడం రాదు అది కలిగించినా తియ్యని గాయం...

Babies' nails don't know that they can hurt,
I also don't know how to shout for that sweet pain and their sign...

💜💜

ప్రమాదం

కొన్ని ప్రమాదాలు గాయాలను కలిగించవు సరికదా మళ్ళీ జరగాలనే కోరిక కలిగిస్తాయి....

Some accidents don't cause injuries, they just make you want to repeat them....

💜💜

అయినా

వేకువ కిరణాలలో నిన్ను తాకినవి రెప్పలు మూసుకున్నా దాటి వస్తున్నాయి ఏమి చేయను,
నాసిరకపు రెప్పలు ఇచ్చాడేమో అని రెప్పలను మార్చాను, 
మైనంతో కప్పాను,
గందంతో పూత పూసాను,
లక్కతో మూసి వేశాను,
అయినా....

What shall I do, even though my eyelids are closed, the morning rays that touched you pass through? So I changed my poor-quality eyelids, covered them with wax, coated them with sandal paste, and lacquered them. However...

💜💜

తారలకు కరువు పూలకు కొరత

నింగిలో ఎన్ని చుక్కలో,
నేలపై ఎన్ని పూలో,
లెక్క రాసి పెట్టుకున్నా,
కానీ ఒక్కసారిగా నింగిలో తారలకు కరువొచ్చింది,
నేలపై పూలకు కొరతొచ్చింది,
ఆ అద్భుతాలు సోయగాలు నీలో పెట్టి పుట్టించాడేమో దేవుడు, మిగతావారిని శ్వాసతో రక్తంతో చేసి సరిపెట్టుకున్నాడు...

I had a count of the number of stars in the sky and the number of flowers on the earth, but all of a sudden, there was a scarcity of both. It seems like God used those wonders and fragrances to create you, while the rest of us are made with only breath and blood...

💜💜

పురుగునో మనిషినో

ఈ లోకంలో నేను పురుగునో మనిషినో పువ్వునో పండునో జంతువో ఎవరు పట్టించుకుంటారు, కానీ నువ్వు లేని నా ఉనికిని బ్రతికున్నా హృదయం లేని ప్రాణంలా అందరూ గుర్తిస్తారు...

In this world, who cares whether I am an insect, a man, a flower, a fruit, or an animal? But my existence without you is recognized by all as a living soul without a heart...

💜💔💜

మునిగిపోయాను




సముద్రపు అట్టడుగున విరిగే సుద్ధ ముక్క శబ్దం ఎవరికి వినిపిస్తుంది? నీ ప్రేమలో నా మనసు మునిగిపోయింది,  
ఇప్పుడు అది విరిగినా ఎవ్వరికీ వినిపించదు కనిపించదు, ఇకపై నీలోనే ఉంటూ కలిసిపోతుంది....

Who can hear the sound of chalk breaking at the bottom of the sea? My heart is drowned in your love. Now, if it is broken, none can hear it and none can notice it, it is becoming a part of you...

💜💔💜

భావాల ఇసుకలో సమాధి కాలేను


కన్నీటి వరదలో మునిగినా పర్లేదు కానీ భావాల ఇసుకలో సమాధి కాలేను...


It's okay to drown in the flood of tears instead of getting buried in the sand of feelings...

💜💜

ప్రేమ నీ దయ

ప్రేమలో ఉన్నప్పుడు నేను నీ దయతో బ్రతుకుతాను...

I am at your mercy when in love...

💜💜

నేనెందుకు కలలు కనాలి





నేనెందుకు కలలు కనాలి నా కలల కంటే నువ్వు అందంగా ఉంటే...

Why should I dream when you are more beautiful than my dreams?

💜💜

పాపం చీర

అమ్మాయి! నన్ను కూడా అల్లుకోవా అని అడగడానికి నీపై ఉన్న గుడ్డ సరిపోదే, 
ఇంక నిన్నేమీ ప్రేమించను, 
కొంగుకు కడితేనే నేను కుదురుగా ఉండటం కష్టం, బెత్తెడు గుడ్డ నిన్నే చుట్టలేదు నన్ను ఎలా కట్టిపెట్టుకుంటావు, 
ఓ చీర! ఎందరో మునులు మౌనంగా తపస్సు చేసి వరాలు పొందారు, 
నువ్వు మా బీరువాలో ఎన్ని ఏళ్ళు మౌనంగా తపస్సు చేసినా దేవుడు కరుణించలేదు, 
నిజమే నీకు మంత్రాలు రావు హోమాలు చేయవు, 
నీపై ఎవ్వరికీ కనికరం లేదు, 
కనీసం మరుజన్మలో నేను ఆడదానిని ఐతే నీ మోజులో పడతాను నిన్ను ప్రేమిస్తాను చుట్టుకుంటాను అల్లుకుంటాను, 
నిన్ను ప్రేమించేవాడినే నేను ప్రేమిస్తాను...

లేనపుడు కలిగేదే సంతోషం

ఏదీ లేనపుడు కలిగేదే సంతోషం,
నీపై ఏదీ లేనపుడు కలిగేదే సంతోషం...

Happiness is when there is nothing,
Happiness is when there is nothing on you..

💜😉💜

నీ అందం అపురూపం అనిర్వచనీయం

నిన్ను చూసేటప్పుడు నా కనురెప్పలపై ఎంత బరువు మోపినా వాలదు,
కొండంత బరువైన నిదుర వాలని,
మిన్నంత లోతైన నొప్పి వాలని,
చలించదు చూపు మరలదు,
ఓ సౌందర్యవతి నీ అందం అపురూపం అనిర్వచనీయం...

No matter how much weight falls on my eyelids,
they don't blink while looking at you,
Weight can be the sleep as heavy as a mountain or weight can be the pain as deep as space,
oh beautiful lady, your charm is incredibly indescribable...

💜💜

దూరం మనోహరం

జాబిలి చేరువగా చేతికి అందేలా ఉంటే ఎవరైనా ఎన్నిసార్లు ఆసక్తి చూపుతారు? జాబిలి కంటే దూరం అన్నది మనోహరమైన అంశం కాదా? అందుకే నీవంటి అద్భుతాలు దూరంగా ఉంటాయేమో

How many times will you even show interest in the moon if it is close to you and touchable? Isn't the distance the real fascinating factor, rather than the moon? Maybe that's why amazing things like you are very far away.

💜💜

ఓడిపోయాను

నీ మనసును వినాలనుకునే క్రమంలో నా వినికిడిని ఎంతగానో పెంచుకున్నా, 
నత్త వేసే అడుగుల చప్పుడు వినగలిగాను, 
మొగ్గ పువ్వుగా మారేటప్పుడు అది పగిలే శబ్దాన్ని వినగలిగాను,
ఉప్పు నీళ్ళ కలయికలో వచ్చే అలజడిని వినగలిగాను,
కదిలే మేఘాల అలికిడిని వినగలిగాను,
కానీ ఇంకా నీ మనసు పలికే మౌనాన్ని అందుకోలేకున్నాను ఓడిపోయాను...

In the process of hearing your heart, I enhanced my hearing.
I could hear the snail's footsteps.
I could hear the sound of a bud bursting into a flower.
I could hear the tumult of saltwater mixing.
I could hear the waves of moving clouds.
But still, I can't grasp the silence that speaks your heart, and I'm defeated...

💜💜

భూలోకపు వెన్నల

ఎన్నో అద్భుతాలకు నెలవు, లెక్కించలేనన్ని తారలు, ఎన్ని లేవు తన దగ్గర అయినా సందేహంతో అడిగాను చీకటి ఆకాశాన్ని, తను రెప్ప వాల్చినపుడు కలగంటుందా అని,
అవునని అంటోంది నిన్ను చూసి కలకంటుందని, నువ్వే తన భూలోకపు వెన్నలని....

Home to wonders and infinite galaxies, I harbored doubts as I questioned the night sky: Could it dream after closing its eyes? In response, it revealed that it dreams by looking at you and you are its earthly moon...

💜💜

ఒక్కసారైనా

ఒక్కసారైనా తలపైకి అలలు వచ్చేలా సంద్రంలో మునిగావా, లేదే!
లేక ఆ నీటిలో పగలు రాత్రి తడిసావా, లేదే!
నీటి మనుషులతో పరిచయం పెంచుకున్నావా, లేదే!
ఆల్చిప్పలో నివాసమున్నావా, లేదే!
నా సందేహము అదే,
ఏదీ జరగకుండా ఎలా ముత్యమయ్యావు ఎలా మెరుస్తున్నావు...

You didn't immerse yourself at least once in the ocean and let the waves touch your head,
or you didn't get wet day and night in that water,
or you haven't made friendships with water people,
or you have never resided in an oyster.
My doubt is,
how did you become a beautiful pearl without anything happening...

💜💜

తీగ మనసులో నువ్వు

అందరూ తీగలా మారాలి అనుకుంటే, తీగ కోరికేమో నీలా మారాలని....

If everyone wants to become like a vine, the vine's wish is to become like you...

💜💜

నువ్వే నా దేవత

రాయికే పసుపు పూసి దేవత అని పూజిస్తుంటే, నా ఊహకు రూపమిచ్చిన నిన్ను నా దేవతగా ఆరాధించనా, ఆ రాయే కోరికలు తీరుస్తుందని నమ్ముతుంటే, నువ్వు మనసుగలదానవు కోరిక సరే కనీసం మాట వినిపించుకుంటే చాలదా...

When the stone painted with turmeric is idolized as a goddess, you gave real form to my imagination, so I admire you as my goddess. When it is believed that the stone can fulfill wishes, you have a lovely heart, so it is enough if you can at least hear what I say...

💜💜

నీది జ్వలించే ప్రేమ కానీ ధహించే ప్రేమ కాదు

నీది జ్వలించే ప్రేమ కానీ ధహించే ప్రేమ కాదు, నిన్ను చూసేవారికి కనిపించేది నిప్పు, కానీ నీలో ఉన్నది రగిలే నిజం మాత్రమే...

Your love throws flames, but it doesn't burn anyone. Those who look at you can see the fire, but what you truly possess is intensified truth and honesty..

💜💜

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి ఎంతందం ఎంతందం,
కాలిబాట పట్టిందో వెన్నెలమ్మ రేపటికి ఏంచందం ఏంచందం,
నడుమే ఊగకుండా నడక నేర్చింది,
కదిలే జాడ కూడా తెలియకుండ పోతోంది,
తెరిచిన కనులలోనే కలలా పూసిందంటే, కనులు మూస్తే మరి ఆ రెప్ప వెనుక కథలో ఏమౌతుంది...

What did the night feed the moon, that it grew so beautifully? It seems like it has already started its journey to tomorrow. What a lovely sight to watch. It learned how to walk without a waver in its hip. Even if you watch closely the movement is not imperceptible. With this, dreams are blooming in wide-awake eyes. What might occur in the dreams that unfurl behind closed lids?

💜💜

అమ్మ

మనిషైనా మృగమైనా మారంది అమ్మ,
చీమకైనా దోమకైనా ఉంటుంది అమ్మ,
అమ్మున్న చోట దేవతల పంట,
వరమిచ్చే దేవుడు నీ పూజలడిగాడు,
తను అడగకనే మనకు వేసింది భిక్ష,
ప్రాణాలు ఇచ్చి దీక్షలను చేసి,
యమ పాశాన్ని కూడా ఎదిరించే శక్తి,
తన పేగు వాడినా మది వాడనీదు,
తనలోని శోకం అదృశ్య లోకం,
ఎదురెళ్లకు తన మాటకు,
పసిపాప కోపం తనలోని ఆవేశం,
నీ దెబ్బలు పలికే భాష అమ్మేను కదరా,
తన చిరునవ్వే కనిపించే స్వర్గం చూడరా,
ఎంత చెప్పినా ఏమి చేసినా ఆ రెండు అక్షరాల ఋణము తీరుతుందా...

కొత్త దేవత

కొత్త దేవతను నియమించాడో ఏమో ఆ బ్రహ్మ, అతను నీకు హృదయాన్ని పెట్టకుండా తేనె తుట్ట పెట్టాడు, నా విధి రాతలో బ్రహ్మ చెప్పింది రాయకుండా, కొంత మరచిపోయి నన్నే రాసుకోమన్నాడు, తప్పు మీద తప్పు చేసినా మంచిదే జరిగింది, అసమాన్యమైన నీ పరిచయం కావాలని రాసుకున్నా, తేనెలొలికే నీ హృదయాన్ని రుచి చూస్తూ ఉన్నా, నేను రాయని విధిలో ఇంకేముందో తెలియదు కానీ, నీ దూరం తప్ప ఏమున్నా సరే జరగని....

💜💜

అసలైన రుచి తెలియదు

పండు మెరవాలని నూనె రాయడం,
ప్రేమ మెరవాలనీ అబద్ధం చెప్పడం ఒక్కటే,
ఆ మరక పోదు వాటి అసలైన రుచి తెలియదు...

Oiling the fruit to make it shine and lying to make love shine are the same. That stain will not go away, and real essence cannot be felt...

💜💜

గాజు గాలిపటం

నీ ప్రేమ గాలై వీస్తే,
ఎగురవేస్తా గాజుతో చేసిన నా మది గాలి పటాన్ని,
బరువుకు పడుతుందనే భయం లేదు,
పడనప్పుడు విరుగుతుందనే చింత లేదు,
వేగంగా వీస్తూ నువ్వు దానిని గాలిలోనే ఉంచగలవు,
అందుకే స్వేచ్ఛగా ఎగరెస్తా నా మదిని నీకు అప్పగిస్తా....

If your love blows like a breeze,
I'll let my heart, made of glass, dance like a kite in the wind.
I'm not afraid that it will fall due to its weight,
Nor do I worry about it breaking.
You can swiftly keep it flying high,
That's why I willingly surrender my heart to you....

💜💜

ఎందుకో

ఇది వరకు చూడని అద్భుతాలు ఎన్నో ఉన్నా, 
నీ కలలో తొంగి చూడాలని కలిగే కోరికెందుకో,
లెక్కించినా తక్కువే తారలు,
కానీ నీ ఆలోచనలు ఎన్నో వాటిని లెక్కించలేనెందుకో...

Though many miracles remain unseen,
I long to see them in your dreams, serene.
Stars may be counted, or so it seems,
But your thoughts are beyond what numbers deem...

💜💜

నీ పలకరింపుతో వేడి కాకుండా వెలుగునిచ్చాయి

వేకువ కిరణాలు వేసవి కిరణాలు మండి మండి,
వాటికీ సేద తీరాలని, వాటికీ నేల తాకాలని,
హిమగిరులపై వాలాయి గిరులే కరిగిపోయాయి,
పూల తోటపై వాలాయి అవి వాడిపోయాయి,
గడ్డి వాముపై వాలితే కాలిపోయింది,
చివరికి నీపై వాలాయి నెమ్మదించాయి,
నీ పలకరింపుతో వేడి కాకుండా వెలుగునిచ్చాయి...

After burning for so long, the rays of the summer sun wanted to rest. They landed on icy mountains, causing the mountains to melt. They then rested on the flora, causing the flowers to fade. When they tried to rest on the grass, they got burnt. After a long search, they finally rested on you and gave light instead of heat..

💜💜

కనులెన్ని ఉన్నాయో లెక్కించుకున్నా

నిన్ను చూసే ముందు,
కనులెన్ని ఉన్నాయో లెక్కించుకున్నా,
అణువణువు నాలో కనులైనా సరిపోదంటూ దుఃఖిస్తున్నా,
ఓ సొగసరి నెమలి పించాన్ని వేడుకొని కనులను అప్పు తీసుకుంటా, 
నీ సిరుల ఝరిలో నా చూపులను కాస్త తడుపుకుంటా....

Before seeing you, I counted the number of eyes I have. Even though every cell in my body is like an eye, I grieve that it is not enough to feel you. May be I will beg the peacock feathers to lend me few more eyes and immerse my gaze in your beauty..

💜💜

తృప్తి చెందుతావో సాహసివై సంద్రాన్ని ఎలుతావో

పడి లేచే అలలు,
పిల్లల కోసం,
ఆటుపోట్ల కెరటాలు ఆటగాళ్ళ కోసం,
నడి సంద్రంలోని అందాలు సాహసించే వారికోసం,
అలలతో ఆగుతావో ఆటుపోట్లు చూసి తృప్తి చెందుతావో సాహసివై సంద్రాన్ని ఎలుతావో...

The waves are for children, the tidal waves are for players, the beauty of the ocean's middle is for those who dare. It's up to you whether you stop with the waves, are satisfied with the tides, or choose to be adventurous and rule the ocean.


💜💜

గజిబిజి మబ్బులు

గజిబిజి మబ్బులు ,
రూపం లేని గుబ్బలు,
అవే అంత అందంగా కనిపిస్తుంటే,
గీసినట్టు నీ రూపం,
కదలగలిగే శిల్పం,
నీ అందానికి ఈ లోకం దాసోహం అనదా....

Messy clouds, 
Shapeless lumps,
Yet they have a beautiful appearance.
Your figure, like a creation of art,
A sculptor's dream, a true work of heart,
Isn't this world enslaved to your beauty?

💜💜

అతివ అందం

ప్రతి అడుగు ఒక బదులు, ప్రతి కదలికలో ఎవ్వరినీ లెక్క చేయని నీ అనుభవాలు, చురుకైన చూపులు, అతివ అందానికి ఇవేగా అసలైన హంగులు...

Answering with each step forward, experiences that no one can discount, sharp eyes - aren't these the characteristics of a beautiful woman?

💜💜

నీటి నుంచి వెలివేయబడిన చేప

నీటి నుంచి వేలివేయబడిన చేపకు మనసులో రుణం ఉంటుంది కానీ కోపముండదు...

The fish that was thrown out of the water will feel gratitude in its heart, but not anger...

💜💜

ప్రేమ దర్పణం

నీకు నువ్వు కళ్లకు గంతలు కట్టుకుని అద్దం ముందు నిలబడినా, అది నిన్ను ప్రతిబింబిస్తూనే ఉంటుంది. నువ్వు దానిని అంగీకరించినా అంగీకరించకపోయినా, దాని ముందు నిలబడటానికి నువ్వు చూపే ప్రేమ మారదు, అది నిన్ను ప్రతిబింబించకుండా ఉండదు...

Even if you blindfold yourself and stand in front of a mirror, it will still reflect you. Ignoring it won't change your love for standing in front of it or the love it has for reflecting you, regardless of whether you acknowledge it or not...

💜💜

కడలి మంచికోసం జాబిలి దూరమున్నందునే

కడలి మంచికోసం జాబిలి దూరమున్నందునే కెరటాలు దానికై ఉప్పొంగుతుంటాయి తమ ప్రేమను చాటుకుంటాయి, వెరెక్కడ చూడగలము ఇంతకు మించిన ప్రేమను, మనసుకు ఆలోచనకు మధ్యనున్న గొప్ప ప్రేమను, ఒకరికోసం మరొకరు మార్చుకునే ప్రేమను, స్వచ్ఛమైన ప్రేమను ఎవ్వరు విడతీయలేని ప్రేమను...

As the moon keeps its distance from the ocean wide, For the ocean's welfare, the tides rise high to show its devotion, A natural bond of love in constant motion. Where else in this world can we find such a connection of heart and mind, Where one adjusts for the other's sake, A love so pure, no bond can break...


💜💜

మొక్కజొన్న బంధం

మొక్కజొన్న తోటని మొత్తం నిప్పంటించే బదులు, ఒక మొక్కజొన్నని కాల్చి తింటే ఉపయోగం ఉంటుంది రుచిగాను ఉంటుంది, మనస్పర్థలు వచ్చినపుడు బంధానికి నిప్పంటించే బదులు భాగస్వామిని కాసేపు కాల్చుకొని తింటే అది రుచిని పెంచుతుంది బంధాన్ని కాపాడుతుంది...

Why set the whole cornfield on fire when you can just roast a single corn and make it pop with flavor? It saves the field and satisfies your taste buds And when your relationship needs a little spice, don't let it go up in smoke - roast your partner instead! A little heat can enhance the essence of your relationship and make it sizzle...

💜😛💜

తడి హృదయం

ఈ సాయంత్రపు వర్షంలో తడవకపోయినా నీ ఆలోచనలతో తడి చేరిన హృదయం మట్టి వాసన కంటే, కమ్మే పొగ మంచు కంటే, మెరిసే చినుకుల కంటే అద్భుతమేగా...

The wonder of this rainy evening is not in the smell of the soil, nor the fog, nor the shiny raindrops. It lies in my heart, which remains moist despite never having been soaked by nature's art, but has been touched by your little thought.

💜💜

వేకువ దీపము

వేకువన వెలిగించిన దీపము కాదు నీ ప్రేమ వ్యర్ధమవ్వడనికి,
ఆ వెలుగులో కూడా మనసు చీకటైతే వెలుగు చూపించేది నీ ప్రేమ...

Your love is not a lamp lit in broad daylight to be wasted; it is meant to shine and give light when the heart is gloomy, even in the brightest of days..

💜💜

ప్రతి అడుగు ఒక గమ్యమే




ప్రతి అడుగు నువ్వు నిర్ణయించని గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఒకసారి తిరిగి చూడు, నువు ఇప్పటికే వేలాది గమ్యాలను చేరుకోనుంటావు.

Every step reaches a destination that you didn't designate as the destination. Look at it, you have already visited thousands.

💜💜

మారుతాను కానీ మాయమైపోను




నువ్వు ఉప్పొంగే అలవే, మహా కెరటానివే, కానీ నీ తీరంలో నేను మట్టి కోట కాను,నీ రాపిడికి కొంచం కొంచం మారుతూ, నున్నగా మారి, నీ తేమకు మెరిసిపోయే రాతి ముద్దను,చెలి ఎంత తాకిడి ఉన్నా నీకై మారుతాను కానీ మాయమైపోను...

You are a surging wave, a great wave, and I am not a mud fort on your shore. Rather, I am like a lump of stone that changes little by little with your friction, becoming smooth and shining with your moisture. No matter how much I crash, Dear, I will change for you but will not disappear...

💜💜

అందమైన కళ్ళు

నీ నల్లని కళ్ళని చూసిన నా కళ్ళకి ఈ చీకటి కూడా తెల్లగా కనిపిస్తోంది, అంత నలుపు ఎలా ఇచ్చాడో కానీ తానే చేసిన చీకటిని చిన్నబుచ్చేలా అందమైన కళ్ళని నీకు ఇచ్చాడు..

Seeing your black eyes, even in this darkness, everything appears white to me. My dear, how could God have shown prejudice against His own creation, the night, by giving you such beautiful dark eyes?

💜💜

నీ అందంలోని రుచి చావదు

వేపతోటనంతా సారం తీసి కలిపినా నీ అందంలోని రుచి చావదు, ఎందుకింత అందంగా ఉన్నావు?

Your beauty's taste will not fade away, even if it were mixed with the essence of the entire neem garden. Why are you so beautiful?

💜💜

ప్రేమను ఉమ్మేసి వెళ్ళిపో

నీ మది ఆరగించిన నా ప్రేమలో రుచి లేదేమో ఉప్పు తక్కువేమో, కన్నీటిని ఇస్తున్నాను కలిపి చూసుకో, అప్పటికి రుచి లేకుంటే ప్రేమను ఉమ్మేసి వెళ్ళిపో..

If the love you felt before was lacking, then use my tears to give it some seasoning. But if it still doesn't satisfy you, don't force yourself to stay by its side. Spit it out and let it go...

💜💜

పిడికెడు ఇసుకను ఎవరు మింగగలరు?

పిడికెడు ఇసుకను ఎవరు మింగగలరు? నేను మింగగలను, కానీ నీ చేతిలో కొంత సమయం ఉండనివ్వు, నీ స్పర్శతో కరిగిన నా మనసు వలె దానిని కరగనివ్వు...

Who can swallow a handful of sand? I can, but let it stay for some time in your hand and it will get melted like my heart did with your gentle touch.

💜💜

నీతోనే ఉన్నా సరే ఎగరగలను వెలగగలను

ఎగిరే పక్షులకు,
నింగికేసి వెలిగే దీపాలకు,
భూమి ఆకర్షణ పని చేయదేమో అని అనుకుంటే పొరపాటే, ఆకర్షణ ఉన్నా సరే,
అవి ఎగరడం నేర్చుకున్నాయి,
పైకి వెలగడం నేర్చుకున్నాయి, చెలి నువ్వు నన్ను దాసుడిని చేయలేదు,కేవలం నాకు నేను ఎగురుతూ వెలుగుతూ కూడా నీతోటే ఉండటం నేర్చుకున్న మనసును...

For birds that fly,
oil lamps that light up to the sky,
it is a mistake to think that gravity doesn't work.
They have learned to fly and to light up.
Dear, I am not enslaved by you.
Trust me, I do fly and light up,
even if I stick with you always...

💜💜

పోనంతకాలం నిన్ను నాతో ఉంచుతుంది

కన్నీరు తీరిపోయింది, కనులలో దాచాను, ఎదురుచూపులు వాడింది, కలలో దాచాను, నిదురే పోయింది, శ్వాసలో ఉంచాను, అది పోతుంది కానీ పోనంతకాలం నిన్ను నాతో ఉంచుతుంది...

Tears have dried, yet I keep you in my eyes. The wait is over, so now I keep you in my dreams. Sleep has left me, but I keep you in my breath. Even though it will eventually fade away, you will stay until then...

💜💔💜

తనువంతా నిండిన నా ప్రేమకు ఏమి కాదులే

ఈ నేల అంతా కార్చిచ్చు రేగినా, సముద్రాలను ఆవిరి చేయలేవులే, నా మనసు కాలి బూడిద అయినా తనువంతా నిండిన నా ప్రేమకు ఏమి కాదులే...

Even if the entire land catches fire, it cannot vaporize the oceans, and though my heart may be burnt to hell, it cannot diminish the love for you that fills my entire being...

💜💔💜

ప్రాణం పోయావా తనకు?

ಅಂಧಕಾರವೊಂದೇ ನಿನ್ನ ನಿಜವಾದ ಸೌಂದರ್ಯವನ್ನು ತಿಳಿದಿದೆ, ಓ ಕನಸೇ, ನೀನು ಏಕೆ ಸ್ವಲ್ಪ ಕರುಣೆ ತೋರಬಾರದು? ನೀನೇ ದೇವರಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಅವಳಿಗೆ ಜೀವ ನೀಡಬಾರದೇ? केवल अंध...