పుట్టినరోజు

దేనికి వరముంది?
మొగ్గతొడిగిన క్షణాన్ని మొక్క వేడుకగా చేసుకోదు,
చినుకు పుట్టిన క్షణాన్ని మేఘం మెచ్చుకొదు,
మొదటి సారి పొదుగు చూసిన లేగదూడకి ఆ క్షణం గుర్తు ఉండదు,
కానీ మనిషికి వరముంది,
పుట్టిన క్షణాన్ని గుర్తు చేసుకోవడానికి,
ప్రతి ఏటా ఆ తియ్యని అనుభూతిని అనుభవించడానికి,
పుట్టినరోజున పండుగ చేుకోవడానికి...

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️