పుట్టినరోజు

దేనికి వరముంది?
మొగ్గతొడిగిన క్షణాన్ని మొక్క వేడుకగా చేసుకోదు,
చినుకు పుట్టిన క్షణాన్ని మేఘం మెచ్చుకొదు,
మొదటి సారి పొదుగు చూసిన లేగదూడకి ఆ క్షణం గుర్తు ఉండదు,
కానీ మనిషికి వరముంది,
పుట్టిన క్షణాన్ని గుర్తు చేసుకోవడానికి,
ప్రతి ఏటా ఆ తియ్యని అనుభూతిని అనుభవించడానికి,
పుట్టినరోజున పండుగ చేుకోవడానికి...

💜

ముగింపనేది ఉండదు

ఎప్పుడైతే ఆరంభంలోనే ముగింపు పలుకుతుందో అది ఎప్పటికీ మొదలుకాదు,
ఎప్పుడైతే ముగిసినా మళ్ళీ మొదలౌతుందో దానికి ముగింపనేది ఉండదు...

When there is an end in the beginning, it never begins,
When it begins again after the end, it never ends...

💜

మహా విస్పోటనం

నిన్ను కలిసిన తరువాత మహా విస్పోటనం జరగకుండానే కొత్త లోకం ఏర్పడుతుందని తెలిసింది..

After meeting you I understood new world can form without bigbang..

💜

చల్లని నిప్పు నీ ప్రేమ

చల్లని నిప్పు నీ ప్రేమ,
నన్ను ఎలా కరిగించిందో తెలియదు కానీ కరిగిపోయాను..

Your love is cold fire,
I never knew how I melted but got melted...

तुम्हारा प्यार ठंडी आग है,
मैं कभी नहीं जानता था कि मैं कैसे पिघल गया लेकिन पिघल गया ...

💜

మేఘం వదిలిన చుక్కలా

మేఘం వదిలిన చుక్కలా మొదలైన నా ప్రేమ మంచు తునకలా మారిపోయింది నీ ప్రేమ తగలగానే...

My love that started as a drop left by a cloud turned into a snowflake when your love touched...

💜

నువ్వు నా చెంతనే ఉంటే

నువ్వు నా చెంతనే ఉంటే అర్ధరాత్రి సూర్యుడిని మరియు మధ్యాహ్న చంద్రుడిని చూసే అవకాశం నాకు ఉంటుంది..

If you're by my side, I'll get to see the midnight sun and the midday moon..

अगर तुम मेरे बगल में हो तो मुझे आधी रात का सूरज और दोपहर का चांद देखने का मौका मिलेगा

💜

ఎంత నమ్మకం?

ఎంత నమ్మకాన్ని పోగు చేసుకోగలవు అని అడిగితే,

మన బంధాన్ని చూపాను... 


When asked how much trust I can muster,

I showed our bond...


यह पूछे जाने पर कि मैं कितना भरोसा जुटा सकता हूं,

मैंने हमारी बंधन दिखाया ...


💜

స్వర్గం అంత పువ్వు

 నా ఆనందాలన్నింటిని, ఒకొక్క రేకులా చేసి, కూరిస్తే స్వర్గం అంత పువ్వు వస్తుందేమో... 


If all my joys are made into each petal, a flower as big as heaven will come out...


एक एक पंखुड़ी में मेरी सारी खुशियाँ बन जाएँ तो स्वर्ग जितना बड़ा एक फूल निकलेगा...

💜

విసిగిన మనసులో ఉరకలేస్తున్న ఉత్సాహం

 విసిగిన మనసులో ఉరకలేస్తున్న ఉత్సాహం,

ఆటు పోట్లు ఉన్నా తీరం లేక లేవలేకున్న అలల సందోహం,

పతంగమా నువ్వు ఎగరగలవా? కానీ ఎక్కడుంది ఆకాశం?

విత్తు పాతుకుపోయేంత నేల ఉన్నా ఊపిరికి గాలి లేని ప్రపంచం,

అయ్యో బలం ఉన్నా బలహీనతను మోయలేకున్నా,

అవకాశం ఉన్నా ఆలోచనలో సారం వెతకలేకున్నా,

ఉండగలనా నేను ఈ ప్రపంచంలో, పట్టు లేని ఈ విలాస భూలోకంలో,

ప్రత్యక్షమయ్యింది ఒక వరం,

నేను చదివిన కథలలో ఉన్న దేవతలా రెక్కలు లేదు,

చేతిలో దండము లేదు, కానీ ,

సాగరానికి తీరాన్ని ఇచ్చింది,

మనసులో ధైర్యాన్ని నింపింది,

పతంగాన్ని విహంగంగా మార్చి ఆకాశాన్ని పరిచింది,

ఊపిరికి మట్టుకే  కాదు నా అన్ని జన్మలకు సరిపడా గాలి నింపింది,

బలాన్ని బాటగా వేసింది,

ఆలోచనలో వెలుగు నింపింది,

ఇక్కడే ఉండగలను అనే నమ్మకం నింపింది ....



Excitement in a weary mind,
even if the sea is furious, there is no shore to support the raising waves,
Kite, can you fly? But where is the sky?
even though there is soil enough for the seed to take root, this is a world without air,
Alas, though I have strength I am not able to bear weakness,
Though I have opportunity I can't find the essence in the thought,
Can I stay in this world, in this slippery world of luxury,
then appeared a boon,
No wings like the gods in the stories I read,
No wand in hand, but she,
gave shore to the ocean,
Filled me with courage,
Turned the kite into plane and the sky into a wonderland,
not just for the breath, I have Enough air for all my re-births,
The strength has paved the way,
Filled Enlightement in my thoughts,
I got the belief that I can stay here forever along with her...

💜

చూపుల ఆవిరులే

నీ చూపుల ఆవిరులే కవితలు కురిపించే నా ఆకాశానికి నీలి మేఘాలు...

The vapours from your gaze is the dark clouds of my words raining sky...

💜

నియంత్రణ

అలలు వద్దనుకుంటే వాటిని అనిచివేయగల సంద్రం నువ్వు,
దారినున్న గడ్డిపోచను తాకకుండా దాటిపోగల సుడిగాలి నువ్వు,
కాదనుకుంటే ఒక్క ఇసుక రేణువును తప్ప భూమినంతా తడపగలిగే తుఫాను నువ్వు,
పత్తితోటలో ఉన్న అగ్నిపర్వతం నువ్వు పొంగినా వాటిని మసిచేయకుండా దాటగలవు,
ఇంతటి నియంత్రణ నీలో భయము వల్ల కాదు ప్రేమ వల్ల..

You are the ocean which can halt the waves whenever it doesn't want to play,
You are the whirlwind that can pass without touching the grass in it's way,
You are a storm that can wet the whole earth except a single grain of sand if you don't want to, you are an errupting volcano within a cotton field but you can make the lava pass through without making them soot,
You have so much control in you not because of fear but because of concern and love..

💜

ఉదయం ఒక కారాగారమే కదా

వేకువ విధించిన శిక్షలో కనులు మూసి కలలో నా లోకాన్ని చూస్తుంటే కనులు తెరిపించి ఈ లోకాన్ని చూడమంటోంది,
వెలుగులో అన్నీ కనిపించినా నువ్వు కనిపించనపుడు ఈ ఉదయం ఒక కారాగారమే కదా...

In the punishment imposed by the dawn, it forced me to look at this world when I was dreaming about my world,
Isn't this morning a prison when I can see everything except you?

💜

పోటిపడతాయి పోరాడుతాయి

సాధారణంగా పుస్తకంలోని పదాలు వాటి నిదురనుంచి మేలుకోవు,
కానీ నువ్వు చదివినప్పుడు నీ చూపు తగలాలని నీ పెదవులు వాటిని పలకాలని ఒకటితో మరొకటి పోటిపడతాయి పోరాడుతాయి..

usually words in the book don't wake up from their sleep,
but when you read they even fight with each other to be the first to fall in your eyes and get spelled by your lips..

💜

ఎగిరే చేప

ఇప్పటివరకు నీటిలోని ఆకాశ ప్రతిబింబంలో ఈదుతున్న చేపకు రెక్కలొచ్చి ఆకాశానికే ఎగరగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో, నీ
పేరు వరకే ఉన్న పరిచయం, చనువుగా మారింది ప్రేమగా ఎదిగింది మరి ఇదీ అంతే అద్భుతం కాదా..


How wonderful it would be if a fish that was swimming in the reflection of the sky in the water could take wings and fly to the sky itself.
The relationship that I have only with your name turned into love and this is as wonderful as that flying fish..


यह कितना अद्भुत होगा यदि एक मछली जो पानी में आकाश के प्रतिबिम्ब में तैर रही थी पंख ले सकती है और स्वयं आकाश में उड़ सकती है।
तेरे नाम से जो रिश्ता है वो प्यार में बदल गया और ये भी उस उड़ती मछली की तरह खुबसुरत है..

💜

కళ్ళకీ రుచి ఉందని తెలిసింది

నీ అర విరిసిన చిరునవ్వును ఆ మత్తు కళ్ళను చూస్తుంటే నా జిహ్వకే కాదు కళ్ళకీ రుచి ఉందని తెలిసింది...

Looking at your smile and those mesmerizing eyes, I came to know that not only my tongue but my eyes also have taste buds...

तेरी मुस्कराहट और वो मदहोश कर देने वाली आँखों को देखकर मुझे पता चला कि मेरी जीभ ही नहीं मेरी आँखों में भी स्वाद कलिकाएँ हैं...

💜

అలలతో ఆగడాలతో ఎగసిపడే నీ కురులు

ఎన్నో జలపాతాల భూమి ఇది కానీ స్వర్గం కూడా చూడని సరస్సును చేరని జలపాతం ఏదో తెలుసా?
మరేది కాదు అలలతో ఆగడాలతో ఎగసిపడే నీ కురులు..

This is the land of many waterfalls, but do you know any waterfall that does not reach the puddle that even heaven has not seen?
It is your beautiful wavy hair..

💜

నా కనులను ఆకర్షిస్తుంది

అందమైన ప్రతిదీ నా కనులను ఆకర్షిస్తుంది,
కానీ నీ అందం నా కనులలో నిలిచిపోయింది...

Everything beautiful attracts my eyes, but your beauty stuck to my eyes..

हर खूबसूरत चीज मेरी आंखों को आकर्षित करती है,
लेकिन तुम्हारी सुंदरता मेरी आँखों से चिपक गई..

💜

నవ్వు తుంపరులు

ఆకాశంలో ప్రకాశించే ప్రతిదీ, నీ నవ్వు చల్లిన తుంపరులని అనుకుంటున్నా..

whatever is so bright in the sky, 
I think those are splashes of your smile...

💜

రెప్పల దుప్పటి

నీ రెప్పల దుప్పటిని కప్పుకొని ఎవ్వరు చూడని నీ కలల ప్రపంచాన్ని చూడవచ్చా?

can I please go under your lids duvet and see the unseen world of your dreams?

💜

అయిపొతుందెమో అని

నీ సందేశాలను చదవడానికి చాలా సమయం పడుతుంది. భాష తెలుసు కానీ ప్రతి అక్షరాన్ని దాటి వెలుతుంటే ఎక్కడ అయిపొతుందెమో అని దిగులు కలుగుతుంది...

What takes too long is to read your messages. I know the language but I am worried about reaching the end word quickly...

💜

చూపుకు సంకెళ్లు

నా చూపుకు సంకెళ్లు వేసే నేర్పు నీకు మట్టుకే ఉంది..

You only have the skill to put shackles to my sight..

💜

నా మది సంగతేంటో చెప్పేదేముంది?

నా ప్రేమలోని ఒక చిన్న ముక్కను కాల్చి చూసాను,
ఆ పొగ కమ్మిన చోటంతా ప్రేమ అల్లుకుంది, 
పూడ్చి చూసాను, ప్రతి ఇసుక రేణువులోనూ ప్రేమ కలిగింది, నింగిలోకి విసిరాను, వెన్నెలలో తారలలో వేకువలో చీకటిలో ప్రేమ పొంగింది, ఒక చిన్న ముక్క ఈ లోకాన్నే మార్చేస్తే, మిగతా ప్రేమ నాలోనే ఉంది, మరి నా మది సంగతేంటో చెప్పేదేముంది?

I burnt a little piece of my love, Wherever smoke touched, love entwined, I buried it, and every grain of sand fell in love, I threw it into the sky, love sparked in the moon in the stars in the dawn in the dark, if a small piece changes the world, the rest of the love is still in me, and I don't think I should explain how i feel?

💜

పుట్టినరోజు అసలైనది కాదు

నీ పుట్టినరోజు అసలైనది కాదు,
నిన్ను అంత అందంగా మలచడానికి దేవుడు కొన్ని రోజులు తీసుకున్నాడు లేకుంటే నువ్వు ఎప్పుడో పుట్టుంటావు...

Your birth date isn't real,
God took few more days to make you so special otherwise you would have been born much earlier...

आपकी जन्मतिथि वास्तविक नहीं है, भगवान ने आपको इतना खास बनाने के लिए कुछ दिन और इंतजार किया वरना आप बहुत पहले पैदा हो गए होते...

💜

పరవశించదు తన పరదా తీయదు

గాలి ఊసు లేని కొమ్మ విరిగిపోదు కానీ ఆడదు ఊగదు,
నీ ఊసు లేకుంటే హృదయం ఆగిపోదు కానీ పరవశించదు తన పరదా తీయదు...

A green branch full of fruits and leaves neither moves nor swings with joy in the absence of wind but remains alive,
Despite everything in life, the heart is not free and removes its veil without you, but it beats...

फल-पत्तियों से भरी हरी डाली हवा के अभाव में न तो हिलती है और न झूमती है, लेकिन जीवित रहती है,
ज़िन्दगी में सब कुछ होते हुए भी दिल आज़ाद नहीं होता और तुम्हारे बिना पर्दा हटा देता है, लेकिन धड़कता है...

💜

రాయిలా మారింది

నీ ప్రేమలో పడ్డ నా మనసు మంచులా కరగలేదు రాయిలా మారింది,
మరెవ్వరూ దానిని కరిగించలేరు విరవలేరు,
ఉలితో చెక్కినా సరే ఆ శిల్పము నీ రూపమే తీసుకుంటుంది కానీ ఉలికి లొంగిపోదు మరే రూపము తీసుకోదు...

My heart that fell in love with you did not melt like ice but turned like stone.
No one else can melt it nor break it,
Even if you carve it with a chisel, the sculpture will take your form, but it will not surrender to the chisel, it will not take any other form...

मेरा दिल जो तुम्हारे प्यार में पड़ गया वह बर्फ की तरह नहीं पिघला बल्कि पत्थर की तरह हो गया। कोई और इसे पिघला नहीं सकता और न ही इसे तोड़ सकता है, छेनी से भी तराशोगे, तो मूर्ति तुम्हारा रूप ले लेगी, पर छेनी के आगे न झुकेगी, और कोई रूप न लेगी...

💜

కలకు కాళ్ళుంటే

If my dream have legs,
And if it go out past my head,
Dear, believe me it looks exactly like you...

కలకు కాళ్ళుంటే,
అది నా తలను దాటి బయటకి వస్తే,
ప్రియతమా, అది నీ రూపంలోనే ఉంటుంది..

अगर मेरे सपनों के पैर हैं,
और अगर यह मेरे सिर के बाहर चला जाता है,
मेरे प्रिय, मेरा विश्वास करो, यह बिल्कुल तुम्हारे जैसा दिखता है ...

💜

నిన్ను చేరాలని చూడాలని ఆశ కలిగిందట

నీ గురించి ప్రతి జీవికి నిర్జీవికి చెప్పాను,
అది విని దేవుడు నిర్జీవమైన వాటికి ప్రాణం పోయలని నిర్ణయించాడు,
ఎందుకు అంటే,
వాటికి నిన్ను చేరాలని చూడాలని ఆశ కలిగిందట..

I told about you to all life and lifeless things in this world,
Later god decided to give life to all lifeless things,
as they also got desire to see you and reach you..

💜

కందిపోయేంత సొగసు

పువ్వును నలిపితే నీ చేతులు కందిపోయేంత సొగసు నీది ఇంతకంటే సొగసరి ఇంకెక్కడ ఉంటుంది...

You are so sensitive that your hands will burn if you crush a flower, Where else I can find someone beautiful than you...

💜

కనులార్పడం మహా పాపం

Blinking is a sin while looking at you so I don't blink...

నిన్ను చూస్తునప్పుడు  కనులార్పడం మహా పాపం అందుకే ఆర్పకుండా చూస్తుంటాను...

💜

నీ నవ్వు చాలా పొడవు

Your smile is so lengthy that I can land billions of kisses between the two cheeks...

నీ రెండు బుగ్గల మధ్య కొన్ని కోట్ల ముద్దులను పెట్టగలను ఎందుకంటే నీ నవ్వు చాలా పొడవు...

💜

నల్లటి కాంతి

నల్లటి కాంతిని ఎవరైనా చూడాలి అనుకుంటే తన మెరిసే కురులను చూడండి..

whoever wants to witness the black rays please look at her lustering hair...

💜

కవిత వ్రాయడం సులువే

కవిత వ్రాయడం అన్నది చాలా సులువైన పని,
నీ పేరు ఒక్కటి రాస్తే చాలదా,
నా భావాలన్నీ కుమ్మరిస్తే వస్తే చరణమే నీవని చెప్పడానికి...

Poetry writing is very easy, Just writing your name is enough to say that you are a beautiful poem that came out of my feelings..

कविता लिखना बहुत आसान है,
तेरा नाम लिख देना ही काफी है ये कहने के लिए कि तू मेरे एहसासों से निकली वो खुबसूरत छंद है..

💜

సీసాలో ఉన్న సముద్రం నువ్వు

సీసాలో ఉన్న సముద్రం నువ్వు,
ఉప్పొంగినా లోలోనే దాచుకుంటావు,
తెరిచేదెవరో వారితోనే నీ అలజడిని పంచుకుంటావు,
సీసాలో సముద్రమేంటి అని ప్రశ్నించేవారికి సమాధానం కాలేవు...

You are a bottled ocean,
You hide the tides and the turmoil,
you don't overflow or appear full unless the one whom you love opens it,
so you are an impossible to all who questions your nature...
💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...