అందం

చీకటి చుక్క తారపై పడి వెలుగు మగువై కురులు విరసి వెన్నెలంత నవ్వు అద్దుకొంది వేకువంత వెలుగు విరజిమ్ముతోంది....

రెప్పల చప్పుడు

కను రెప్పల చప్పుడు వినిపించదని అన్నవాడు,
 నీ కను సైగలను చూసివుండడు,
అవి ఎంత మాయ చేస్తాయో, 
ఎన్ని ఊసులు చెబుతాయో,
ఆ కబుర్లు విన్న నాకు తెలుసు,
ఆ ప్రేమ అందుకున్న నా మనసుకి తెలుసు...

దాగదు

పట్టు తెరవెనుక గాలి దాగదు నీ మనసు వెనుక ప్రేమ దాగదు...

తీపి గుర్తు

మది కొమ్మనుంచి పూచిన పువ్వు ఆ కొమ్మనే ముద్దాడితే అంతకంటే తీపి గుర్తు ఏముంటుంది....

ಮಸುಕಾಗುವುದಿಲ್ಲ/never fades

ಕನಸುಗಳ ಅತ್ಯುತ್ತಮವು ನಿಮ್ಮೊಂದಿಗಿದೆ, 
ಉಳಿದವುಗಳು ನಿಮ್ಮಿಲ್ಲದೆ ಇವೆ, 
ಅದು ಏನೇ ಇರಲಿ, 
ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಎಂದಿಗೂ ಮಸುಕಾಗುವುದಿಲ್ಲ ...
-------------------------
best of the dreams are with you, 
rest of them are without you, 
whatever it is, 
the thought of you never fades...

ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗಿರುವ ದಿನ / the day I am with you

ನಾನು ಹಳೆಯ ನೆನಪುಗಳನ್ನು ಮರಳಿ ತರುತ್ತೇನೆ, 
ಹಳೆಯ ಪ್ರೀತಿಯನ್ನು ಮರಳಿ ತರುತ್ತೇನೆ, 
ಬೀದಿ ದಿನಗಳನ್ನು ಮರಳಿ ತರುತ್ತೇನೆ, 
ನನ್ನ ಬಾಲ್ಯವನ್ನು ಮರಳಿ ತರುತ್ತೇನೆ, 
ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗಿರುವ ದಿನ, 
ಎಲ್ಲ ಸಂತೋಷವನ್ನು ಮರಳಿ ತರುತ್ತೇನೆ ...
-----------------------------
i will bring back the old memories, 
i will bring back the old love, 
i will bring back the street days, 
i will bring back my childhood, 
the day i am with you, 
i will bring back myself...

ಜೀವನದ ಗುರುತುಗಳಾಗಿವೆ/life marks

ನನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಕನಸುಗಳು, 
ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಪ್ರೀತಿ, 
ನನ್ನ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ರೂಪ, 
ಎಷ್ಟು ರಾತ್ರಿಗಳು ಅವುಗಳನ್ನು ಜಯಿಸಲು ಪ್ರಯತ್ನಿಸಿದರೂ, ಅದು ಎಷ್ಟು ಕತ್ತಲನ್ನು ಅನ್ವಯಿಸಿದರೂ, 
ಆ ಗುರುತುಗಳು ಬಿಡುವುದಿಲ್ಲ, 
ಆ ಗುರುತುಗಳು ನನ್ನ ಜೀವನದ ಗುರುತುಗಳಾಗಿವೆ. ..
--------------------------
Your dreams in my eyes, 
your love in my heart, 
your form in my thoughts, 
no matter how many nights try to conquer them, 
no matter how much darkness it applies, those marks will not leave, 
those marks are my life marks...

ದಣಿದ/Tired

ದಿನ ನಿದ್ರೆ ಪಡೆಯುತ್ತಿದೆ,
ಇದು ಪ್ರಕಾಶಮಾನವಾಗಿರಲು ತುಂಬಾ ಆಯಾಸಗೊಂಡಿದೆ,
ಕಾಳಜಿ ವಹಿಸಲು ರಾತ್ರಿ ಇದೆ,
ಆದರೆ ಅದು ತುಂಬಾ ಸ್ವಾರ್ಥಿ
ಅದು ಅವಳ ಸುಂದರ ಕನಸುಗಳಿಗೆ ಮಾತ್ರ ಹರಡುತ್ತದೆ ....
-----------------------------------
The day is getting sleep, 
it is so tired of staying bright, 
night is there to care, 
but it is so selfish that
It spreads only for her beautiful dreams....

నీ అందం మరి దేనికుందో చూపలేనే/I can't show the one which is as beautiful as you

నీటి బొట్టు కూడా ఇష్టపడదేమో జారడానికి నీపై పడితే, మరి మా చూపు జారుతుందా ఆ ఒంపులపై ఒక్కసారి వాలితే, 
ఎన్నో అందాలలో నువ్వు ఒక అందం, 
కానీ నీ అందం మరి దేనికుందో చూపలేనే...
-------------------------------
Even the water droplet don't wish to slide when on you, 
then how our eyes can slip once they fall on the curves, 
I know you are one among several beautiful things, 
but I can't show the one which is as beautiful as you...

స్నేహం మధురం రమ్యం శాశ్వతం

ఒక చిన్న పరిచయం పెద్ద సంతోషాన్ని కలిగించింది, ఒక చిన్న మాట ఎదురు చూపులకు సమాధానం ఇచ్చింది, అనుకోలేదు నీ పరిచయం సాధ్యమని, నేస్తమా నాలో ఆరని జ్ఞాపకాన్ని నింపావు, ప్రతిరోజు ఉదయంతో పాటు నువ్వు గుర్తుకు వస్తావు, కనుల ముందు కాకున్నా తియ్యటి అనుభవాన్ని మనసుకు ఇచ్చావు, ఎంతని కొనియాడను నీ స్నేహాన్ని, నీ స్నేహం మధురం రమ్యం శాశ్వతం.... 

అమ్మ నిను చూస్తున్నా

అమ్మ నిను చూస్తున్నా, కరుడుగట్టిన గుండెతో నిను చూస్తున్నా, నీ బాధని నీ ఓర్పుని కనులతో కాక మరెలా అనుభవించను? నీకు వచ్చిన లాభాన్ని నాలా కన్నావు లాభాన్ని వేరుచేసుకున్నావు, నీలో ఉన్న సంతోషాన్ని నాకు పంచుతు పూర్తిగా ఇచ్చేసావు, కష్టాన్ని మరిచిపోయి నన్ను చూస్తూ మురిసిపోయే నీ కనులను చూస్తున్నాను, కన్నీటికీ అడ్డుకట్ట వేసి సంద్రాన్నే నిలువరించావు గుండెల్లో, అమ్మ నిను చూస్తున్నా, చూస్తూ ఉండిపోతున్నా...

వెతుకులాట ఆపను

తూరుపుకు వస్తావని పొద్దు తిరుగుడులా వేచివుంటే పడమట ఉదయించాలని కోరుకున్నావు, పడమట ఉదయిస్తే కలువలా విచ్చుకుందామని అనుకుంటే, అమావాస్య వేళ రాలేనని చాటేశావు, ఓ ప్రియతమా నీకై నా ఎదురు చూపులు విరమించను, వెలుగునై చీకటై నీకోసం వెతుకులాట ఆపను....

ప్రేమ వేరుకాదు

అంత మొందించి ప్రేమను అలుముకుంటావా మేఘమా, 
కన్నీటి ధారకై ఎదురుచూస్తావా, 
పిడుగు వేసావు పసి హృదయం పైన, 
దాని అరుపు వినిపించలేదా, 
రక్తంలో ఒక భాగం తన ఆయువు మరొకభాగం నేను, 
నన్ను వేరు చేస్తే ప్రాణం ఉంటుంది కానీ ప్రేమ వేరుకాదు...

అలసిపోనే నీ సొగసు చూస్తూ

వెచ్చని వేకువతో విసుగొస్తుందా?,
చల్లని వెన్నెల పాతబడుతుందా?,
అలసిపోనే నిను తలచుకొంటూ, 
విసిగిపోనే నీ సొగసు చూస్తూ,   
ప్రతి రోజు ఇచ్చిన బహుమతి నువ్వు, 
నాతోటే ఉండే ప్రాణం నువ్వు, 
కనిపించు కరుణించు ఏకాంతానికి తెరదించు...

ప్రేమనే లేదంటే

ప్రేమనే లేదంటే పున్నమిలో సంద్రానికి ఆ పొంగెందుకు?
ప్రేమనే లేదంటే రవి కిరణంతో సూర్యకాంతికి చెలిమెందుకు?
మనసే లేని వయసే లేని రెండు జత కోరుతుంటే,
వయసుండి మనసుండి జత కోరనా...
నీకై పరితపించనా...

ప్రేమ ఒక్కటే/love is one

నీకు నాలా మనసు లేదు...
నాకు నీలా మనసు లేదు...
కానీ ఒకరికొకరం...
మనది ఒకటే ప్రేమ...
------------------------------------
You don't have the feelings like me...
I don't have the feelings like you...
But we are for each other...
We love each other...

ఎవరు ముందైనా ప్రేమ మారదు/love has no age

చీకటి ముందా నేను ముందా...
వెన్నెల ముందా నేను ముందా...
జాబిలి ముందా నేను ముందా...
వయసు ఎంతున్నా వాటిని ప్రేమించడం మానలేకున్నా...
---------------------------------------------
 Though you are eldest 
I can't stop loving you...
Oh night!
Oh moon!
I love you forever n ever..

కదలిక లేకుండా/without movement

తెలియకనే కను మూసా నీ కల కోసం, మరువనులే మన ప్రేమ ఇచ్చిన జ్ఞాపకం, ప్రతీ క్షణం నా నీడ, నీ ప్రతిరూపం అవుతుంటే, ప్రతి సడి పంచె శ్వాస నువ్వు అవుతుంటే, నీటిలోనే ఉన్నా వలలో చిక్కిన చేపనై, ప్రాణం పోసుకుంటూ కదలిక లేకుండా...
--------------------------------------
Without your love I am just alive without movement like the fish trapped in a net but still in the water...

ఇంతలా అందమా/such a beauty

వేసినా చెక్కినా ఇంతలా అందమా...
వెన్నలకి ప్రతిరూపం చేయడం సాధ్యమా...
--------------------------------
Is it possible to draw or carve such beauty?
Can anyone make the clone of moon light?

తిరిగి రాగల మార్గం/Way To Come Back

ఎంత లోతుకైనా మహోన్నత శిఖరాలకైనా వెళ్ళచ్చు కానీ తిరిగి రాగల మార్గాన్ని కూడా కల్పించుకోవాలి....
ఎత్తుకెదిగి దిగలేకున్నా లోతుకెళ్ళి పైకి రాలేకున్నా ఆశయాలే నీకు అడ్డంకులౌతాయి...
-----------------------------------------------------
You can reach the deepest or the heighest but make a way to come back. Otherwise your  achievement will arrest you at some point....

కానుకలెనున్నా/Whatever The Gifts We Receive

కానుకలెనున్నా..
 కలిసే కనులు..
కదిలే అడుగు..
తాకే దూరం ఉంటేనే ప్రేమకు జీవం..
-----------------------------
Whatever the gifts we receive...
Love will stay alive only with those 
who can look into our eyes, who can come for us 
and 
who are in reach...

చూసినంతలో వలచింది/Love At First Sight

కొమ్మలో పట్టు లేక కాదు...
పువ్వుకి ఇష్టం లేక కాదు...
కానీ వాలిపోయింది ఎందుకో తెలుసా...
నిన్ను చూసినంతలో వలచింది అందుకే సొగసా...
----------------------------------------
Not because the branch can't hold...
Not because the flower don't like the branch....
But it just fell down you know why?
Because it fell in love with you instantly..

ఈర్ష్య/Jealousy

చలి మంట కూడా చెలికై వెతికింది మన సావాసం చూసి...
చిరు గాలి నను తాకక పోయింది అసూయ పడి...
నీ జతలో ఉంటే ఈర్ష్యకు అర్థం ఏమిటో తెలుస్తోంది...
అందుకే చీకటి ముసుగేసింది ఎవ్వరి కనులు పడనీయక ఒక వెన్నెలతో మరో వెన్నలను దాచింది...
-------------------------------------
Even the campfire is in search of it's pair...
Even the breeze didn't touch me out of anger...
With your company I now understand what jealous means...
That's why the night hiding this moon with another moon...

వలలో పడిన చేప/Fish In the Net

వెల కట్టలేని వలలో పడిన చేపను నేను...
వలలా కట్టిపడేయకుండా ఒడిలా చూసుకుంటోంది...
-------------------------------------------
I am a fish trapped in a valuable net...it feels like in a lap but not like killer net..

వజ్రం/Diamond

వజ్రం ఆభరణమైతే ఎంత అందంగా ఉంటుందో ఆయుధమైతే అంతే భయం కలిగిస్తుంది...
---------------------------------------------------------
Diamond is so beautiful as an ornament and it is equally dangerous as a weapon...

వర్షంలో మంచు తునక/ice drop in the rain

కుండపోత వర్షంలో కూడా ఒక్క మంచు తునక పడితే ఆ ఆనందమే వేరు..
అలా కొందరి పలకరింపుకు ఉన్న ప్రత్యేకతే వేరు..
----------------------------------------
A touch of ice drop in the rain will give even more pleasent feeling..
Just like that the greeting from special ones..

కంటిలో నలుసును పడనివ్వకు/don't let the dust fall in your eyes

లాగుతా తెగిపోకు మనసా, ప్రేమను పట్టుకుంటే అలుసౌతావు, సులువుగా ముడి విప్పుకో, కంటిలో నలుసును పడనివ్వకు..
---------------------------------------------------
My dear heart I am going to pull you, please be careful, don't tie yourself to love, it won't care you, go easy dettach from it,   don't let the dust fall in your eyes....

పరితపించు నిదానిస్తూ/slow down and keep yearning

దూరాలను కలపడానికి మెరుపులా మారావు, క్షణమే ఆ వెలుగు మళ్ళీ మాయమౌతుంది, మెరుపుతో కలిసి చినుకుల వంతెన కట్టావు, కొంత సేపే ఆ ఆనందం, మేఘం వెళ్ళిపోతుంది, పోరాటం చెయ్యడానికి నీకు ఆరాటం తప్ప ఆయుధం లేదు, పరితపించు పరితపించు నిదానిస్తూ నిదానిస్తూ...
----------------------------------------------------------
You became the lightning to make us close, but the light will not stay long, you built the bridge with rain drops, that happiness is short, the clouds will move away, to do the war you know how to struggle but you don't have any weapon, slow down slow down and keep yearning keep yearning...

అందానికి ప్రతిరూపం/The Replica Of Beauty

చినుకును శిల్పంగా మలిచితే నీ అందానికి ప్రతిరూపం కనబడుతుంది...
అది ఎంతవరకు సాధ్యమో కానీ అదొక్కటే నీ అందానికి వివరణ ఇస్తుంది...
---------------------------------------
Your beauty can be replicated by sculpting the rain drop...
Not sure about the possibility but it can only define your beauty...

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔