మనకెందుకులే నాకేమిలే

మనకెందుకులే అని ఈ లోకాన్ని వదిలి కళ్ళు తిప్పుకుంటే, 
అది తిరిగి నన్నే చూస్తోంది,
కానీ లోకం వేరుగా నేను వేరుగా కనిపిస్తోంది,
లోకం తప్పు చేస్తే నేరం నేను చేస్తే చిన్న పొరపాటు,
అది మనసును ముక్కలు చేస్తే మోసం నేను చేస్తే సందర్భం,
అది సాయపడకుంటే నిర్దాక్షిణ్యం నేను చేయకుంటే చేతకానితనం,
ఎందుకో ఇంత తేడా అహం  పేరుకుపోయిందేమో నాలో,
అహమే కనుక తోలుపై ఉండేదైతే,
కోసివేసి కుంపటిలో పారవేసి ఉంటానే,
కాని కనిపించదు వదలిపోదు,
అవును ఒప్పుకుంటున్నా లోకమా నీలో నేను ఒకడినే, 
నువ్వే నేను నేనే నువ్వు,
నేను మారితే నువ్వూ మారుతావు...

ఒకే ఒక్క నక్షత్రం ఉన్న ఆకాశం

ఒకే ఒక్క నక్షత్రం ఉన్న ఆకాశాన్ని చూడాలా?  అయితే నువ్వు మాత్రమే ఉన్న నా మనసును చూడు....

దీపావళి

ఆ జువ్వ కంటే నా మదిని తాకే నీ నవ్వులే నాకు దీపావళి,
ఈ చీకటంతా వెన్నెలగా మార్చే నీ చూపులే నాకు దీపావళి,
మనది ఎన్నో పేలుళ్ల జీవితం,
అందులో కొన్నే సందళ్లు శాశ్వతం,
సగం చీకటి సగం వెలుగు కలిసిన పండుగై,
ఇద్దరమూ ఒక వేడుకై సాగిపోదాం...

గుండెకోత

కోసుకుంటే రక్తం కాక కన్నీరు ఎందుకో,
మోస్తూవుంటే బరువులేదు కానీ భారమెందుకో...

ఒక చక్కని పలకరింపు

విధిలేక వేకువ పలకరిస్తున్నా దానికి శోభ తెచ్చేది ఒక చక్కని పలకరింపు...

నేను గాలిని

నేను గాలిని,
స్వేచ్ఛగా తిరుగుతుంటా,
మంచి ముక్కులో దూరుతా,
చెడ్డ ముక్కులోను దూరుతా,
భేదాలు లేవు,
నన్ను ఆపని వారికి శ్వాసనౌతా,
నన్ను ఆపేవారిని దాటిపోతుంటా....

మిగిలిపోయేది కాదు నా జ్ఞాపకం

మిగిలిపోయేది కాదు నా జ్ఞాపకం,
మిగిలిన జీవితాన్ని నడిపించేది,
కలిగితే కలతనిచ్చేది కాదు నా జ్ఞాపకం,
కలిగే కొద్ది కనులముందు నిన్ను నిలిపేది....

వెన్నెలమ్మకు కోపమెక్కువ

వెన్నెలమ్మకు కోపమెక్కువ రాతిరమ్మ రాలేదని,
జాబిలమ్మకు తొందరెక్కువా వెళ్లిపోయే రావద్దని,
అలిగే బుగ్గలు నిప్పులా బగ్గుమంటుంటే, 
విరిసే చేమంతి కసిరే మేఘమౌతుంటే, 
మెరుపులు ఉరుములు ఎదురు చూపులు..

ప్రశ్న లేకపోతే

ప్రశ్న లేకపోతే
నిజానికి చోటు లేదు అబద్ధాలకు తావులేదు..

విరహం

చిటపటలాడే చినుకు చడి చప్పుడే లేకుండా ఉండిపోతే మెరుపు కూడా మూగబోతుంది ఆకాశమంతా మౌనం అలుముకుంటుంది...

మరింత అందం

కనులతో చూసి నీ అందాన్ని కోరికగా మార్చగకుండా అక్షరంలో దాచి దాన్ని మరింత అందంగా చేయనా?

surrender

One can put off the lamp but not the sun, either you have to hide or surrender.. விளக்கை அணைக்கலாம்; ஆனால் சூரியனை அல்ல. அதனால், நீ மறைந்துக...