అమ్మ నిను చూస్తున్నా

అమ్మ నిను చూస్తున్నా, కరుడుగట్టిన గుండెతో నిను చూస్తున్నా, నీ బాధని నీ ఓర్పుని కనులతో కాక మరెలా అనుభవించను? నీకు వచ్చిన లాభాన్ని నాలా కన్నావు లాభాన్ని వేరుచేసుకున్నావు, నీలో ఉన్న సంతోషాన్ని నాకు పంచుతు పూర్తిగా ఇచ్చేసావు, కష్టాన్ని మరిచిపోయి నన్ను చూస్తూ మురిసిపోయే నీ కనులను చూస్తున్నాను, కన్నీటికీ అడ్డుకట్ట వేసి సంద్రాన్నే నిలువరించావు గుండెల్లో, అమ్మ నిను చూస్తున్నా, చూస్తూ ఉండిపోతున్నా...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️