విసిగిన మనసులో ఉరకలేస్తున్న ఉత్సాహం,
ఆటు పోట్లు ఉన్నా తీరం లేక లేవలేకున్న అలల సందోహం,
పతంగమా నువ్వు ఎగరగలవా? కానీ ఎక్కడుంది ఆకాశం?
విత్తు పాతుకుపోయేంత నేల ఉన్నా ఊపిరికి గాలి లేని ప్రపంచం,
అయ్యో బలం ఉన్నా బలహీనతను మోయలేకున్నా,
అవకాశం ఉన్నా ఆలోచనలో సారం వెతకలేకున్నా,
ఉండగలనా నేను ఈ ప్రపంచంలో, పట్టు లేని ఈ విలాస భూలోకంలో,
ప్రత్యక్షమయ్యింది ఒక వరం,
నేను చదివిన కథలలో ఉన్న దేవతలా రెక్కలు లేదు,
చేతిలో దండము లేదు, కానీ ,
సాగరానికి తీరాన్ని ఇచ్చింది,
మనసులో ధైర్యాన్ని నింపింది,
పతంగాన్ని విహంగంగా మార్చి ఆకాశాన్ని పరిచింది,
ఊపిరికి మట్టుకే కాదు నా అన్ని జన్మలకు సరిపడా గాలి నింపింది,
బలాన్ని బాటగా వేసింది,
ఆలోచనలో వెలుగు నింపింది,
ఇక్కడే ఉండగలను అనే నమ్మకం నింపింది ....
Excitement in a weary mind,
even if the sea is furious, there is no shore to support the raising waves,
Kite, can you fly? But where is the sky?
even though there is soil enough for the seed to take root, this is a world without air,
Alas, though I have strength I am not able to bear weakness,
Though I have opportunity I can't find the essence in the thought,
Can I stay in this world, in this slippery world of luxury,
then appeared a boon,
No wings like the gods in the stories I read,
No wand in hand, but she,
gave shore to the ocean,
Filled me with courage,
Turned the kite into plane and the sky into a wonderland,
not just for the breath, I have Enough air for all my re-births,
The strength has paved the way,
Filled Enlightement in my thoughts,
I got the belief that I can stay here forever along with her...
💜
No comments:
Post a Comment