ఉప్పెన

ఒక్కసారిగా ఉప్పెనలా నువ్వు,
అందులో తడిసి మెరిసే తీరపు మట్టిలా నేను,
నాపై రాసుకున్నవన్నీ నీలో దాచుకుంటావు,
నీలో దాచుకున్నవి నాకై వదిలిపోతావు,
అందరికి కఠినంగా ఉప్పగా ఉండచ్చేమో నీ ప్రేమ,
కానీ నాకెప్పుడూ ఒక తియ్యని తాకిడే...
❤️

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...